తెలంగాణ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా..? కరోనా విజృంభణ సాకుతో కేంద్రం కొత్త వ్యూహం రచిస్తుందా..? తెలంగాణలో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా..? ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేననిపిస్తుంది.

 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. రోజురోజుకి అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది మరణించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అనే తేడా లేకుండా అందర్నీ కబళిస్తుంది ఈ మహమ్మారి. అయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం సరైన సదుపాయాలు అందట్లేదు. అలా అని ప్రైవేటు ఆసుపత్రికి పోదామంటే కాసులు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కరోనా టెస్టుల విషయంలో ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు సీరియస్ అయింది.

 

ప్రజలు కరోనాతో ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టనట్టుగా.. సచివాలయం కూల్చే పనిలో పడిపోయింది. వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో సచివాలయాన్ని కూల్చకుండా అశుపత్రిగా ఉపయోగించుకుంటే చాలా బాగుండేది. ఇదే మాటలు ప్రతిపక్ష నేతలు కూడా చెప్తున్నారు. అయినా అధికార పార్టీ నేతలు మాత్రం వీటిని పట్టించుకోవట్లేదు. తాజాగా.. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్యయ్య సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. గత 13 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదని గుర్తు చేశారు. కరోనా విజృంభించి జనం అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్లిపోయారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని పొన్నాల డిమాండ్ చేశారు.

 

పాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని.. కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేసిందని వ్యాఖ్యానించారు. అలాగే కరోనాతో రోజురోజుకూ భయానక పరిస్థితి ఏర్పడుతోంది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా సరే, రాష్ట్ర ప్రభుత్వం వినిపించుకోవడం లేదని బీజేపీ నాయకులే అంటున్నారు. ఇటీవల ఇదే విషయాన్ని కేంద్ర హోమ్ సహాయక శాఖమంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. పైగా కరోనా కట్టడి విషయంలో గవర్నర్ తమిళిసై కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. దీన్ని గమనించిన కేంద్ర పెద్దలు ఇప్పటికే గవర్నర్ తో మాట్లాడినట్టు సమాచారం. అవసరమనుకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించైనా సరే కరోనాని కట్టడి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: