ఏదో ఒక అంశంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీకి అమరావతి వ్యవహారం చక్కటి అవకాశంగా కనిపిస్తోంది. ఈ అంశం ద్వారా ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి రాజకీయంగా పైచేయి సాధించాలని, తద్వారా ప్రజల్లో మరింత సెంటిమెంటును చేయాలనే వ్యూహంతో టిడిపి ముందుకు వెళుతుంది. అసలు గత టిడిపి ప్రభుత్వంలో అమరావతి ప్రాజెక్టును మొదలుపెట్టినప్పటి నుంచి దీని చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే  ఉన్నాయి. చక్కటి సారవంతమైన భూములను రాజధాని నిర్మాణాలకు తీసుకోవడం సరికాదని, అలాగే ఈ ప్రాంతం అంతా అనువైనది కాదని, ఎన్నో సందేహాలు అప్పట్లో వ్యక్తమైనా, అప్పటి ప్రతిపక్ష వైసిపి దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసినా, చంద్రబాబు మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

IHG

 

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పించి నిర్మాణ పనులు మొదలు పెట్టినా, ఐదేళ్ల సమయంలో కేవలం కొంత మేరకు మాత్రమే వాటిని పూర్తి చేయగలిగారు. అసలు ఈ అమరావతి ప్రాజెక్ట్ ద్వారా, తెలుగుదేశం పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు రియల్ ఎస్టేట్ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి .దీని చుట్టూ వివాదాలు కూడా నడిచాయి. పైగా చంద్రబాబు వివిధ దేశాల రాజధానులు, నమూనాలను తీసుకు రావడం, వాటిని గ్రాఫిక్స్ లో చూపిస్తూ, ఇదే రాజధాని అంటూ ప్రజల్లో భ్రమ కల్పించడం, ఇలాగే ఐదేళ్లపాటు నెట్టుకు వచ్చారు. తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు నిర్మాణాలు పూర్తి చేయవచ్చని భావించారు. కానీ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమిపాలు కావడంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసిపి మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చి అటకెక్కించింది. అమరావతి రాజధాని అనే విషయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వైసిపి, ఇక్కడ అమరావతి నిర్మించడం భారీ వ్యయంతో కూడుకున్నదనే అభిప్రాయంతో ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా ప్రకటించి అక్కడ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

IHG

 

అయినా.. చంద్రబాబు అమరావతి ఉద్యమాన్ని వదిలి పెట్టకుండా, తమ అనుకూల మీడియా ద్వారా అమరావతి పరిసర ప్రాంతాల్లోని తమ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, రైతుల ద్వారా ఏదో ఒక రకంగా ఈ ఉద్యమాన్ని పైకి తీసుకురావాలని భావించినా, అకస్మాత్తుగా కరోనా మహమ్మారి ఏపీలో విజృంభించడం వంటి కారణాలతో, ఈ ఉద్యమానికి బ్రేకులు పడ్డాయి. అయినా 200 రోజులు ఉద్యమం అంటూ చంద్రబాబు గట్టిగా హడావుడి చేశారు.అసలు అమరావతిలో రాజధాని కొనసాగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పటికీ చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. అలాగే విశాఖను వ్యతిరేకించడానికి కారణాలు కూడా స్పష్టంగా ఆయన దగ్గర లేవు. మూడు రాజధానులు వల్ల మూడు ప్రాంతాలు, సమానంగా అభివృద్ధి చెందుతుందని వైసిపి ప్రభుత్వం గట్టిగా వాదిస్తున్నా, తెలుగుదేశం పార్టీ దగ్గర సమాధానమే లేదు.

IHG'save Amaravati' movement - The Hindu

 

ఇప్పుడు కేంద్రాన్ని ఇందులో ఇరికిద్దామని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా ఈ వ్యవహారంలో తలదూర్చేందుకు కేంద్రం ఇష్టపడడం లేదు. అసలు అంతకుముందే రాజధాని నిర్మాణం అనేది, రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అని, ఇందులో కేంద్రం జోక్యం ఏమీ ఉండదని ప్రకటించేసింది. ఎంత కవ్వించినా అమరావతి వ్యవహారంలో వేలు పెట్టేందుకు కేంద్రం ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ అమరావతి వ్యవహారాన్ని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారు.

 

అమరావతి ఉద్యమం అంటూ 200 రోజులు కాదు.. మరో నాలుగేళ్ల పాటు ఈ ఉద్యమాన్ని నడిపించినా, జగన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు తప్ప, తను మనసు మార్చుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడడు. ఈ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఉనికి చాటుకునేందుకు, ఇప్పుడు అమరావతి వ్యవహారాన్ని ఆయన తలెకెత్తుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వృధా ప్రయాసే తప్ప ప్రయోజనం మాత్రం ఉండదనేది విశ్లేషకుల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: