బీహార్ రాష్ట్రం లో బాంకా అనే జిల్లా ఫులీడమ్మార్ అనే గ్రామం ఉంది .. ఈ జిల్లాకు చెందిన అనేక మంది విధులు నిర్వర్తించేందుకు అనేక రాష్ట్రాలకు వెళ్లారు. కాగా ఆ జిల్లాకు చెందిన కొందరు తెలంగాణ రాష్ట్రానికి కూడా పనులు వెతుకుతూ వచ్చారు. వారికి మంచి విద్య లేదు, పండించుకోడానికి పంట పొలాలు కూడా లేవు వారికి వచ్చిందల్లా రుచికరంగా వంట చేయడం. ఆ వంట అనే కళే వారి, వారి కుటుంబాలా కడుపులు నిపుతుంది.

 

కాగా ఆ వంటవాళ్లు కలినరీ ఆర్ట్స్ లో మంచి నైపుణ్యంగల వాళ్ళు , అనేక వెరైటీల భజనం తయారు చేయగల నేర్పరులు. హైదరబాద్ లోని ప్రసిద్ధి గాంచిన హోటల్స్ లో వంట మనుషులుగా మాస్టర్లు పని చేశారు. హైదరబాద్ లోని ఫేమస్ హైదరాబాదీ దమ్ బిర్యానీ అమ్మబడే ప్యారడైస్ హోటల్ లో స్కై గార్డెన్ హోటల్ లో బసీరా హోటల్ లో గతంలో పని చేశారు. కానీ కరోనా వచ్చిన నేపద్యంలో లాక్ డౌన్ విధించడంతో ఈ కార్మికులు వలసలు కట్టి తిరిగి తమ ఊరికి వెళ్ళిపోయారు.

 

బీహార్ ప్రభుత్వంలో ఓ అద్భుతమైన పథకం ఉంది. కళ, నైపుణ్యం, క్రియేటివిటీ ఉండి కూడా మంచి ప్లాట్ ఫామ్ లేని వాళ్ళు ఎందరో ఉంటారు. అటువంటి వారికోసం బీహార్ ప్రభుత్వం సర్వే లు చేసి వారిని ఆశ్రయిస్తుంది. ఈ నేపద్యంలో బాంకా లోని ఫులీడమ్మార్ గ్రామంలో నివసిస్తున్న ఈ వలస కార్మికులను వెతుకుతూ ప్రభుత్వం వారి గ్రామానికి వెళ్లింది. ప్రభుత్వం తరఫున జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ వారిని ఆశ్రయించడంతో ఆ కార్మికులు అధికారులకు మంచి విందు ఏర్పాటు చేశారు.

 

ఆ విందులో ఆ కార్మికులు హైదరాబాదీ మటన్ దమ్ కా బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65, చిల్లీ చికెన్, పన్నీర్ 65 వంటి డిషెస్ ను విందులో ఏర్పాటు చేశారు. వాటిని ఆరగించిన అధికారులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ కార్మికుల్లో ఇంటర్ నేషనల్ స్టాండర్స్ ఉన్నాయని వారి వంట అద్భుతం అని ప్రశంసించారు. ప్రభుత్వం తరఫున వారికి సహాయాన్ని ఏర్పాటు చేస్తామని వారు మరలా తిరిగి హైదరబాద్ కు వెళ్ళే పని ఇక లేదని వారికి హామీ ఇచ్చారు.

 

వారికోసం ప్రభుత్వం దాదాపుగా 15 కంపెనీలతో చర్చలు జరిపి ఆయా కంపెనీల్లోని క్యాటేరింగ్ టెండర్ ను ఆ కార్మికులకు ఇప్పించారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కూడా క్యాటేరింగ్ ను వారికే అప్పగించారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలకు కూడా క్యాటేరింగ్ బాధ్యతలను వారికే అప్పగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతీ సంవత్సరం క్యాటేరింగ్ కు టెండర్ నిర్వహిస్తారు ఆ టెండర్లు కొనుగోలు చేయాలంటే దాదాపుగా కోటి రూపాయల వరకు ఉంటుంది.

 

ఇక ఆ క్యాటేరింగ్ టెండర్లను కూడా వారికే అప్పగించారు. ఇలా ప్రభుత్వం వారికి సాధ్యమైనంత వరకు వారి పరిధిలో ఉండే క్యాటేరింగ్ బాధ్యతలను వారికే అప్పగించడం గమనార్హం. అలా బీహార్ కు ఇప్పటివరకు దాదాపుగా 5000 మందికి పైగా కార్మికులు తిరిగి వెళ్ళిపోయారు అందులో ఎందరో వేటర్లు, సర్వీస్ బాయ్స్, హౌజ్ కీపింగ్ బాయ్స్ ఇలా ఎందరో కార్మికులు తిరిగి వెళ్ళిపోయారు వారందరికి ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఉపాధి కల్పించాలని చూడటం ప్రశంసనీయం...! అభినందనీయం తెలంగాణ రాష్ట్రం చేయలేని ఆలోచన బీహార్ రాష్ట్రం చేయగలిగింది. తెలంగాణ నుండి హైదరాబాదీ బిర్యానిని బీహార్ చెబుతూ తీసుకెళ్లింది బీహార్ బేష్...!

మరింత సమాచారం తెలుసుకోండి: