తెలుగు రాష్ట్రాల‌ను క‌రోనా వైర‌స్ అల్లాడిస్తోంది. రోజుకు వంద‌ల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే తెలంగాణ‌లో ఉధృతి ఎక్కువ‌గా ఉంటోంది. గ‌త మూడు రోజులుగా 1800పైచిలుకుగా కేసుల న‌మోదు జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో ఆంధ్రాలో 1వెయ్యి పైచిలుకు కేసులు న‌మోద‌వుతున్నాయి. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఒక భిన్న‌త్వం ఉంది. వాస్త‌వానికి తెలంగాణ‌లో ప్ర‌భుత్వం అధికారికంగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ జ‌రిపించ‌డం లేదు. కేవ‌లం అనుమానిత ల‌క్ష‌ణాలున్న వారికే చేస్తోంది. క‌రోనాతో ఏం కాదు అనే మొండి ధైర్యాన్ని ప్ర‌జ‌ల‌కు నూరిపోసే ప్ర‌య‌త్నాన్ని చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై మాత్రం నిర్ల‌క్ష్య పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది.

 

 హైకోర్టు సైతం రిట్ పిటిష‌న్ల‌ను స్వీక‌రించి విచార‌ణ‌లో భాగంగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదో వివ‌రించాల‌ని ప్ర‌శ్నించినా స‌రైన స్పంద‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. డొంక తిరుగుడు స‌మాధానాల‌తో అస‌లు విష‌యాన్ని దాట‌వేసే ప్ర‌య‌త్నాల్లోనే నిమ‌గ్న‌మ‌వుతోంద‌న్న విమ‌ర్శ‌ల‌ను మూట‌గ‌ట్టుకుంటోంది. ప్రైవేటు ల్యాబుల‌కు కూడా అనేక ఆంక్ష‌ల‌తో ప‌రీక్ష‌లు జ‌రిపేందుకు అనుమ‌తులు జారీ చేయ‌డం విశేషం. అయితే దోపిడీ ఉండ వ‌ద్ద‌న్న ఉద్దేశంతోనే కేసీఆర్ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్నా...పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎందుకు ముందుకు రావ‌డం లేద‌న్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు ప్ర‌జానీకం నుంచి వినిపిస్తున్నాయి.

 

 పొరుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిత్య వేలాది మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అక్క‌డ నిత్యం 20 నుంచి 23వేల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక డోర్ టుడోర్ ప‌రీక్ష‌ల‌కు కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే తెలంగాణ‌లో ప‌రీక్ష చేయించుకున్న ప్ర‌తీ 5ఐదుగురిలో ఒక‌రికి పాజిటివ్ రావ‌డం దేనికి సంకేతం. క‌రోనా వైర‌స్ ఉధృతి క‌ళ్ల‌కు క‌న‌బ‌డ‌టం లేదా..? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మాట‌ల్లోనే కాదు..మంచి ఎవ‌రూ  చేసిన చూసి ఆచ‌రించేందుకు సిద్ధంగా ఉండాల‌ని జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం చేస్తున్న క‌రోనా ప‌రీక్ష‌లను కొనియాడుతున్నారు. అదే స‌మ‌యంలో కేసీఆర్ ఎందుకు చేయించ‌లేక‌పోతున్నార‌ని మండిప‌డుతున్నారు.అందుకే క‌రోనా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో సీఎం కేసీఆర్ ఫెయిల్‌...ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి దేశంలోనే టాప్ 1సీఎంగా నిలిచార‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: