డొనాల్డ్ ట్రంప్.. ఇతను భారత దేశానికి నిజమైన స్నేహితుడను అని తనకు తాను అభివర్ణించుకుంటాడు. అమెరికా అగ్రరాజ్యం అయినందున ఏ దేశం లో ఎటువంటి సమస్య వచ్చినా అమెరికా నుండి ఏ విధమైన సహాయం కావాలా అని అడుగుతాడు. రెండు దేశాల మధ్య సమస్య ఏర్పడి అవి కాస్తా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తే తాను మధ్యవర్తిగా వ్యవహరించాలా అని ఆ దేశాలను కోరుతాడు.. కానీ తీసుకునేవి అన్నీ ఘటిక నిర్ణయాలే. అంత్యంత తక్కువ సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో ట్రంప్ ఎక్స్పర్ట్.

 

ఆ నిర్ణయం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి తరువాత  ఆలోచిస్తాడు. కానీ నిర్ణయం మాత్రం ఇట్టే తీసేసుకుంటాడు. ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం చాలా ప్రమాదకరంగా ఉంది. అమెరికాలో ఎన్నో దేశాల నుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు నిక్కచ్చిగా చెప్పాలంటే డాలర్ కలలు కంటున్నారు.. వారందరికీ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతున్నాయి.

 

అమెరికాలో ఇప్పటికే కరోనా కారణంగా 30 లక్షలకు పైగా మంది ఈ వ్యాధి బారిన పడి బాధపడుతున్నారు. ముఖ్యంగా చూస్తే మధ్య వయసు వారు 20 నుండి 30 సంవత్సరాల వయసు వారే కరోనాకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. ఇక ఇలాంటి నేపద్యంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఓ దురుసు నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ విద్యార్థులుకు ట్రంప్ కఠిన పరీక్ష పెట్టారు కరోనా తాకిడి పెరుగుతున్నప్పటికీ యూనివర్సిటీలు వచ్చే ఫాల్ లో పునఃప్రారంభించాలని ఆదేశించాడు. అలా తెరవకపోతే కాలేజీలను తమ ప్రాంతాల్లో నుండి తీసేస్తామని వారు వేరే ఎక్కడైనా కాలేజీలు పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.

 

ఇక కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించినా విద్యార్థులకు తప్పక కాలేజీలు అటెండ్ అవ్వాలి. కాలేజీలకు అటెండ్ అవ్వకపోతే వారు ఆ ఆన్ లైన్ క్లాసులను తమ స్వదేశాలకు వెళ్ళి కొనసాగించవచ్చని ఆయన అన్నారు. ఏ కాలేజీ కూడా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా అవి పూర్తిగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడానికి వీల్లేదు, కాలేజీలలో సాధారణంగా క్లాస్ రూమ్ క్లాసులు కూడా నిర్వహించాల్సిందే అని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ ఏదైనా కాలేజీ కానీ విద్యార్థులు కానీ ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఆ కాలేజీల లైసెన్స్ రద్దు చేస్తామని ఆ విద్యార్థినీ తిరిగి తమ స్వదేశాలకు పంపేస్తామని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

 

అమెరికా దేశం కేవలం గత ఒక్క ఏడాదిలో 11 లక్షల విద్యార్థులని ఆకర్షించి తమ యూనివర్సిటీల్లో చేర్చుకుంది. ఇక ఈ ఏడాది సెప్టంబర్ వరకు ప్రారంభమయ్యే సెమిస్టర్లకు విద్యార్థులను ఆహ్వానిస్తూ 4 లక్షల మందికి వీసాలు ఇచ్చింది. దాంతో ఇప్పుడు వారంతా అంటే 15 లక్షల మంది ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్ దొరని ఎలా ఉందంటే అయితే తమ జీవితాలని రిస్క్ చేసి కరోనా భీబత్సంగా ఉన్నప్పటికి వారు ప్రాణాలకు తెగించి కాలేజీలకు వెళ్ళాలి లేదా తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోవాలి..! ఇది ఇప్పుడు అక్కడి విద్యార్థుల దుస్థితి. ఈ నిర్ణయం ఓ నియంత తీసుకునే నిర్ణయం కాదా..? ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి ట్రంప్ ఓ భావితరాల నిర్మాతో భయంకర నియంతో..?

మరింత సమాచారం తెలుసుకోండి: