ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ - మోపిదేవి వెంకటరమణ తరలిపోవడంతో ఆ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో జగన్ కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ పదవులు ఎవరికి దక్కనున్నాయి అనేది మాత్రం ఉత్కంఠంగా మారింది. సీనియర్లు, జూనియర్లు అందరూ ఆ పదవుల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తూ.. అధినేత జగన్ ని కలుస్తూ.. తమ మీద దయ చూపమని కోరుకుంటున్నారు ఎమ్మెల్యేలు. అయితే శ్రావణమాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఈ రెండు మంత్రి పదవులకు ఎవరికి ఛాన్స్ దక్కతుందునేది ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసిన ఇద్దరు బీసీ సామాజిక వర్గం కావడంతో మళ్లీ ఆ వర్గానికి చెందిన వాళ్లకే అవకాశం ఇస్తారా.. లేక  జిల్లాలవారీగా లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసినట్టు వార్తలు వినిపిస్తునయి. మంత్రి పదవిపై ఇప్పటికే వారితో చర్చించారట. త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కబోతుందని వారికి జగన్ క్లారిటీ ఇచ్చినట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు వారిని ఏర్పాట్లు కూడా చేసుకోమని చెప్పినట్టు..

 

అలాగే వీలు చూసుకుని ఒకరోజు తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి తనని ఒకసారి కలవాలని సీఎం జగన్ వారిగి సూచించారట. దీంతో ఆ మహిళా ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేశారట.. రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ ప్రకారం.. ఆ మహిళా ఎమ్మెల్యేలు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన విడుదల రజిని, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: