ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో ప్రయారిటీ ఉంటుంది. అది ఆయా ముఖ్యమంత్రులను బట్టి.. ఆయా పార్టీల సిద్ధాంతాలను బట్టి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రి నిర్ణయాలను బట్టి ఆ ఐదేళ్లు రాష్ట్ర పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. ఏపీ సీఎం జగన్ సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. 

 

 


ఆయన ఇప్పటికే అనేక పథకాలు ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు. రైతులు, విద్యార్థులు, ఆటోవాలాలు, చేతి వృత్తుల వారు..ఇలా అన్ని వర్గాలకూ సాయం అందిస్తున్నారు. అయితే.. ఈ విషయంపై ఏపీ ప్రతిపక్షనేత విమర్శలు మరీ హాస్యాస్పదంగా ఉంటున్నాయి. 

 

IHG


ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే.. తాము అధికారంలో ఉంటే రైతులకు  ఒక్కొక్కరికి లక్షా ఇరవైవేల రూపాయలు వచ్చేవని అంటున్నారు. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ తీసివేసి, రైతు భరోసా ద్వారా తక్కువ డబ్బు ఇవ్వడం రైతు దినోత్సవమా అని ఆయన చంద్రబాబు విమర్శిస్తున్నారు. రైతు భరోసా తో రైతులకు ఐదేళ్లలో వచ్చేది 27500 రూపాయలేనని లెక్కలు వేస్తున్నారు. 

 

 


అంతేకాదు..  34 వేల ఎకరాల రైతుల ప్రాణాలు తీయడం రైతు దినోత్సవమా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. పది లక్షల మంది రైతులకు జగన్ భరోసా ఎగవేశారని ఆరోపించారు. అయితే మరి జగన్ అమలు చేస్తున్న ఇతర సంక్షేమ కార్యక్రమాల మాటేమిటి.. వాటి ద్వారా జనం లబ్ది పొందుతున్న వేల కోట్ల మాటేమిటి.. పోలిస్తే అన్ని అంశాల్లోనూ పోల్చాలి కదా.. అలా కాకుండా తమకు అనుకూలమైన లెక్కలు మాత్రమే చెప్పడం ద్వారా చంద్రబాబు జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారా..? 

మరింత సమాచారం తెలుసుకోండి: