ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 8న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం మరోసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ తీవ్రత తగ్గకపోవడంతో నిలిపివేయక తప్పడం లేదని అధికారులు పేర్కొన్నారు. కానీ, వైసీపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. టీడీపీ నేతలు కోర్టుల్లో అనేకచోట్ల పిటిషన్లు వేయడమే దీనికి అడ్డంకి అని చెప్తున్నారు. కానీ, అసలు వాస్తవాలేంటి.? ఈ కార్యక్రమం ఎందుకు వాయిదా పడింది.? దీని వెనుక దాగున్న అసలు నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

 

2019 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పేదలకు ఇళ్ల స్ధలాలు కొనటం కోసం.. భూమిని సేకరించాలని ఉత్తర్వులిచ్చారు. అప్పటి నుంచి అసలు కథ మొదలైంది. రాష్ట్రంలో అనేకచోట్ల ముందుగానే వైసీపీ నేతలు తక్కువ ధరకే భూములను కొనుగోలుచేసి.. పేదల ఇళ్ల స్ధలాల కోసం వాటిని ప్రభుత్వంతో ఎక్కువ ధరకు కొనిపించారు. తక్కువ ధర భూముల కోసం ఊరికి దూరంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకున్నారు ఆ నేతలు. దీనివళ్లే ఇప్పుడు గొడవ మొదలైంది. లబ్దిదారులంతా ఆ స్ధలాలను చూసి.. ఇంత దూరంలో ఉన్నవాటిని కేటాయిస్తే.. తాము వచ్చిఎలా ఉండాలని ప్రశ్నిస్తున్నారు.

 

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం ఇదే ప్రశ్నించారు. అంతంత దూరంలో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇస్తే.. వారు వెళ్లి ఎలా ఉంటారని అడిగారు. వీటిపై చాలామంది కోర్టులకు వెళ్లారు. ఇలా ప్రతి జిల్లాలో స్కాములు, తమ భూమి పోయిందని దళితుల ఆందోళనలను, సరైన చోట స్ధలం కేటాయించలేదని లబ్దిదారులు ఆందోళనలు.. ఇలా రణరంగంగా మారిపోయాయి. ఇలాంటి పరిస్ధితుల్లో ఇళ్ల స్ధలాల పంపిణీ సాఫీగా జరగదని అర్ధమైపోయింది.

 

అందుకే ఈ ప్రక్రియను వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది. అది చెప్పకుండా.. న్యాయస్ధానాలే కారణమన్నట్లు వైసీపీ ప్రచారం చేస్తుంది. అలాగే ప్రతిపక్ష టీడీపీనే దీనికి మూలకారణం అని చెప్తుంది. అయితే ఏదిఏమైనా సరే ఆగస్టు 15న పంపిణీ చేస్తామని మరోసారి తేల్చిచెప్పేసింది వైసీపీ. మరి ఈసారైనా పంచుతారా..? లేక ఏదోక కారణం చెప్పి మళ్ళీ వాయిదా వేస్తారా..? అనే అనుమానాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: