నమస్తే అక్కయ్య.. నమస్తే చెల్లమ్మా, నమస్తే తమ్ముడు నమస్తే పాప.. నమస్తే నమస్తే అంటూ... ఆప్యాయంగా పలకరించిన ఆ గొంతును, ఆ రూపాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ముఖంపై ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడే మాటలను, చూపించే ప్రేమను గుర్తుచేసుకోకుండా ఉండలేరు. అసలు రాజశేఖర రెడ్డి మరణించాడు అనే చేదు నిజాన్ని ఒప్పుకునేందుకు ఇప్పటికీ ఎవరూ ఇష్టపడడంలేదు. ప్రతి పేదింటి బిడ్డగా, వారి పెద్ద కొడుకుగా, వారి కష్టాలను తీర్చిన దేవుడిగా ఆ రాజన్నను ఎవరూ మరిచిపోలేకపోతున్నారు. జన హృదయ నేతగా, పేదల పక్షపాతిగా రాజన్నాగా, నమ్మితే ప్రాణమిచ్చే వ్యక్తి గా, తన అనుకున్న వారి కోసం ఎంత రిస్క్ అయినా చేసే మనిషిగా. పేదింటి ఆరాధ్య దైవంగా, రైతు బంధువుగా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పేర్లు, బిరుదులు, పోలికలు ఏవీ చాలవు.

IHG

ఆయన గొప్పతనం గురించి ఎంత సేపు చెప్పుకున్నా తరగదు. ఆయన భౌతికంగా జనాల మధ్య లేకపోయినా, ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజల మధ్య ఆయన సజీవంగానే ఉన్నారు. ఆయన అప్పట్లో ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ అమలవుతూ రాజన్న జ్ఞాపకాలను గుర్తి చేస్తున్నాయి. జనాలకు ఆయన్ను ప్రతిక్షణం గుర్తు చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేస్తూ.. దివంగతుడైన రాజశేఖర్ రెడ్డి జయంతిని ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణించాడనే విషయాలు ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన భౌతికంగా జనాలకు దూరం అయినా, జనహృదయనేతగా, అందరు గుండెల్లోని కొలువై ఉన్నారు.

IHG

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 , ఉచిత విద్యుత్, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఆయనను చిరస్మరణీయుడిగా గుర్తుచేసుకునేలా చేస్తున్నాయి. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం పేదల వైద్యం గురించే ఎక్కువగా ఆలోచించేవారు. పేదల వైద్యాన్ని వీలైనంత వరకు ప్రభుత్వపరం చేసేవారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో ప్రైవేటు ఆస్పత్రులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసి, ఎన్నో ఖరీదైన చికిత్సలు నిరుపేదలు కూడా చేయించుకునే విధంగా అవకాశం కల్పించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డిని జనాలు మరిచిపోలేదు. అంటే ఆయన చేసిన గొప్ప పనులే కారణం.

IHG

రాజశేఖర్ రెడ్డి తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినా, ఇప్పటికీ వారు ఎవరినీ జనాలు పెద్దగా గుర్తు పెట్టుకోలేదు. కానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం జనాల గుండెల్లో కొలువై ఉండడానికి ఆయన ప్రవేశ పెట్టిన పథకాలే కారణం. ఆయన లేకపోయినా ఇప్పుడు ఆయన ఆశయాలను, పథకాలను ఆయన వారసుడు జగన్ అమలు చేసి చూపిస్తూ, పేద ప్రజల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాడు. రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే జనాల బాగోగులను ఆలోచించే వారో ఇప్పుడు జగన్ కూడా అలాగే ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు. రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్ ఇప్పటికీ .. ఎప్పటికీ సజీవంగా ఉండేలా జాగ్రత్తపడుతూ ముందుకు వెళ్తున్నాడు. రాజన్నకు నిజమైన వారసుడిగా జగన్ తనని తాను నిరూపించుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: