పొగ‌డ్త‌ల‌కు పొంగిపోకూడ‌దు...విమ‌ర్శ‌ల‌కు కుంగిపోకూడ‌దు అనేది పెద్ద‌లు చెప్పిన మాట‌. నిజానికి ప్ర‌జాజీవితంలోకి వ‌చ్చిన వారైతే మ‌రింత ఎక్కువ‌గా గుర్తుంచుకోవాలి. జ‌గ‌న్ అదే చేశాడు. ప‌రీక్ష‌ల సంఖ్య పెంచ‌డం వ‌ల‌న క‌రోనా కేసుల సంఖ్య పెర‌గ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ఆ రాష్ట్రంలోని విప‌క్షాలు విరుచుకుప‌డ్డాయి. ఆ మాటకొస్తే కాస్త చాలా మంది వైసీపీ నేత‌ల్లోనూ పెద‌వి విరుపే క‌నిపించింది. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల నుంచి కూడా ముఖ్య‌మంత్రి వైఫ‌ల్యం కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేసుల సంఖ్య పెరిగిపోతోంద‌ని అంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. జ‌గ‌న్ మాత్రం విమ‌ర్శ‌లకు దూరంగా ఉన్నారు.

 

వైద్యుల‌తో క‌మిటీలు ఏర్పాటు చేయ‌డమే కాకుండా ఎక్క‌డిక‌క్క‌డే వెంట‌వెంట‌నే ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ణ జ‌రిగేలా చూడ‌టం గ‌మ‌నార్హం. పాజిటివ్ కేసుల సంఖ్య మొద‌ట్లో ఏ రాష్ట్రంలో పెర‌గ‌న‌న్ని న‌మోదు కావ‌డంపై అటు కేంద్రం కూడా ఒంకింత జ‌గ‌న్ వైఫ‌ల్యం అంటూ వంత‌పాడ‌టం మొద‌లైంది. అయితే గ‌డిచిన కొద్దిరోజుల్లోనే జ‌గ‌న్ ఆలోచ‌న‌, స్పందించిన తీరు, వైద్య బృందాలు చేసిన కృషి స‌త్ఫ‌లితాలిచ్చింది. అంతేకాదు క‌రోనా తీవ్ర‌త‌..కేసుల సంఖ్య ఎక్కువ‌గా న‌మోదైన ప్రాంతాల్లో కంటోన్మెంట్ల ఏర్పాటు,లాక్‌డౌన్ విధింపు వంటి చ‌ర్య‌లు ఇత‌ర రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా మారాయి. 


ఇప్పుడు తిట్టిన‌నోళ్లే... విమ‌ర్శించిన నోళ్లే...జ‌గ‌న్ భేష్ అంటూ పొగిడేలా చేశారు. ఇక విప‌క్షాల‌కైతే ప‌చ్చి వెల‌క్కాయ గొంతులో ప‌డిన‌ట్ల‌యింది. క‌రోనా ప‌రీక్ష‌ల విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉండ‌టంతో ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌డితే ఇబ్బందుల్లో ప‌డ‌తామ‌ని ఆచితూచి స్పందిస్తున్నాయి.  కరోనా పరీక్షల్లో ఏపీ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటాయి. ఇప్పటి వరకు ఏపీలో 10,17,123 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 78 చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న గాంధీ ఆసుపత్రికి ఏపీ నుంచి తొలి శాంపిల్ పంపించారు. అనంతరం మార్చి7న తిరుపతి స్విమ్స్‌లో తొలి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఏపీలో ప్రతి 10 లక్షల మందిలో 19,047 మందికి పరీక్షలు చేశారు. ఇది దేశంలోనే అత్యధికం. జాతీయ స్థాయిలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 6,578 మందికి మాత్రమే టెస్టులు చేశారు. మరణాల రేటులోనూ ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ 1.24 శాతంగా ఉండగా.. జాతీయ స్థాయిలో సగటు రేటు 2.89 శాతంగా ఉండ‌టం.

మరింత సమాచారం తెలుసుకోండి: