మరోసారి జగన్మోహన్ రెడ్డి కొట్టిన మాస్టర్ స్ట్రోక్ తో మరోసారి చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాకు పెద్ద షాకే కొట్టింది. వైజాగ్ సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ ప్రమాదానికి సంబంధించి 12 మందిని ప్రభుత్వం అరెస్టు చేయటం సంచలనంగా మారింది. అరెస్టయిన వారిలో దక్షణికొరియాకు చెందిన కంపెనీ సీఈవో, ఎంపి సుంకీ జియోంగ్, టెక్నికల్ డైరెక్టర్ డిఎస్ కిమ్ తదితరులున్నారు. మే 7వ తేదీన ప్రమాదంలో 12 మంది చనిపోగా మరికొందరు తీవ్ర అస్వస్ధతకు గురైన విషయం అందరికీ తెలిసిందే. జరిగిన ప్రమాదంలో మృతులకు తలా కోటిరూపాయలు నష్టపరిహారం ప్రకటించటంతో ప్రతిపక్షాలకు షాక్ కొట్టింది. చనిపోయిన వారికి ప్రభుత్వం డిమాండ్ చేసిన మొత్తంకన్నా ఊహించనిరీతిలో కోటి రూపాయల పరిహారం ప్రకటించటంతో ప్రతిపక్షాలకు నోళ్ళు పడిపోయాయి.

 

సరే ఆ తర్వాత మెల్లిగా తమ రాజకీయం మొదలుపెట్టేశాయి. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదని, అరెస్టులు చేయలేదని నానా గోల మొదలుపెట్టాయి. ఎల్లోమీడియా కూడా జగన్ కు వ్యతిరేకంగా  సొంతంగా అనేక కథనాలు అచ్చేశాయి. ప్రమాదం జరిగిన కారణాలపై నివేది కోరుతు ప్రభుత్వం అనేక కమీటీలను వేయటంతో పాటు హైపవర్ కమిటిని కూడా నియమించింది. ఇందులో భాగంగానే హైపవర్ కమిటి సోమవారం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రమాదానికి కంపెనీ నిర్లక్ష్యమే పూర్తి బాధ్యతగా హైపవర్ కమిటి తేల్చి చెప్పింది. దాంతో కమిటి రిపోర్టిచ్చిన 24 గంటల్లోనే కంపెనీ సీఈవోతో పాటు మరో 12 మందిపై పోలీసులు కేసులు పెట్టడం, అరెస్టులు చేయటంతో మళ్ళీ చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాకు షాక్ కొట్టినట్లైంది.

 

ప్రమాదం జరిగిన తర్వాత కంపెనీ యాజమాన్యంతో జగన్ చర్చలు జరపటాన్ని బూతద్దంలో చూపించాయి ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా. కంపెనీ యాజమాన్యంతో జగన్ కుమ్మకైపోయాడని, బాధ్యుతలపై చర్యలు తీసుకునే ధైర్యం జగన్ కు లేదంటూ నోటికొచ్చినట్లుగా ఆరోపణలు చేశాయి. మృతదేహాలను తీసుకుని కంపెనీ ప్రధాన గేట్ ముందు పెట్టి నానా రబస సృష్టించాయి. జగన్ కు వ్య తిరేకంగా ఏ చిన్న అవకాశం దొరికినా ఎల్లోమీడియా రెచ్చిపోయి బ్యానర్ కథనాలు అచ్చేశాయి. అయితే ప్రతిపక్షాల ఆరోపణలకు కానీ ఎల్లోమీడియా పచ్చ కథనాలకు కానీ జగన్ సమాధానం చెప్పలేదు. ఎప్పుడైతే హైపవర్ కమిటి రిపోర్టు వచ్చిందో వెంటనే ప్రభుత్వం యాక్షన్ లోకి దిగేసింది. 12 మందిపై పోలీసులు కేసులు పెట్టడం, అరెస్టులు జరగటాన్ని ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా ఏమంటుంది ?

 

గ్యాస్ ప్రమాదంలో బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం తన చిత్తశుద్దిని చాటుకుంది. అలాగే ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవటంలో కూడా ప్రభుత్వం సిన్సియారిటి ఏమిటో అందరికీ ఈపాటికే అర్ధమయ్యుంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఎందుకు ఎవరినీ అరెస్టు చేయలేదు ? ఎందుకంటే యాజమాన్యంలో ఎవరి బాధ్యత ఎంతో అప్పటికి ఎవరికీ తెలీదు కాబట్టే. అసలు ప్రమాదానికి కారణం గ్యాస్ లీకని అందరికీ తెలిసిందే. అయితే గ్యాస్ లీకేజీలో బాధ్యత ఎవరిది ? అన్నదే ఎవరికీ తెలీదు. ఆ విషయం కనుక్కునేందుకే ప్రభుత్వం హైపవర్ కమిటిని నియమించింది. కమిటి నివేదిక ఆధారంగానే కంపెనీ సీఈవోతో పాటు 12మందిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేసింది. అందుకనే చంద్రబాబుకు కానీ ఎల్లోమీడియాకు షాక్ కొట్టడంతో ఇపుడు నోళ్ళు పడిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: