ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలన విషయంలో జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపించారా..? అసలు సినిమా రానున్న రోజుల్లో చూపించబోతున్నారా..? ఈ దెబ్బతో చంద్రబాబు, లోకేశ్ లకి బొమ్మ కనిపించడం కాయమా..? తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ డౌట్ రాక మానదు.

 

దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోని, అవినీతి ఆరోపణల కేసులో జైలుకి వెళ్ళి. ఎన్నో కష్టాలను ఎదుర్కోని. ఎట్టకేలకు 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకుని అధికారం చేపట్టారు జగన్. అయితే అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఆయన పరిపాలనపై ప్రతిపక్ష నేతలు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. కానీ జగన్ ఏడాది పరిపాలనకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులతో పాటు మీడియా ప్రశంసలు కురిపించింది. కరోనా వైరస్ లాంటి సంక్షోభ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలు గురించి చాలామంది దేశ నాయకులు చర్చించుకుంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు సీఎం జగన్ పరిపాలన ఎలా ఉందో. ముఖ్యంగా కరోనా మహమ్మరిని కట్టడి చేయడంలో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శం.

 

ఎంతో మంది సీనియర్ నేతలు ఈ విషయంలో చేతులెత్తేస్తుంటే.. సీఎం జగన్ మాత్రం దీన్ని ఒక సవాల్ గా భావించి, దాన్ని అరికట్టడంలో దూసుకుపోతున్నారు. అయితే ఇలాంటి సమయంలో సీఎం జగన్ ఏడాది పరిపాలనపై ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏడాది పరిపాలన జస్ట్ ట్రైలర్ అని ట్విట్టర్ లో అభివర్ణించారు. సీఎం జగన్ గారి ఏడాది పరిపాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో..? అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు.

దొంగల ముఠా జైలు కెళ్లాల్సిందే అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ తో ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. జగన్ అధికారం చేపట్టిన సంవత్సరం తర్వాత అవినీతి ఆరోపణల కేసులలో టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. అయితే విజయసాయి రెడ్డి చెప్పిన ట్రైలర్ ఇదేనని.. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి అరెస్టులు చాలా ఉండబోతున్నాయని.. అందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ లు కూడా జైలుకి వెళ్ళే అవకాశాలున్నాయని.. దీన్ని ఉద్దేశించే రానున్న రోజుల్లో అసలు సినిమా ఉంటుందని విజయసాయి రెడ్డి ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: