తొలి మూడు సీజన్ లతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఉర్రూతలూగించిన రియాలిటీ షో 'బిగ్ బాస్' నాలుగవ సీజన్ కు ముస్తాబవుతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో పై ప్రేక్షకులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టేయగా రెండో సీజన్ లో న్యాచురల్ స్టార్ నాని మంచి మార్కులు కొట్టేశాడు. ఇక మూడవ సీజన్ హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున దీన్ని విజయవంతం చేశారు. ఇకపోతే ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 4 సంగ‌తేమిటి.?  హోస్ట్ ఎవ‌రు.?  పార్టిసిపెంట్స్ ఎవ‌రెవ‌రు..? లాంటి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.

 

మొన్నటివరకు సోషల్ మీడియా వేదికగా అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి.. ఈసారి బిగ్ బాస్ సీజ‌న్ 4 హోస్ట్ గా మళ్లీ తారక్ వస్తాడు అని కొందరు.. లేదు, లేదు ఈసారి కూడా నాగార్జునే కంటిన్యూ చేస్తాడు అని ఇంకొందరు.. అబ్బే ఇదంతా కాదు, ఈసారి లేడీ హోస్ట్‌ గా సమంత తెరపైకి వస్తోందంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా.. ఈ జాబితాలోకి మరో పేరు చేరినట్టు తెలుస్తుంది. ఈ సారి హోస్ట్ గా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేయబోతునట్టు వార్తలు వస్తున్నాయి. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే విజయ్‌ని హోస్ట్‌ గా పెడితే యూత్‌, లేడీ ఆడియన్స్‌ లో మంచి క్రేజ్‌ వస్తుందని, షో కూడా సూపర్ హిట్టవుతుందని నిర్వాహకులు అనుకుంటున్నారట.

 

అదే విషయాన్ని రౌడీ హీరోకి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. ఎలాగో ఇప్పట్లో సినిమా షూటింగ్స్‌ జరిగేలా లేవు కాబట్టి.. ఈ ఖాళీ టైమ్‌లో బిగ్‌బాస్‌ షూట్‌లో పాల్గొనాలని అతడిని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో విజయ్‌ నుంచి గానీ… బిగ్‌బాస్‌ యూనిట్‌ నుంచి గానీ అధికారికంగా ప్రకటన రాలేదు. విజయ్‌ హోస్టింగ్‌కు ఒప్పుకుంటే మాత్రం బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ ఓ రేంజ్‌లో దూసుకెళ్లడం పక్కాని అందరు అంటున్నారు. చూద్దాం మరి ఈ ఆఫర్ కి మన రౌడీ హీరో ఎలా రియాక్ట్ అవుతాడో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: