అదేదో కరోనా అంట.. అదీ మన రాష్ట్రానికి రాదు, మన గడ్డమీద అడుగు పెట్టదు, ఒకవేళ వచ్చినా దాన్ని తరిమి తరిమి కోడతాం. అనుకోకుండా కరోనా సోకుతే జ్వరం వచ్చినప్పుడు వాడే మాత్ర పారాసిటమాల్ వేసుకుంటే చాలు. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కావు.. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు. కానీ, రాష్ట్రంలో ఆయన చెప్పిన మాటలకు భిన్నంగా పరిస్తితులు నెలకొన్నాయి. కరోనాతో తెలంగాణ ప్రజలు, పాలకులు, అధికారులు, పోలీసులు అందరూ వణికిపోతున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

 

కరోనా వచ్చిన మొదట్లో ప్రెస్ మీట్ లు పెట్టి ప్రజలకి ధైర్యం చెప్పిన సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు అసలు కనిపించట్లేదు. దీనికి కారణం వెతకగా.. అధినేతకు కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే (ఒకటి, రెండు) దినపత్రికలు ప్రచురించాయి. కరోనా విస్తృతంగా పెరుగుతున్న సమయంలోనే వందలాది మందితో కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించారు. దానితో పాటుగా ఇటీవల తెలంగాణలో హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పుడు కూడా వందల సంఖ్యలో హజరయ్యారు. ఎప్పుడెక్కడ ఏం జరిగిందో, ఎవరి వల్ల కరోనా అంటిందో కాని ప్రగతి భవన్ లో దాదాపుగా ముప్పై మందికి పైగా కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది.

 

అన్నివిధాల జాగ్రత్తలు పాటించే భవన్ లో వైరస్ చిత్రంగా వ్యాపించింది. ముఖ్యమంత్రి భద్రతా విభాగం కీలక అధికారికి కూడా కరోనా నిర్ధారణ అయింది. డ్రైవర్లు, మిగతా సిబ్బందికి కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో ప్రగతి భవన్ ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే కేసీఆర్ గత పదిరోజుల నుంచి బయటికి రాకుండా, ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొనడం లేదని, క్వారంటైన్ లో ఉన్నారని తెలుస్తోంది.

 

ఇప్పటికే ఈ మహమ్మారి బారిన తెలంగాణ హోమ్ శాఖ మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు పడ్డారు. అందులో కొంతమంది కొలుకోగా.. మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. అలాగే సీఎం కేసీఆర్ కి కరోనా రావడంతో ఆయనని ఫామ్ హౌస్ కి తరలించి, అక్కడ చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావాలి. ఏదిఏమైనా.. ఈ మహమ్మారి బారినుంచి ప్రజలంతా క్షేమంగా బయటపడాలని, అలానే సీఎం కేసీఆర్ కూడా త్వరగా కొలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది ఇండియా హెరాల్డ్ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: