కాలం మారుతున్న క్ర‌మంలో వివిధ కార‌ణాల‌తో ఒంట‌రిగా జీవించ‌డానికి ఇష్ట‌ప‌డుతున్న స్త్రీల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోందంట‌. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో ఏకంగా 6శాతం మంది ఇలా జీవించ‌డానికే మొగ్గు చూపుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇందులో పెళ్లికాకుండానే జీవితాన్ని ఒంట‌రిగా సాగించాల‌ని నిర్ణ‌యించుకుంటున్న వారూ అధికంగానే ఉండ‌టం విశేషం.భారతదేశంలో ఈ సింగిల్ ఉమన్ సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కొన్ని పాలిటిన్ సిటీస్‌లో మంచి ఉద్యోగాల్లో ఉన్న అమ్మాయిలు పెళ్లి పట్ల ఒక రకంగా విముఖంగా ఉన్నారు కూడా. ఇవ్వాల్టి రోజుల్లో అమ్మాయిలు చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు. 


కెరీర్ విషయంలో స్త్రీ పురుష విచక్షణ ఎప్పుడూ ఉండదు. కానీ ఈ కెరీర్ కోసం, తాము అనుకున్న లక్షాలు చేరుకోవటం కోసం అమ్మాయిలు పెళ్లి ప్రతిబంధకంగానే అనిపిస్తోందని ఒక అధ్యయనం చెబుతోంది. ఒంటరి మహిళ అనగానే సమాజంలో తేలిక భావనే నేటికీ. కానీ వాస్తవానికి వాళ్లు స్వతంత్రులుగా మిగిలిన మహిళల కన్నా తమ ప్రతిభకు మెరుగులద్దుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. అప్రతిహతంగా ఇంటా బయటా శ్రమపడుతూ, సంతానాన్ని చక్కదిద్దుకునే ఒంటరి మహిళలు స్ఫూర్తి కలిగిస్తారు. అలాంటి మహిళలు మన చుట్టూనే చాలామంది ఉన్నారు. కుటుంబంలో స్త్రీ ఉండి పురుషుడు లేకపోతే ఆ ఇంట్లో పిల్లలు చక్కని మార్గనిర్దేశంలో పెరుగుతారు. అదే స్త్రీ లేకుండా పురుషుడుంటే ఆ కుటుంబం చెల్లాచెదురవుతుంది.


 అదే అతని తల్లో, సోదరో ఆ కుటుంబానికి ఆసరాగా నిలిస్తే.. కొంతలో కొంత మెరుగ్గా ఉంటుంది. అదే సందర్భంలో ఒంటరి మహిళలు సాంప్రదాయాల పేర, అధిపత్యం వల్ల అనేక అవమానాలకు, ఆక్షేపణలకు గురవుతున్నారు.  అమ్మ, నాన్న.. భార్య, భర్త... సోద‌రులు, సోద‌రికి, తల్లి, పిల్లలు...ఇలా అంద‌రికీ దూరంగా ఉంటూ జీవించ‌డానికి..ఆ జీవితంలోనే త‌మ ఎదుగుద‌ల‌ను ఊహించుకుంటూ..ల‌క్ష్యాల‌ను కాంక్షిస్తూ...జీవితాల‌ను ఉన్న‌త శిఖ‌రాల వైపు మ‌ళ్లించాల‌ని భావిస్తున్నార‌ట‌. గ‌తంలో త‌ప్పు చేసిన వారు..మిగిలిన జీవితాన్ని స‌వాల్‌గా తీసుకుని..ఎద‌గాల‌నుకునే వారు కూడా ఈవిధంగా ఒంట‌రి జీవితం వైపే అడుగులు వేస్తున్నారంట‌. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: