గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేయబోతున్నారా..? మళ్ళీ పోటీ చేసేందుకు ఉపఎన్నికలలో దిగబోతున్నారా..? ఆయన దెబ్బతో ఎవరికి బొమ్మ కనపడబోతుంది..? అసలు వల్లభనేని వంశీ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి..? ఇప్పుడు ఈ ప్రశ్నలే రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

 

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా దాన్ని తట్టుకొని నిలబడి టీడీపీ తరుఫున గన్నవరం నుంచి వంశీ గెలిచాడు. కానీ తదనంతర పరిణామాలతో టీడీపీలో ఉండలేకపోయారు. టీడీపీ నుంచి గెలిసి వైసీపీకి మద్దతు పలుకుతున్నారనే అపవాదు ఉంది. దాంతో వల్లభనేని వంశీని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దాంతో వంశీ తిరగబడి టీడీపీకి రాజీనామా చేశారు.

 

ప్రస్తుతం శాసనసభలో టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీకి మద్దతు ప్రకటించిన వల్లభనేని వంశీ ఇప్పుడు ఆ టీడీపీకి శాశ్వతంగా గుడ్ బై చెప్పేందుకు డిసైడ్ అవుతున్నాడట..? తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ తరుఫున గన్నవరంలో పోటీచేసి గెలవాలని ఆలోచిస్తున్నాడట. టీడీపీ నేతల విమర్శలకు చెక్ పెట్టేందుకు.. ఉప ఎన్నికల్లో గెలిచి సగర్వంగా వైసీపీ ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో కూర్చోవాలని ఆలోచిస్తున్నాడట. ఈ విషయమై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సంప్రదింపులు జరిపారట.

 

అయితే వల్లభనేని వంశీ టీడీపీ తరుపున విజయం సాధించి వైసీపీకి మద్దతు పలకడంతో నియోజకవర్గంలోని అధికార, ప్రతిపక్ష నేతలు కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా మారారట. ఇది గమనించిన సీఎం జగన్.. ఇలాంటి పరిస్తితులలో ఉపఎన్నికలకు వెళ్ళడం సరి కాదు అని వల్లభనేని వంశీకి చెప్పారట. కాగా, ఇదే పరిస్థితి మరో ఇద్దరు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలైన మద్దాల గిరి, కరణం బలరాంలకి కూడా ఉన్నట్టు సీఎం జగన్ దృష్టికి వచ్చిందట. దీంతో ఈ పరిస్థితులను చక్కబెట్టి, అసంతృప్తులను బజ్జగించే పనిని కొందరు ట్రబుల్ షూటర్లకు సీఎం జగన్ అప్పగిచ్చినట్టు తెలుస్తుంది.

 

పరిస్థితులు చక్కబడిన తర్వాత ఎన్నికలకు వెళ్తే గెలుపు పక్కా అని సీఎం భావిస్తున్నారట. కాబట్టి.. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో త్వరలోనే ఉపఎన్నికలు రబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా తీవ్రత తగ్గేవరుకు ఉపఎన్నికలు ఛాన్స్ లేదని కొందరి వాదన. ఏది ఏమైనా సీఎం జగన్ నిర్ణయంతో టీడీపీకి గట్టి షాక్ తగలబోతుందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: