జాతీయ వాదం... అమెరికా భారత్ లో పదే పదే  వినపడుతున్న పధం. సాధారణంగా దేశాధినేతల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చాలా తక్కువ. ఎప్పుడో ఫిడేల్ క్యాస్ట్రో, సద్దాం హుస్సేన్ లాంటి నేతలే వాడారు గాని ఆ తర్వాత ఎవరూ వాటిని వాడే ప్రయత్నం చేయలేదు. పాకిస్తాన్ లో ఏ దేశాధినేత పదవి చేపట్టినా సరే సైన్యం అవసరం ఉంటుంది గాని ఆ పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు. మన దేశంలో రాజకీయ పార్టీలు జాతీయ వాదం అనడమే గాని ప్రభుత్వాలు ఆ మాటను తీసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ.

IHG

పీవీ, అటల్ జీ లాంటి దిగ్గజ నేతలు మాత్రమే దేశాన్ని ప్రేమించండి అని చెప్పారు గాని  దాని ప్రస్తావన ఎక్కడా లేదు. ఇప్పుడు మాత్రం నరేంద్ర మోడీ సారధ్యంలోని దేశ భక్త ప్రభుత్వం మాత్రం ఆ పదం ఎక్కువగా వాడుతూ రాజకీయం చేస్తుంది. ఇప్పుడు అదే రాజకీయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాడుతున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాక ముందు... మాట్లాడిన కొన్ని మాటలు...  మెక్సికో గోడ కడతాను, మెక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్. ఇవి కాక అక్కడ అధికంగా ఉండే భారతీయులను దగ్గర చేసుకోవడానికి గానూ కొన్ని మాటలు మాట్లాడారు. 

 

రాహుల్ గాంధీకి ట్రంప్ టవర్స్ లో ఒక ఫ్లాట్ ఉచితంగా ఇస్తాను అని. రాహుల్ గాంధికి కాస్త యూత్ లో ఫాలోయింగ్ ఉంటుంది. దానిని క్యాష్ చేసుకోవాలి అని ఆయన భావించారు. అదే విధంగా ఇస్లామిక్ ఉగ్రవాదం అని... మన దేశంలో మోడీ పదే పదే వాడే మాటను ఆయన కూడా వాడుకున్నారు. అమెరికాలో గతంలో జరిగిన భీకర ఉగ్రదాడులను ఆయన ప్రస్తావించారు ఎన్నికల ప్రచారంలో. అంతే కాదు నా ఎన్నికల ఖర్చు నేనే పెట్టుకుంటాను గాని ఎవరి మీద ఆధారపడను అంటూ 600 కోట్లను ఆయన ఖర్చు చేసారు. 

IHG

ఇవి అన్ని అమెరికన్స్ కి బాగా వెళ్ళాయి. దేశం మొత్తం ట్రంప్ కి ఎదురు గాలి వీచినా సరే యువ ఓటర్లు ఎక్కువగా ఉండే ఎలక్టోరల్ కాలేజి పరిధిలో మాత్రం ఆయన భారీ మెజారిటి సాధించి క్లింటన్ ని ఇబ్బంది పెట్టారు. ట్రంప్ మాటలు యువతలో బాగా వెళ్ళాయి అప్పుడు. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అదే రాజకీయం దాదాపుగా జరిగింది. ఇస్లామిక్ దేశాల నుంచి వలసలు ఉండవద్దు అని వీసా నిబంధనలను కఠిన తరం చేయడమే కాకుండా... వారికి అనేక షరతులు విధించి ఒకరకంగా అవమానించారు కూడా. 

 

జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఉదంతాలు అమెరికా వ్యాప్తంగా చాలానే జరిగాయి. ఆ తర్వాత ట్రంప్ కి మోడీ స్వాగతాలు, మోడీకి ట్రంప్ స్వాగతాలు... ఇలాంటివి చాలానే జరిగాయి. ముందు అమెరికా వెళ్ళిన మోడీ... వైట్ హౌస్ దగ్గర అనుకుంట ట్రంప్ ని హగ్ చేసుకున్న సమయంలో వీపు మీద చరిచారు. ఇది జాతీయ మీడియా అంతర్జాతీయ మీడియా కూడా హైలెట్ చేసింది. ఎందుకంటే అప్పటి  వరకు ఏ అమెరికా అధ్యక్షుడ్ని కూడా  ఏ దేశాధినేత కూడా ఆ రకంగా హగ్ చేసుకున్న సందర్భం నేది లేదనే చెప్పాలి. 

ఆ వీడియోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి అప్పట్లో. అక్కడ ఉన్న ఇండియన్ లు కూడా దీనిని గర్వంగా చెప్పుకున్నారు. ఇక్కడ ఉన్న అమెరికన్లు కూడా అది మన స్నేహం అన్నట్టు మాట్లాడారు.  కాని ఆ సీన్ చూసిన రాజకీయ పరిశీలకులు మాట్లాడిన మాట ఏంటీ అంటే... దేశాధినేతల మధ్య ప్రేమానురాగాలు పెరిగాయి అని..  అక్కడి నుంచి కూడా మోడీ ట్రంప్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఏ దేశాధినేతలు కూడా ఈ స్థాయిలో అమెరికా తో సావాసం చేసిన సందర్భం లేదు అనే చెప్పాలి. 

ఇప్పుడు అమెరికన్లను ట్రంప్ రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ మన  మీద ఎలా అయితే కుట్రలు చెయ్యాలి అని చూస్తుందని మోడీ పదే పదే చెప్తూ ఉంటారో.... అమెరికా శత్రు దేశం రష్యా కూడా అలాగే తమ మీద కుట్రలు చేస్తుంది అని ట్రంప్ వ్యాఖ్యలు చేయడం విశేషం.  ఎన్నికల ముందు మన నిఘా వర్గాలు ఏ విధంగా అయితే మోడీ మీద దాడి జరుగుతుంది, నేపాల్ నుంచి ఉగ్రవాదులు వస్తున్నారు, చైనా సరిహద్దుల్లో అలజడి రేగే అవకాశం, దేశ రాజధాని మీద ముంబై తరహా దాడి అని చెప్తారో... 

 

అమెరికాలో కూడా అలాంటిదే జరుగుతుంది. రష్యా ఆర్మీ... ఆఫ్ఘన్ లో సిరియా లో ఉన్న అమెరికా సైనికులను చంపడానికి గానూ సుపారీ ఇచ్చింది అని... ఒక పక్క తాలీబాన్లతో సావాసం చేస్తున్నాం ఇక ఆఫ్ఘన్ లో యుద్ధం ఉండదు అని చెప్తూనే నిఘా వర్గాలు ఈ తరహాలో వ్యాఖ్యలు చేసాయి. ఆఫ్ఘన్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా సైనికులు, తాలీబాన్ లు కలిసి రాజ్యం ఏలుతున్నారు. తాలీబాన్లకు అన్ని విధాలుగా అమెరికా సైనికులు నల్ల మందు మార్కెటింగ్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో  ఉన్నాయి. 

ఆ నల్ల మందుని కొనేది కూడా అమెరికన్ కంపెనీలే ఎక్కువగా. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్... చైనా రష్యాను పదే పదే విమర్శిస్తున్నారు. ట్రంప్ వాస్తవానికి ఈ  నాలుగేళ్ళలో చేసింది ఏమీ లేదు అనే విషయం ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ ఆపేసినా, హెచ్ 1 బీ వీసాలు ఆపేసినా. అన్నీ కూడా అక్కడి జాతీయ వాదాన్ని పెంచడమే. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఏ రాష్ట్ర ఎన్నికలు వచ్చినా సరే సరిహద్దుల తగాదాలు మనకు షరా మామూలే. 

 

అమెరికా కూడా ఇప్పుడు మెక్సికో తో తగువు పెట్టుకుంటుంది. అందుకే అమెరికాను ఉద్దేశించి మెక్సికో మంత్రి ఒకరు... సరిహద్దుల్లో గోడ కట్టాల్సింది అమెరికా కాదు మనం అని వ్యాఖ్యానించారు. అమెరికాలో మెక్సికో కి చెందిన వ్యవసాయ కూలీలు 80 శాతం. వారు అక్కడ వ్యవసాయం చేయకపోతే అమెరికా రైతులకు జొన్నలు సహా కొన్ని పంటల గురించి అవగాహన ఉండదు. మెక్సికో లో తినడానికి తిండి లేని వాళ్ళు అందరూ కూడా  అమెరికా వెళ్తారు. అదే విధంగా మెక్సికో  నుంచి అమెరికాకు 70 శాతం డ్రగ్స్ వెళ్తూ ఉంటాయి. 

ఆ దేశమే ఎక్కువగా అమెరికా మీద ఆధారపడుతూ ఉంటుంది. ఆ ప్రకటన వెనుక కచ్చితంగా ట్రంప్ ఉన్నారనే విషయం అందరికి అర్ధమవుతుంది. గతంలో ట్రంప్ అధ్యక్షుడు అయిన కొత్తలో మెక్సికో దేశాదినేతకు ఫోన్ చేస్తే ఇలాంటివి మీరు చేయవద్దు అని అమెరికా భద్రతాధికారులు చెప్పారని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచే ఆ రెండు దేశాల మధ్య సావాసం ఎక్కువగా నడిచింది. ఇలాంటి ప్రకటనలు అన్నీ కూడా ట్రంప్ మోడీ నుంచి నేర్చుకున్నవే. అందుకే నమస్తే ట్రంప్ అనే కార్యక్రమం కూడా అంత ఘనంగా చేసింది ఇండియా. 

IHG

అహ్మదాబాద్ లో కరోనా కేసులు ఎక్కువగా రావడానికి నమస్తే ట్రంప్ కార్యక్రమం ఒకటి అని  కాంగ్రెస్ గుజరాత్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నారు. అది నిజం కూడా... కాని దాన్ని  జాగ్రత్తగా మ్యానేజ్ చేసుకుంటూ వచ్చింది గుజరాత్ సర్కార్. గుజరాత్ లో కేసులు ముంబై తో పోటీ పడగా కేరళ నుంచి వైద్య బృందాలను పంపించారు అని కూడా అన్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర బృందాలు వెళ్ళాయి. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో... అమెరికాలోని భారతీయులను దగ్గర చేసుకోవడానికి టెండూల్కర్ కోహ్లీ, స్వామీ వివేకానంద వంటి వారిని పదే పదే కీర్తించారు  ట్రంప్. ఇలాంటి రాజకీయం కేవలం మోడీ నుంచి ట్రంప్ నేర్చుకున్నదే...

 

మరింత సమాచారం తెలుసుకోండి: