ఏ పల్లెకు పోయినా ఓ వాడకు పోయినా మారు మూల ప్రాంతమైనా జనజీవన స్రవంతితో దూసుకుపోతున్న పట్టణం అయినా...ఈయన పేరు చెబితే గుర్తు పట్టని వారుండరు. ఒకప్పటి ప్రజలు తమ ఇళ్ళలో మహాత్మా గాంధీ ఫోటోలు పెట్టుకునేవారు కానీ ఇప్పటి ప్రజలు తమ ఇళ్ళలో ఈయన ఫోటోలు పెట్టుకుంటున్నారు. పంచ కట్టుకి తెలుగు ప్రజల పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రెస్. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం, పేదల ప్రజల ఆకలి తీర్చేవాడు ప్రజలకోసమే నాయకుడయ్యి ప్రజల శ్రేయస్సు కోసమే జీవించినవాడు ఆయనే దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి.

 

తనకి రాజకీయాల్లోకి రావలసిన అవసరం లేదు, ఆస్తిపాస్తులు పంట పొలాలు పాడి... డాక్టర్ పట్టా, గ్రామ క్లినిక్ చేతినిండా డబ్బు. కానీ పెద ప్రజల ఆకలి తనను రమ్మని పిలిచింది, ఆ ఆకలి తీర్చమని కోరింది. రైతు కష్టాలు. ఆత్మహత్యలు తనను కదిలించాయి, వైద్య వసతులు లేక వైద్యానికి తగినంత డబ్బు లేకా ప్రజలు చనిపోతుంటే తట్టుకోలేకపోయాడు. ప్రజల కష్టం తీర్చడమే తన బాధ్యతాగా చేపట్టి ప్రభుత్వాన్ని ఎదురించడం ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు ఆర్థికవేత్త అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యాడు ఆపై పెద ప్రజల దేవుడయ్యాడు. తాను తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు దేశానికే సుపోర్తినిచ్చాయి. కేజీ నుండి పీజీ ఉచిత విద్య, రైతుల ఋణ మాఫీ, 108 అంబులెన్స్ సర్వీసు, రాష్ట్ర రహదారులు ఇలా మరెన్నో ఆయన చేసిన అభ్వృద్ధికి రాష్ట్రమే కాదు దేశమే ఫిదా అయ్యింది.

 

ఆయన ప్రారంభించిన 108 సర్వీస్ నేడు దేశవ్యాప్తంగా విస్తరించి ఎందరో ప్రాణాలు కాపాడుతుంది. అందుకే నేటికీ పల్లెలకు వెళితే ప్రతి పల్లెలో డాక్టర్ వైఎస్ విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రజలు ఓటు వేసింది కాంగ్రెస్ పార్టీకి కాదు కేవలం ఆయన కాంగ్రెస్ లో ఉన్నందుకే..! ఆయన చరిష్మా అలాంటిది. ఆయన ఉన్నన్ని నాళ్ళు కేసీఆర్ నోట తెలంగాణ మాట రాలేదు. ఆయనే ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇలా ముక్కలయ్యేది కాదు. ఆయనే ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ నేడు భూస్థాపితం అయ్యిది కాదు. ఆయనే ఉండి ఉంటే టీడీపీ పార్టీకి ఈ గతి పట్టేది కాదు. ఆయనే ఉండి ఉంటే పెద రైతుల ప్రాణాలు పోయేవి కావు. ఆయనే బ్రతికి ఉంటే అక్రమ కుంభకోణాలకు ఆంధ్ర పుటినిల్లు అయ్యేది కాదు.

 

ఆయనే బ్రతికి ఉంటే ప్రతీ జిల్లా శశ్యశ్యామలంగా పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఆంధ్రప్రదేశ్ కు పచ్చని రాష్ట్రం అనే పేరు వచ్చేది. ప్రజలే కాదు వరుణ దేవుడు కూడా ఆయనకు మంచి విధేయుడు. ఆయన పరిపాలన అంటే రాష్ట్రం లో పుష్కలంగా వానలు కురిసేవి.. ఇవి మేము చెబుతున్న మాటలు కాదు చరిత్ర రాసిన పేజీల్లో నుండి తీసిన అక్షరాలు. కానీ ఆంధ్రప్రదేశ్ తన కొడుకును కోల్పోయింది, ఆంధ్ర అరణ్యం తన బిడ్డను తనలోకి లీనం చేసుకుంది. ఆయనను స్మరిస్తూ ఆయనను తలుస్తూ ఆయన పుట్టిన రోజును రైతుల దినోత్సవంగా జరుపుకుంటున్న ప్రతీ ఒక్కరికీ ఇవే మా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: