పూర్వంలో తుగ్లక్ అనే రాజు తన జీవితకాలంలో మూడు కోటలు మారాడు ఎందుకో తెలుసా వాస్తు దోషం అనే కారణం చెప్పి..కానీ చివరికి ఏం అయ్యింది తుగ్లక్ కు తుగ్లక్ పేరే వచ్చింది తప్పా తానెప్పటికీ అక్బర్ అవ్వలేకపోయాడు. అందరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇక తెలంగాణ లోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే....కరోనా వీర విహంగం...ప్రజాక్షేత్రం అతలాకుతలం..! ప్రజా ప్రతినిదులు అవస్తలు...శాస్త్రవేత్తలు తలకిందల తప్పస్సులు...!  ఇన్నిటినడుమా కేసీఆర్ వాస్తు శాస్త్రం...! కాని కేసీఆర్ మాత్రం కుటుంబంతో ఫామ్ హౌజ్ లో కాలక్షేపం.....ఇది పరిస్థితో దుస్థితో మీరే నిర్ణయించుకోండి.

 

రాష్ట్రం పరిస్థితి అస్సలు బాలేదు, కరోనా వీరవిహంగం చేస్తుంటే నియంత్రణ లేని పాలన నడుస్తుంది రాష్ట్రంలో, ప్రతీ రోజు అతితక్కువ కేసులు నిర్వహిస్తూ ప్రజాక్షేత్రాన్ని మరింత రిస్క్ లో పెడుతున్నారు. గాంధీ ఆసుపత్రి పరిస్థితి గందరగోళంగా కుప్పల తెప్పలుగా ప్రజలు ఉన్నారు.. వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు చేయని కృషి లేదు, ఇక ఇలాంటి టైమ్ లో సీఎం కేసీఆర్ కు ఇవేమీ కనపడకుండా కేవలం తెలంగాణ సెక్రటేరియట్ మాత్రమే కనిపిస్తుంది. ఆ సెక్రటేరియట్ లో కూడా ఎక్కడో ఉన్న వాస్తు దోషం మాత్రమే కనిపిస్తుంది. పాత సెక్రటేరియట్ భవనాన్ని తొలగించి 500 కోట్లు ఖర్చు పెట్టి నయా సెక్రటేరియట్ భవనం కట్టడమే అది కూడా వాస్తు ప్రకారంగా నిర్మించడమే తన ద్యెయంగా పెట్టుకున్నాడు సీఎం కేసీఆర్. సరే గత ఏడాది ఈ నిర్ణయం తీసుకున్నారు కదా అని మనం అనుకున్నా ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అని మనకు మనం ప్రశ్నించుకోవాలి.

 

ఇలాంటి దీనమైన పరిస్థితిలో ఇప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టి కొత్త భవనం కట్టించడం అవసరమా..? మొత్తం 25 ఎకరాల భూమి అన్నీ వసతులతో పెద్ద ఆసుపత్రికి ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి మరి ఈ దీన స్థితిలో ఆ భవంతిని కరోనా ను నియంత్రించేందుకు ప్రజలకు వసతులు కల్పించేందుకు ఆసుపత్రిలా ఉపయోగించలేరా..? కోర్టులో ఎందరో పిటిషన్ లు వేశారు భవంతిని కూల్చవద్దు అని కోర్టు వాటిని అన్నిటినీ కొట్టేసి కేవలం ప్రభుత్వం వేసిన ఒక్క పిటిషన్ ను మాత్రమే ఆమోదించింది. ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి చట్టం..? భవనాన్ని నిర్మించవచ్చు అది ప్రభుత్వ నిర్ణయం కానీ సిటీ మొత్తం లో మరెక్కడా చోటు లేదా ఇప్పుడు అదే భావాన్ని కూల్చడం ఎందుకు..? దాన్ని ఆసుపత్రిలా ఉపయోగించి కాలం సద్దుకున్న తరువాతా అన్నీ అనుకూలిస్తే ఆ పని చేయవచ్చు కదా..? కోర్టు అలా తీర్పుని ఇచ్చిందో లేదో పట్టు వదలని విక్రమార్కుడిలా తాను అనుకున్న పని చేసేందుకు తెగ తారస పడుతున్నాడు ముఖ్యమంత్రి. కూల్చివేతను మొదలు పెట్టించేశాడు.

 

వైద్య సిబ్బంది దగ్గర సరైన పీపీఈ కిట్లు లేవు.. అది ఎవ్వరూ పట్టించుకోరు. గాంధీ ఒక్కటి తప్ప సామాన్యుడు భరించగల వేరే ఆసుపత్రి లేనే  లేదు.. ఛాతీ ఆసుపత్రికి వెళితే చంపేస్తున్నారు మరి వీటి గురించి ఎందుకు ఆలోచించనట్టు..? రోజుకు 2000- 3000 టెస్టులు చేస్తే రాష్ట్రం ఎప్పుడు తెలుకుంటుంది, 4 కోట్ల ప్రజలు ఎప్పుడు ఊపిరి పిల్చుకుంటారు..? వారి గురించి ఆలోచన ఎందుకు లేదు..? పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వయసు లో చాలా చిన్నవాడు, కొడుకు తోటి వాడు, అనుభవం లో కూడా సాటి రాడు ఇప్పటికే 10 లక్షల టెస్టులు చేయించాడు మరి కేసీఆర్ ఎందుకు 1.5 లక్షల టెస్టులు కూడా చేయించలేకపోయాడు. ఇవి ఏ విషయాలు పట్టించుకోకుండా ఫామ్ హౌజ్ లో కాలం గడుపుతూ, ప్రజలకు రక్షణ లేకుండా, కెప్టెన్ లేని పడవలా రాష్ట్రం ఇంకెంత కాలం సాగాలి..? ఇవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు ఆ భవనానికి 500 కోట్లు ఖర్చు పెట్టడం అత్యంత బాధాకరం...! దేశం వాహ్ తెలంగాణ అనేది ఇప్పుడు అదే దేశం అయ్యో తెలంగాణ అనే పరిస్థితికి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: