చైనా దుందుడుకు స్వ‌భావంతో ప్ర‌పంచ దేశాల నుంచి దుమ్మెత్తిపోసే ప‌రిస్థితిని తెచ్చుకుంది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ మొత్తం వ్యాప్తి చెంద‌డానికి కార‌ణ‌మైంద‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వేళ‌..భార‌త్‌తో క‌య్యానికి కాలు దువ్వుతూ అబాసు పాల‌వుతోంది. అంతేకాక ఐరోపా దేశాల‌కు సైతం ప‌రోక్ష శ‌త్రువుగా మారింది. తాటాకు చ‌ప్పుళ్ల‌కు భార‌త్ భ‌య‌ప‌డ‌దు అన్న విష‌యం మోదీ ల‌డ‌ఖ్‌లోలో ప‌ర్య‌ట‌న త‌ర్వాత చైనా తెలుసుకున్న‌ట్లుంది. మోదీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత మ‌రుస‌టి రోజు నుంచే చైనా బ‌లగాల స‌రిహ‌ద్దు నుంచి వెన‌క్కి మ‌ళ్ల‌డం గ‌మ‌నార్హం. చైనా అండ చూసుకుని విర్ర‌వీగిన పాక్ ఇజ్జ‌త్ పోయింద‌నే చెప్పాలి. 


భార‌త్‌-చైనాల మ‌ధ్య నెల‌కొన్న వివాదానికి పాక్ హ‌డావుడి ఎక్కువైంది. చైనా బిస్క‌ట్ల‌కు పాక్ తోక ఆడించింది. అనుహ్యంగా మోదీ బార్డ‌ర్‌లో ప‌ర్య‌టించి సైనికుల్లో మ‌నోధైర్యం నింప‌డ‌మే కాకుండా చైనాకు గ‌ట్టి సందేశాన్నే పంపాడు. బెద‌రిస్తే బెదిరిపోవ‌డానికి  ఇక్క‌డ ఎవ్వ‌రూ  సిద్ధంగా లేర‌ని, ఓర్పును, స‌హ‌నాన్ని చాత‌గాని త‌నంగా చూడ‌ద‌న్న‌ట్లుగా మోదీ వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌పంచ దేశాధినేత‌ల చేత భేష్ అనిపించుకుంది. అదే స‌మ‌యంలో చైనా ప్ర‌పంచానికి ఎంత ప్ర‌మాద‌కారో కూడా అంత‌ర్జాతీయ స‌మాజానికి అర్థ‌మ‌వుతూనే ఉంది. అంతర్జాతీయ స‌మాజంలో భార‌త్‌కు వ‌స్తున్న మ‌ద్ద‌తును వాస్త‌వానికి చైనా ముందు ఊహించి ఉండ‌దు.


అందుకే ముందు కయ్యానికి రెడీ అనినా..త‌ర్వాత ఎందుక‌నో వెన‌క్కి త‌గ్గుతుండ‌టం గ‌మ‌నార్హం. అయితే స‌రిహ‌ద్దుల్లో మాత్రం భార‌త జ‌వాన్లు గ‌స్తీ కాస్తూనే ఉన్నారు. లడాఖ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అనంతరం పరిస్థితులు మారిపోయాయి. తాజాగా ఘర్షణ ప్రాంతం నుంచి చైనా సైనిక మూక‌లు వెనక్కి వెళ్లిపోయాయి.  వివాదాస్పద ప్రాంతం నుంచి కి.మీ మేరా వెనక్కి వెళ్లింది. అదేవిధంగా కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఆ ప్రాంతంలో టెంట్ లు, వాహనాలను తొలగించింది. జూన్ 15 నుంచి లడాఖ్ సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: