' ఏపీ రాజధాని ' అనేది భారమైన, బరువువైన, పరిష్కారం లేని సమస్యగా మారిపోయింది. రాజకీయ ఛట్రంలో చిక్కుకుని ఆంధ్రుల రాజధాని విలవిలలాడుతోంది. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక దిక్కులు చూస్తోంది. రాజకీయ మైదానంలో బంతిలా ఇప్పుడు ఏపీ రాజధాని అంశం తయారైంది. అసలు రాజధాని అనే స్వప్నం సాకారం అవుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ ఇలా అన్ని పార్టీలు ఎవరి పంతాలకు వారు రాజధాని అంశాన్ని వాడేసుకుంటున్నారు. ఇందులో ఎవరి ప్రయోజనాలు వారివి అన్నట్టుగా పరిస్థితి ఉంది. అసలు ఏపీ రాజధాని విషయంలో బీజేపీ పాత్ర ఏంటి ? రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందా ? రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో  కేంద్రం పాత్ర ఏంటి ? అసలు ఏపీ అధికార పార్టీ వైసిపి విధానం ఏంటి ? నిజంగానే అమరావతి ఉద్యమం నడుస్తోందా ? లేక తెలుగుదేశం పార్టీ వెనకుండి కృత్రిమంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తుందా ? ఒక రాష్ట్ర రాజధాని మార్చే విషయంలో వైసిపి తొందరపాటుతనంతో వ్యవహరిస్తోందా ? అసలు రాజధాని అనేది ఒక పాలనాపరమైన అంశంగానే చూడాలా ? ప్రజలతో ప్రజల జీవితాలతో ఈ వ్యవహారం ముడిపడి ఉంటుందనే సంగతి రాజకీయ నాయకులకు తెలియదా ? ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

IHG

 

 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటికే ఏపీ తెలంగాణ విడిపోయి ఉండడంతో రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయింది. ఉమ్మడిగా హైదరాబాదులో పదేళ్లపాటు దర్జాగా ఉండే హక్కు కేంద్రం కల్పించినా, చంద్రబాబు కొన్ని రకాల కేసుల్లో ఇరుక్కోవడం, అక్కడి నుంచి హఠాత్తుగా తనను తాను రక్షించుకోవటం కోసం, తెలంగాణ నుంచి ఏపీకి ఆకస్మాత్తుగా ప్రయాణం కట్టారు అనేది ఆయనపై ఉన్న విమర్శలు. ఇక ఏపీలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసే విషయంలో చంద్రబాబు ఎన్నో నిజాలు దాచి పెట్టి వ్యవహరించారనే వాదనలు లేకపోలేదు. అప్పట్లో రాజధాని నిర్మాణం పై ఏర్పాటు చేసిన శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి చంద్రబాబు తాను అనుకున్న విధంగానే అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టారనే  ఆరోపణలు లేకపోలేదు.

IHG

 

అలాగే చిన్న చిన్న చిరుద్యోగులు, కారు డ్రైవర్లు ,నెలకు ఐదు వేలు జీతం పొందే వారి పేరు మీద వందలు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్లు జరిగిపోవడం, కేవలం ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలోనే అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారనే విమర్శలు లేకపోలేదు. అప్పట్లో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు ఇష్టపడకపోయినా, బలవంతంగానే వారి వద్ద నుంచి భూములు సేకరించి వారి బాధ, ఆక్రోశం జనాలకు తెలియకుండా అనుకూల మీడియా ద్వారా దానిని కప్పి ఉంచారనే నిందలు ఎన్నో చంద్రబాబు మూట కట్టుకున్నారు. ఇక టిడిపి పాలన సాగినంత కాలం తాత్కాలిక బిల్డింగ్ లతోనూ, గ్రాఫిక్ డిజైన్ లతో కాలం గడుపుతారు తప్ప పూర్తిగా అమరావతిని నిర్మించలేకపోయారు అనేది కూడా నిజమే. ఇక వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తెచ్చి పూర్తిగా అమరావతిని పక్కన పెట్టేశారు.

 

కేవలం శాసన రాజధానిగా మాత్రమే అమరావతిని ఉంచి పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రతిపాదించారు. ఆ మేరకు అక్కడ చురుగ్గా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ వ్యవహారంలో జగన్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైనా, తాను ఏ విమర్శలను లెక్కచేయనని, తాను అనుకున్నది చేసి చూపిస్తాను అనే విధంగా జగన్ వ్యవహరించారు.. వ్యవహరిస్తున్నారు.ఇక ఈ వ్యవహారంలో కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. అసలు రాష్ట్ర రాజధాని అనేది పూర్తిగా ఆయా రాష్ట్రాల సొంత అభిప్రాయం అని, దీంట్లో కేంద్రం జోక్యం చేసుకోవాలని మొదట్లో బిజెపి ప్రకటించింది. అసలు రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం అన్ని విధాలుగా సలహాలు సూచనలు ఇస్తూ గైడెన్స్ ఇవ్వాల్సి ఉన్నా, ఆ విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించలేదనే వాదనలు లేకపోలేదు.

IHG

అప్పట్లో అమరావతి శంకుస్థాపనకు పార్లమెంటు ఆవరణలోని మట్టి, యమునా నది నీళ్లు తీసుకువచ్చిన ప్రధాని మోదీ ఆ తర్వాత ఆ వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక అమరావతి చుట్టూ రాజకీయాలు చుట్టుముట్టాయి. ఇక ఏపీ బిజెపి నాయకులు ఇప్పటికీ అప్పటికి అమరావతి విషయంలో ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారు. జగన్ మూడు రాజధానులు అంటూ ప్రకటించగానే, తాము ఎన్నికల హామీలో  కర్నూలును రాజధానిగా ప్రకటించామని కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తే, మరికొంతమంది బిజెపి నాయకులు రాజధానిగా అమరావతి నే ఉంచాలని మరికొందరు సమర్ధిస్తున్నారు. ప్రస్తుతానికి వైసీపీలో ఉన్నా, త్వరలోనే బీజేపీలో చేరతారనే అనుమానాలు ఉన్న రఘురామకృష్ణంరాజు సైతం అమరావతికి తన మద్దతు ప్రకటించారు.

IHG

అలాగే కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి కూడా అమరావతికి నో చెప్పేశారు. ఇవన్నీ పక్కన పెడితే, అసలు రాజధాని విషయంలో కేంద్రం వైఖరి ఏంటి అనేది స్పష్టత లేదు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అలాగే ప్రస్తుతం విశాఖ కూడా అంత సేఫ్ కాదు అనే అభిప్రాయాలు వక్తం అవుతున్న తరుణంలో ఆంధ్రుల ' రాజధాని ' కలల రాజధానిగానే మిగిలిపోయేలా ఉంది అనేది ఇప్పడు జనాల భయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: