రాహుల్ గాంధీ టార్గెట్ గా బీజేపీ కొత్త వ్యూహం రచిస్తుందా..? అందులో భాగంగా ఆయనపై ఉన్న పాత కేసులను తెరపైకి తెస్తుందా..? రాహుల్ గాంధీ త్వరలోనే జైలుకి వెళ్లనున్నారా..? అసలు రాహుల్ గాంధీని బీజేపీ టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి..? ఇలాంటి ప్రశ్నల గురించే దేశ ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అసలు రాహుల్ గాంధీపై ఉన్న ఆ పాత కేసు ఏంటి..? దాని కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

 

2006లో అమేథీకి సోనియా గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో.. రాహుల్ గాంధీ తన గెస్ట్ హౌస్‌ లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో తనకు అభిమాని అయిన పార్టీ కార్యకర్త బల్‌రామ్ సింగ్ కూతురు సుకన్యపై రాహుల్ గాంధీ, అతని స్నేహుతులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఐతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ కేసులో నిజాలు బయటికి రాకుండా చేశారని.. రాహుల్‌ తో పాటు అతడి స్నేహితుల్ని బయటపడేశారని.. మీడియా కూడా ఈ విషయంలో ప్రముఖ పాత్ర పోషించిందని అప్పట్లో తెగ ఆరోపణలున్నాయి.

 

అలాగే ఆ తర్వాత బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు అమేథీ నుంచి ఢిల్లీకి వెళ్లిపోగా.. వాళ్లు తర్వాత ఏమయ్యారు.. ఎక్కడున్నారు అన్న సమాచారం ఎవరి దగ్గరా లేదు. పన్నెండేళ్లకు పాటు ఈ కేసు విచారణ సాగగా.. గత ఏడాది ఆధారాల్లేవంటూ సుప్రీం కోర్టు ఈ కేసును కొట్టేసింది. అయితే తాజాగా.. బీజేపీ నేత సంబిత్ స్వరాజ్ ఓ టీవీ చర్చలో రాహుల్ గాంధీ మీద రేప్ కేసు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ గట్టిగా గళం వినిపించాడు.దీంతో మళ్ళీ ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

 

#sukanyarapistrahulgandhi అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం మొదలుపెట్టింది. అయితే దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ కేసు గురించి బీజేపీ నేతలు మాట్లాడటం వెనుక రాజకీయ కుట్ర దాగుందని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ కేసును తెరపైకి తీసుకొచ్చి.. ఒకవేళ ఇది వాస్తవమైతే రాహుల్ గాంధీని జైలుకి పంపాలని, లేకపోతే దీని ద్వారా రాహుల్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: