మ‌నం వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, బొమ్మ‌లు, క్యారీ బాగులు.. ఇత‌ర‌త్రా ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను తిరిగి వినియోగించి(రీ-సైక్లింగ్‌) ఇత ‌ర వస్తువులను త‌యారు చేయ‌డం, లేదా బాటిళ్ల‌నే త‌యారు చేయ‌డం మ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు తెలిసిన సంగ‌తే! అయితే, ఇలా వ‌స్తువులు తయారు చేయ‌డానికి, లేదా వేరే రూపంలో ప‌నికిరాని ప్లాస్టిక్‌ను వినియోగించేందుకు అవ‌కాశం లేక‌పోతే.. ఏం చేయా లి?  గ‌త రెండేళ్ల కింద‌టి వ‌ర‌కు ఇలాంటి ఎందుకూ ప‌నికిరాని ప్లాస్టిక్‌ను భూమిలో చాలాలోతు తొవ్వి.. అక్క‌డ పాతిపెట్టేవారు. కానీ, గ‌డిచిన రెండేళ్లుగా జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల‌తో ఒక కొత్త విధానాన్ని రూపొందించారు. అదే.. రోడ్లు వేయ‌డం. ఎందుకూ పనికి రాని ప్లాస్టిక్ వ్యర్థాలతో కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష కిలోమీటర్ల రహదారిని పూర్తి చేసింది.

 

రీ-సైక్లింగ్ కు కూడా ఏమాత్రం కుదరని ప్లాస్టిక్ను వినియోగించి ర‌హ‌దారులు నిర్మించింది.  ఫలితంగా కొన్ని వందల కోట్ల రూపా యలు ఆదా చేసింది. ఈ రిజ‌ల్ట్ చూసిన త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం మరో లక్ష కిలోమీటర్ల మేర దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ రోడ్లు వేయాల ని నిర్ణయించుకుంది.  వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రోడ్లు వేసే విధానాన్ని ప‌రిశీలిస్తే.. ఒక కిలోమీటరు రహదారిని వేయ డానికి తొమ్మిది టన్నుల తారు, అంతే మొత్తంలో కంక‌ర చిప్సు వాడ‌తారు. కానీ, ప్లాస్టిక్ ర‌హ‌దారుల నిర్మాణంలో ఒక కిలో మీట‌రు రోడ్డు వేయ‌డానికి 9 టన్నుల తారు.. ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను వాడారు. 

 

మామూలు రోడ్లలో కిలోమీటరుకు పది టన్నుల తారును వాడతారు. ఒక టన్ను తారుకు సరాసరి 30 వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. కిలోమీటరుకు ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను ఉపయోగించడం వల్ల, లక్ష కిలోమీటర్లకు వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యా యి. ప్లాస్టిక్ రోడ్లలో సహజంగా ఆరు నుంచి ఎనిమిది శాతం ప్లాస్టిక్, 92 నుంచి 94 శాతం తారు ఉంటాయి. ఢిల్లీ స‌మీప ప్రాంత‌మైన‌‌ గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా 2018లో తారు రోడ్లలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాడటం మొదలుపెట్టంది. ప్రస్తుతం అక్కడ తారురోడ్లలో ప్లాస్టిక్ను వాడటం తప్పనిసరి చేశారు. 

 

జమ్మూకాశ్మీర్ జాతీయ రహదారిలో 270 కిలోమీటర్ల దూరానికి ప్లాస్టిక్ వ్యర్ధాలు కలిపి రోడ్డు వేశారు. ఢిల్లీ–మీరట్ జాతీయ రహదారిలో కూడా 1.6 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ను వాడారు. ధౌలా కువాన్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు వేసిన రోడ్డులోనూ ప్లాస్టిక్ను వాడారు. ఇక‌.. ఈ రికార్డుల‌తో త్వ‌ర‌లోనే దేశం మొత్తం కూడా ప్లాస్టిక్‌ను వినియోగించి ర‌హ‌దారుల‌ను నిర్మించే యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీనివ‌ల్ల‌.. అటు ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం నిలువ‌రించ‌డంతోపాటు.. ఎందుకూ ప‌నికిరాని ప్లాస్టిక్‌ను వినియోగించుకునే అవ‌కాశం కూడా ఏర్ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి: