ఇదే విషయం అర్ధంకాక యావత్ ప్రపంచం వణికిపోతోంది. చైనాను దాటి బయట దేశాల్లోకి అడుగుపెడుతున్న వైరస్ లు  ప్రపంచదేశాలను వణికించేస్తున్నాయి. తాజాగా ఉత్తర చైనాలోని ఉత్తర ప్రాంతంలోని బయన్నూర్ లో రెండు రోజుల క్రితం ’బుబోనిక్’ అనే కొత్తరకం వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ ను అక్కడి డాక్టర్లు ’బుబోనిక్ ప్లేగ్’ గా గుర్తించారు. బయన్నూర్ ప్రాంతంలోని ’మర్కోట్’ జాతికి చెందిన ఎలుకలను తిన్న కారణంగానే బుబోనిక్ ప్లేగ్ వస్తుందని వైద్య నిపుణులు తేల్చిచెప్పారు.  ఈ ప్లేగ్ ను డాక్టర్లు గుర్తించి వైద్యం ప్రారంభించే సమయానికి ఈ ప్రాంణాతక వైరస్ చైనాను దాటిపోయింది. డ్రాగన్ దేశానికి సరిహద్దులను ఆనుకుని ఉండే మంగోలియాలో ఈ ప్లేగ్ చాలా స్పీడుగా వ్యాపిస్తోందని డాక్టర్లు ఆందోళన పడుతున్నారు.

 

బయన్నూర్ ప్రాంతంలో జ్వరం, తలనొప్పి, చలితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆసుపత్రికి చికిత్స కోసమని వచ్చాడు. అతనిని పరీక్షించిన డాక్టర్లకు అతని శరీరంపై పుండ్లు కనిపించాయట. దాంతో అనుమానం వచ్చి రక్త పరీక్షలతో పాటు ఇతరత్రా పరీక్షలను చేస్తే అతని శరీరంలో భయంకరమైన వైరస్ ఉన్నట్లు గుర్తించారు. కొత్తగా బయటపడిన ఈ ప్లేగ్ చాలా స్పీడుగా ఇతరులకు అంటుకుంటుంది. అందుకనే అతని కుటుంబసభ్యులను కూడా వెంటనే డాక్టర్లు ఆసుపత్రులకు తరలించారు. అయితే అప్పటికే అతనుంటున్న ఇంటి చుట్టుపక్కల కుడా ఇదే లక్షణాలతో బాధపడుతున్న మరో వందమంది కూడా  వేర్వేరు ఆసుపత్రుల్లో చేరినట్లు తెలిసింది.

 

ఈ వైరస్ ను కనుక్కునేటప్పటికే దాని వ్యాప్తి చాలా స్పీడుగా ఉందన్న విషయం బయటపడటంతో డాక్టర్లలో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న స్ధానిక డాక్టర్లు, అధికారులు బుబోనిక్ ప్లేగ్ వ్యాప్తిని లెవల్-3 గా ప్రకటించారు. ఒకేసారి లెవల్-3గా ప్రకటించారంటేనే  ఇది ఎంత ప్రమాదమో అర్ధమైపోతోంది. జ్వరం, చలి, తలనొప్పి లాంటి లక్షణాలకు తోడు శరీరంపై పుండ్లు కూడా కనబడితే అది రోగికి చివరిదశగా గుర్తించాలంటూ ఇప్పటికే డాక్టర్లు ప్రకటించినట్లు సమాచారం. పై లక్షణాలున్న వాళ్ళు ఎక్కడున్న వెంటనే తమ సమీపంలో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళి డాక్టర్లను కలవాలని స్ధానిక అధికారులు కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.

 

ఎలుకల్లో ఉండే ఎర్సీనియా పెస్టిన్ అనే బ్యాక్టీరియా వల్లే మనుషులకు ఈ ప్లేగ్ సోకుతుందని డాక్టర్లు ప్రకటించారు. చైనాలో ఎలుకలను ప్రత్యేకించి మర్కోట్ అనే జాతి ఎలుకలను చాలా ఇష్టంగా తింటారు. ఈ కారణంగానే  చైనాలో ఇపుడు బుబోనిక్ ప్లేగ్ కూడా మొదలైపోయింది. ముందు గబ్బిలాలు, ఇతర ప్రాణులను తిన్నకారణంగా  కరోనా వైరస్ సోకిందన్నారు. తర్వాత పందుల్లోని ఓ జాతిని తినటం వల్ల జీ-4 , హెచ్-1, ఎన్-1 వైరస్ మొదలైందన్నారు. ఇపుడు మర్కోట్ జాతి ఎలుకలను తినటం వల్ల బుబోనిక్ ప్లేగ్ అంటున్నారు.

 

చూస్తుంటే భూమి మీద దొరికే సమస్త ప్రాణుల్లో దేన్ని కూడా  చైనా వాళ్ళు విడిచిపెట్టేట్లు లేరు. అందుబాటులోకి వచ్చిన ప్రతి ప్రాణిని చంపేయటం, వండుకుని తినేయటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లే కనబడుతోంది. అందుకనే చైనా నుండే ప్రపంచానికి ఇన్ని వైరస్ లు ఎగుమతవుతున్నాయి. ఇపుడీ బుబోనిక్ ప్లేగ్ కూడా చైనాను దాటి పక్కనే ఉన్న మంగోలియాకు చేరుకున్నదట. మంగోలియాకు వచ్చిందంటే ఇతర దేశాల్లోకి ప్రవేశించటం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి ప్రపంచాన్ని చైనా ఏమి చేయదలచుకున్నది ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: