అవును! నిజంగా.. ఈ మాట దేశంలోని కీల‌క శాస్త్ర‌వేత్తుల‌, వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. దేశ‌వ్యా ప్తంగా క‌రోనా కేసులు నానాటికీ విజృంభిస్తున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అదేస‌మ‌యంలో మృతులు కూడా పెరుగుతున్నార‌ని అంటున్నారు. దీనిని బ‌ట్టి.. మీడియాలో క‌రోనా వి జృంభించేసింద‌ని, ప్ర‌జ‌ల ప్రాణాల‌కు భారీ ముప్పు పొంచి ఉంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారంతోనూ భ‌య‌ప‌డిపోయి.. ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌నేది నిపుణుల మాట‌. అంతేకాదు, కొన్ని చూచాయ‌గా క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు.. అంటే.. తమ్ము, ద‌గ్గు, స్వ‌ల్ప జ్వ‌రం ఉన్న‌వారు.. మ‌రిం త‌గా భ‌య‌ప‌డుతున్నారు. దీంతో వారు దిగులు పెట్టుకుని, మాన‌సికంగా కుంగిపోతున్నార‌ని కూడా వైద్యు లు చెబుతున్నారు. 


ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో గ‌త రెండు రోజులుగా జాతీయ మీడియాలో కొన్ని ప‌త్రిక‌లు క‌రోనా విష‌యంలో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్నాయి. ప్ర‌స్తుతం మ‌న దేశంలో క‌రోనా తీవ్ర‌త ఎంత‌?  ప్ర‌చారం జ‌రుగు తున్న‌ది ఎంత‌?  అదేస‌మ‌యంలో క‌రోనా విష‌యంలో రోజుకో వార్త రావ‌డం వెనుక ఉన్న అర్ధం ఏంటి?  ఇ క‌, క‌రోనా నుంచి కొంద‌రు కోలుకుంటుండ‌గా.. ముఖ్యంగా నిన్న‌నే వార్త‌ల్లో వ‌చ్చింది.. 106 ఏళ్ల కురువృద్ధు డు క‌రోనాను జ‌యించాడు అని! మ‌రి.. యువ‌కులు ఎందుకు మృతి చెందుతున్నారు. క‌రోనా ప్ర‌భావం 25-45 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారిపై ఎక్కువ‌గా ఎందుకు ప్ర‌భావం చూపుతోంది? అనే విష‌యాల‌ను సోదాహ‌ర‌ణంగా ప్ర‌స్థావించిన జాతీయ మీడియాలో ఆస‌క్తికర విష‌యాలు చూద్దాం!


దేశంలో ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ప్ర‌భావిత‌మైన‌వారు 7 ల‌క్ష‌ల పైచిలుకు! ఇక‌, మృతి చెందిన‌వారు 20 వేలు. మ‌న దేశ జ‌నాభా 126 కోట్లు. దీనిని బ‌ట్టి.. దేశంలో క‌రోనా ప్ర‌భావం ఎంత ఉంది?  ఇప్ప‌టి వ‌ర‌కు ఉ న్న అంచ‌నాల‌ను బ‌ట్టి.. 0.01% మాత్ర‌మే.. ఇక‌, మృతుల విష‌యానికి వ‌స్తే.. 0.001%. ఇది అక్ష‌రాలా నిజం. ఎందుకంటే.. మొత్తం జ‌నాభాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ప్పుడు.. 126 కోట్ల‌లో 7 ల‌క్ష‌ల మందికి క‌రోనా సోకింది. ఇక‌, 20 వేల మంది మృతి చెందారు. కాబ‌ట్టి.. క‌రోనా తీవ్రత విష‌యం ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర చార ప్ర‌భావానికి భ‌య‌ప‌డిపోవాల్సిన అవ‌స‌రం లేద‌నేది.. నిపుణుల మాట‌ని.. జాతీయ మీడియా వెలువ రించింది. 


అయితే, అదేస‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా కీల‌క జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు సూచించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అతి ప్ర‌చారం కార‌ణంగా.. క‌రోనా ప్ర‌భావం మాన‌సికంగా ప్రమాదారిగా మారిపోయి.. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిపై ప్ర‌భావం చూపిస్తోంద‌న్న‌ది నిపుణుల మాట‌. వాస్త‌వానికి క‌రోనా సోకినా.. కోలుకుంటున్న వారి సంఖ్య మెరుగ్గానే ఉంది. కానీ, యాంత్రికంగా దీనిపై జ‌రుగుతున్న ప్ర‌చారం వ‌ల్ల‌.. ప్ర‌జ‌లు భ‌యాందో ళ‌న‌ల‌కు గురై.. విప‌రీత ప‌రిణామాల‌కు దారితీస్తోంద‌ని అంటున్నారు. ఇక‌, క‌రోనా సంఖ్య‌, మృతులు మా త్రమే కాదు.. ముందు జాగ్ర‌త్త‌లు.. దాని విస్త‌ర‌ణ‌పై కూడా రోజుకొక వింత వార్త చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నా యి. గాలి ద్వారా వ్యాపిస్తుంద‌ని.. తాజాగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. 


ఇక‌, కొన్ని రోజుల కింద‌ట‌.. మ‌లం ద్వారా.. కూడా వైర‌స్ వ్యాపిస్తుంద‌ని, కంటి ద్వారా కూడా ఇత‌రుల‌కు సోకుతుంద‌ని ప్రచారం జ‌రిగింది. కానీ, క‌రోనా .. అనేది ఇత‌మిత్థంగా ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం గొంతు, ము క్కు నుంచి వ‌చ్చే తుంప‌ర్లు, లేదా ద్ర‌వాల ద్వారా మాత్ర‌మే ఒక‌రి నుంచి ఒక‌రికి వ్యాపిస్తుంద‌నేది రూఢీ అయిన విష‌యం. కానీ, అస‌లు క‌న్నా కొస‌రుకు ప్రాధాన్యం అన్న‌ట్టుగా.. ప్ర‌ధాన విష‌యాల‌కు ప్ర‌చారం లేకుపోవ‌డంతో ప్ర‌జ‌ల్లోనే ఒక అయోమ‌య ప‌రిస్థితి ఏర్ప‌డింది. ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ.. సాధ్య మైనంత వ‌ర‌కు ఇత‌రుల‌కు దూరంగా ఉండ‌డాన్ని మించిన ఆయుధం మ‌రొక‌టి లేదు. ధైర్యే సాహ‌సే.. అన్న‌ట్టుగా.. క‌రోనా విష‌యంలోనూ ధైర్యంగా ఉండ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు నిపుణులు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: