అవును! నిజ‌మే.. తాజాగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ వ‌ర్గాల అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో వెలుగు చూస్తున్న కొన్ని విష యాలు.. సాధార‌ణ ప్ర‌జ‌లు గుండెలు చిక్క‌బ‌ట్టుకుని వినాల్సిన అవ‌స‌రాన్ని సూచిస్తున్నాయి.  ప్ర‌ధానంగా రెండు విష‌యాలు ఇప్పుడు కేంద్రాన్ని కుదిపేస్తున్నాయి. వీటిలో ఒక‌టి.. క‌రోనా వైర‌స్‌.. రెండు గోరిచుట్టు పై రోకలి పోటు మాదిరిగా చైనా దూకుడు! ఈ రెండు విష‌యాల్లో ఒక‌టి అంత‌ర్గ‌త పోరు.. రెండోది.. స‌రిహ ‌ద్దుపోరు. ఈ రెండు కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి అగ్గి ప‌రీక్ష‌లే అనాలి. రెండోసారి అధికారంలోకి సునా యాసంగా వ‌చ్చేసినా.. తొలి ఏడాది చివ‌ర‌లో ఏర్ప‌డిన ఈ రెండు ఉత్పాతాల నుంచి త‌ప్పించుకునే వ్యూ హం ఇప్పుడు మోడీకి క‌నిపించ‌డం లేదు. వాస్త‌వానికి.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీకి కావాల్సింది.. ఏంటి?  ఫీల్‌గుడ్ గ‌వ‌ర్న‌మెంట్‌!  


త‌న ప్ర‌భుత్వం ఎన్ని త‌ప్పులు చేసినా.. వాటిని క‌ప్పేసుకుని ఉండి.. ప్ర‌జ‌ల్లో మాత్రం `మోడీ గ్రేట్` అని పించుకోవాల‌న్న‌దే ఆయ‌న త‌ప‌న‌. స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. క‌రోనా విష‌యాన్ని మా ట్లాడుకుందాం.. ఈ క్ర‌మంలోనే కొన్ని రోజుల కింద‌ట దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. ప్ర‌పం చంలో క‌రోనాను అరిక‌ట్టే విష‌యంలో మ‌న‌ల్ని మించిన తోపులేదు. మ‌నం నిలువ‌రించాం.. అమెరికా కూ డా చేతులు ఎత్తేసింది అన్నారు. ఇంకేముంది.. దీంతో దేశ‌వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు బాజా భ‌జంత్రీల‌ను కొంచెం గ‌ట్టిగానే మోగించాయి. కానీ.. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు ఏంటి?  కేంద్రం ఎలాంటి సంకేతాలు ఇస్తోంది?  చూస్తే.. ఒకింత గుండెలు చిక్క‌బ‌ట్టుకోవాల్సిందే!!


ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా మృతుల సంఖ్య 19500కు చేరిపోయింది. ఇక‌, పాజిటివ్ కేసులు ఒక్క రోజు లోనే పాతిక వేలు దాటుతున్నాయి. ఇప్ప‌టికే 7 ల‌క్ష‌ల‌మంది కేసుల‌తో అల్లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా అంశాల‌ను అంచ‌నా వేసిన కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నెల ఆఖ‌రు నుంచి మొద‌లు పెట్టి.. వ‌చ్చే ఆగ ‌స్టు 30లోగా దేశంలో 50 వేల మంది మృతి చెంద‌డం ఖాయ‌మ‌ని హెచ్చరించింది. ఇదే విష‌యాన్ని  అంత ‌ర్జాతీయ మీడియా.. స‌హా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌.. కూడా నిర్ధారించిచింది. వాస్త‌వానికి ప్ర‌పంచ మీడియా కానీ, అమెరికా వంటి అగ్ర‌రాజ్యాలు కానీ.. బార‌త్‌ను ఈ విష‌యంలో ముందు కొనియాడాయి. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి రివ‌ర్స్ అయింది. ప్ర‌పంచాన్ని ఒణికిస్తున్న క‌రోనా వైర‌స్.. ఇప్పటికీ త‌న విశ్వ‌రూపంలోని అనేక కోణాల‌ను చూపిస్తూ.. భ‌య భ్రాంతుల‌కు గురిచేస్తూనే ఉంది. 


ఈ నేప‌థ్యంలో దేశంలో ప‌రిస్థితి వాస్త‌వానికి భీక‌రంగా ఉన్న‌ప్ప‌టికీ.. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతున్న ప్పటికీ.. కేంద్రం మాత్రం.. `ఆ.. ఏమీ లేదు..` అని పైకి చెబుతున్నా.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం వ‌చ్చే నె ల రోజుల్లో ల‌క్ష‌ల్లో కేసులు పెర‌గ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేసింది. అందుకే ఎక్క‌డిక‌క్క‌డ రైలు బోగీల నే క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేసింది. ఇక‌, ఢిల్లీలో 10వేల ప‌డ‌క‌ల‌తో ఆసుప‌త్రిని సిద్ధం చేసింది. అదే స‌మ‌యంలో మ‌రో వెయ్యి ప‌డ‌క‌ల‌తో ఇంకోటి అక్క‌డే సిద్ధ‌మ‌వుతోంది. రాష్ట్రాల ప‌రిస్థితికి వ‌స్తే.. బ‌స్సుల‌నే క్వారంటైన్ కేంద్రాలు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితి వేరు.. ఇప్పుడు వ‌ర్షాలు వెల్లువెత్తుతున్న వేళ క‌రోనా విజృంభిస్తున్న తీరు వేరు! వ‌చ్చే కొద్ది రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య 20 ల‌క్ష‌ల‌కు చేరుతుంద‌ని అంటున్నారు. 


అందుకే న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఆ దిశ‌గానే ఏర్పాట్లు చేస్తున్న‌ద‌న‌డంలో సందేహాలు లేవు. ఒక‌వైపు లే ద‌ని చెబుతూనే(దీనిని కొంద‌రు ధైర్యం చెప్పేందుకు అంటే.. మ‌రికొంద‌రు త‌మ త‌ప్పుల‌నుక‌ప్పి పుచ్చు కునేందుకు అని విమ‌ర్శిస్తున్నారు) యుద్ధ ప్రాతిప‌దికన ‌చేస్తున్న ఏర్పాట్లు చూస్తే.. మాత్రం క‌రోనా విజృంభ‌ణ మామూలుగా లేదుగా! అనే వ్యాఖ్య‌లను స‌మ‌ర్దించ‌కుండా ఉండ‌లేం. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిలో రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశం మొత్తం అలెర్ట్ కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఏదేమైనా.. మ‌రో నెల రోజులు ఎవ‌రి జాగ్ర‌త్త‌లు వారు తీసుకోవాల్సిన బాధ్య‌త ఎవ‌రిది వారిదే! 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: