అవును మీరు చదివంది కరెక్టే. విత్యుత్ రంగం విషయంలో  పిపిఏల సమీక్ష విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి గుజరాత్ ప్రభుత్వం కూడా మద్దతుగా నిలబడింది.  2018లొ విద్యుత్ కొనుగోలు కోసం రెండుకంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ సమీక్షించాలని తీసుకున్న నిర్ణయంతో జగన్ కు మద్దతు పెరిగినట్లయ్యింది. మరి తాజా గుజరాత్ నిర్ణయంతో  కేంద్రప్రభుత్వంలోని కొందరు మంత్రులు, బిజెపి నేతలు, ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ +ఎల్లోమీడియాకు పెద్ద షాక్ కొట్టిందనే అనుకోవాలి. గతంలోనే ఉత్తరప్రదేశ్ లోని బిజెపి ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ యోగి కూడా విద్యుత్ పిపిఏలను సమీక్షించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 

విషయం ఏమిటంటే విద్యుత్ సరఫరా కోసం రెండు ఉత్పత్తి కంపెనీలైన టాటా పవర్స్ అండ్ ఎస్సార్ పవర్స్ (అదాని గ్రూప్)తో 7180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం గుజరాత్ ప్రభుత్వంతో  ఒప్పందాలు జరిగింది. అయితే తాజాగా పై ఒప్పందాలను సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించటం రాష్ట్రంలోనే కాకుండా కేంద్రప్రభుత్వంలో కూడా సంచలనం రేపుతోంది. ఎందకంటే పిపిఏలను సమీక్షించకూడదన్నట్లుగా ఇంతకాలం కేంద్రమంత్రులు కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ అధికారంలోకి రాగానే విద్యుత్ ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో ఆర్ధిక భారాన్ని దించుకోవాలని అనుకున్నారు. అందుకనే ఉత్పత్తి కంపెనీలతో చర్చలకు పిలిచాడు. ధరలన్నా తగ్గించండి లేకపోతే ఒప్పందాలనైనా రద్దు చేసుకోండి అని చెప్పాడు.

 

సరే తర్వాత కంపెనీలు కొన్ని కోర్టులకు వెళ్ళాయి. అదే సమయంలో కొన్ని కంపెనీలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. మధ్యలో చంద్రబాబు, కన్నా, పవన్ తదితరులు జగన్ పై నోటికొచ్చినట్లు ఆరోపణలు చేశారు.  పిపిఏల సమీక్షపై  జగన్ నిర్ణయంతో అంతర్జాతీయంగా రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందంటూ చంద్రబాబు నానా యాగీ చేశాడు. కొందరు కేంద్రమంత్రులు కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. రాష్ట్రంపై ఆర్ధికభారం తగ్గిద్దామన్న జగన్ ఆలోచనను వ్యతిరేకులు కొందరు చాలా డ్యామేజ్ చేశారు. ఒకవైపు  ఈ వివాదం నడుస్తుండగానే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా పిపిఏల సమీక్షకు రెడీ అయ్యింది. దీంతో జగన్ కు వ్యతిరేకంగా  కొంత గోల తగ్గిందనే చెప్పాలి.

 

అయితే  తాజాగా పిపిఏల సమీక్ష చేయాలంటూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జగన్ వ్యతిరేకులందరికీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే అయ్యింది. గుజరాత్ అంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి రాష్ట్రమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిపిఏలను సమీక్షించాలన్న గుజరాత్ సిఎం విజయ్ రూపాని  నిర్ణయం వెనుక కచ్చితంగా నరేంద్రమోడి మద్దతు ఉంటుందనటంలో సందేహం అవసరం లేదు. ఏపిలో తీసుకున్న నిర్ణయం లాంటిది తాజాగా గుజరాత్ లో కూడా తీసుకుంటున్నారంటే జగన్ నిర్ణయానికి కూడా కేంద్రప్రభుత్వం మద్దతు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇపుడు పిపిఏల సమీక్ష విషయంలో చంద్రబాబు, కన్నాలు ఏమి మాట్లాడుతారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: