కొంతమంది ముఖ్యమంత్రుల పేర్లు చెబితే కొన్ని పథకాలు, కార్యక్రమాలు గుర్తుకు వస్తాయి. ఎన్టీయార్ పేరు చెప్పగానే మండల వ్యవస్ధ ఏర్పాటు గుర్తుకువస్తుంది. 2 రూపాయల కిలో బియ్యం పథకం గుర్తుకువస్తుంది. ఆస్తుల్లో మహిళలకు సమానహక్కులు కల్పించటం కూడా ఎన్టీయార్ చలవనే చెప్పాలి. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు చెప్పగానే  ఆరోగ్యశ్రీ పథకం వెంటనే ఠక్కున చెప్పేస్తారు జనాలు. 108, 104 అంబులెన్సులను ఎవరు ప్రవేశపెట్టారంటే కూడా వెంటనే వైఎస్ పేరే చెబుతారు.  సరే తాజాగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినపుడు నవరత్నాలు గుర్తుకువస్తాయి. అమ్మఒడి, గ్రామసచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ గుర్తుకువస్తాయి.  దిశాచట్టం అలాగే అటకెక్కిన 108, 104 అంబులెన్సు వ్యవస్ధను మళ్ళీ ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగినా వెంటనే  జగన్ పేరే చెబుతారనటంలో సందేహం లేదు.

 

అంటే ముగ్గురు ముఖ్యమంత్రుల పేర్లు చెబితే  కచ్చితంగా కొన్ని పథకాలు గుర్తుకు రాకమానదు. అంటే జనాల హ్రుదయాల్లో తమ పథకాల అమలుతో పై ముగ్గురు ముఖ్యమంత్రులు చెరగని ముద్ర వేశారనే చెప్పారు.  అంతాబాగానే ఉంది మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు పేరు చెబితే ఏ పథకం గుర్తుకు వస్తుంది ?  ఎన్టీయార్, వైఎస్సార్ కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఎన్ని పథకాలు గుర్తుకురావాలి ? ఆలోచిస్తే ఒక్క పథకం కూడా గుర్తుకు రావటం లేదా ? నో ప్రాబ్లమ్,  అది మీ తప్పు కానేకాదు.

 

1995లో ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1999 వరకు కంటిన్యు అయ్యాడు. తర్వాత బిజెపి చలవతో రెండోసారి గెలిచి 2004 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత వైఎస్ దెబ్బకు మళ్ళీ పదేళ్ళవరకూ ప్రతిపక్షానికే పరిమితమైపోయాడు. 2014లొ నరేంద్రమోడి చలవ వల్ల మూడోసారి ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చుని చివరకు 2019లో ఘోరంగా ఓడిపోయి అధికారంలో నుండి దిగిపోయాడు. మరి మూడుసార్లు ముఖ్యమంత్రిగా అయితే పనిచేశాడు కానీ తనది అని చెప్పుకునేందుకు జనాల హ్రుదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేందుకు కనీసం ఒక్కటంటే ఒక్క పథకం కూడా తీసుకురాలేదు.

 

పైగా వైఎస్సార్ మానసపుత్రికగా చెప్పుకునే ఆరోగ్యశ్రీ పథకం అమలును ఐదేళ్ళల్లో గబ్బు పట్టించేశాడు. పడకేసిన ఆరోగ్య శ్రీ పథకంతో పాటు 108, 104 అంబులెన్స్ వ్యవస్ధను జగన్ రివైవ్ చేస్తున్నాడు. పథకాలను గబ్బు పట్టించేయటం, ప్రాజెక్టుల్లో భారీ అవినీతికి పాల్పడటం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని వైసిపి నేతలు ఆరోపిస్తున్నది ఇందుకే. పోలవరం ప్రాజెక్టును ఏటిఎంలాగ వాడుకున్నాడని చివరకు స్వయంగా ప్రధానమంత్రే ఆరోపించాడంటే చంద్రబాబు పాలనకు వేరే సర్టిఫికేట్ అవసరమే లేదు. చంద్రబాబు చేసిందేమన్నా ఉంటే అదేమిటయ్యా అంటే  ప్రతిపక్షంలో కూర్చుని ప్రభుత్వంపై రాళ్ళు విసరటమే. పేరుకు మాత్రమే మూడుసార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు కానీ చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదంటే నిజంగా పిటీనే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: