- సీమ సిటుక్కుమంటాంటే..పుస్త‌కం

డిజిట‌ల్ పోస్ట‌ర్స్ ను విడుద‌ల చేసిన ఎంపీ రామూ

- ర‌చ‌యిత రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లికి అభినంద‌న

- న‌వ్య‌రీతుల‌లో సాహిత్యం వెలుగులోకి రావాలి

- ప్రాంతాల‌క‌తీతంగా సాగే అక్ష‌ర సేద్యానికి అండ‌గా ఉంటాను

- ప‌ల్లె బిడ్డ‌లే ప్ర‌గ‌తి ప్ర‌దాత‌లు..వీరే కొత్త మార్పున‌కు సంకేతిక‌లు

 

ఓ పుస్త‌కం వెలుగులోకి వ‌స్తుందంటే పండుగే...అలాంటి అక్ష‌రాల పండుగ‌కు శ్రీ‌కారం దిద్దారు యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు. సీమ సిటు క్కుమంటాంటే అనే కొత్త పుస్త‌కం రాక‌ను ఆహ్వానిస్తూ..సీమ కేంద్రంగా వెలు వ‌రించిన సాహిత్యానికో ఆలంబ ‌నగా నిలిచి, త‌న మంచి మ‌న‌సు చాటారు. ప‌ల్లె బిడ్డ‌లు ప్ర‌గ‌తి ప్ర‌దాత‌లు అని, వారికి అండ‌గా ఉంటాన‌ని హామీ ఇస్తూ, పుస్త‌కం వె లువ‌రించే క్ర‌మంలో ప్ర‌చుర‌ణ బాధ్య‌తలు అందుకున్న వ‌ర్థ‌మాన ర‌చ‌యిత ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతికి అభినంద‌నలు తెలిపారు.

 

ఒక ర‌చ‌న ఒక ఆకాంక్ష : ఈ ప‌ద బంధం ప్ర‌కృష్టం కావాలి

ఉత్త‌మ సాహిత్యం ప్రాంతాల‌కు అతీతంగా చే రువ కాగ‌ల‌ద‌ని, ఆ క్ర‌మంలో రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి రచిం చిన సీమ సిటుక్కుమం టాంటే పుస్త‌కం మ‌రింత ఉన్న‌తిని అందుకుని పాఠ‌క లోకం మ‌న్న‌న పొందాల ‌ని ఆశిస్తున్నానని శ్రీకాకు ళం యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు అన్నారు. స్థానిక ప్ర‌జాస‌ద‌న్ లో సోమ‌వారం సాయంత్రం పుస్తక ప్ర‌చుర‌ణ బా ధ్య‌తలు నిర్వ‌ర్తిస్తున్నఆర్.కిశోర్ క్రియెటివ్స్ సంస్థ రూపొందించిన పోస్ట‌ర్ ఫ్రేమ్స్ ను ఆవిష్క‌రించి, ర‌చ‌యిత‌నూ, కార్య‌నిర్వాహ‌క బృందాన్నీ అభినందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..మాండ‌లిక ప్ర‌ధానంగా వ‌స్తున్న ఈ సాహిత్యం అన‌తి కాలం లోనే మ‌రింత విస్తృతిలో ఉన్న‌త శ్రేణీ ర‌చ‌న‌గా గుర్తిం పు పొందాల‌ని, ముఖ్యంగా గ్రామీణ యువ‌త‌కు ఇలాంటి ప్ర‌య‌త్నాలే మార్గద‌ ర్శ‌కంగా నిలుస్తాయ‌ని తె లిపారు. ఆ కోవ‌లో ఈ ప‌ద బంధం మ‌రింత ప్ర‌కృష్టం కావాల‌ని ఆకాంక్షించారు.

 

ఆద్యంతం అనుభ‌వ‌పూర్వ‌కం : మాండ‌లిక ప్ర‌ధాన ర‌చ‌న

ఆధునిక కాలంలో డిజిట‌ల్ మాధ్య‌మాల ప్ర‌భావంతో పుస్త‌కాలు చ‌ద‌వ‌డ‌మే త‌ గ్గిపోతున్న ఈ త‌రుణాన సీమ కేంద్రంగా సాహిత్యం వెలువరిస్తూ, మ‌రోవైపు త ‌మ ప్రాంత ఉన్న‌తిని కోరుతూ ఇక్క‌డి స‌మ‌స్య‌లు, ఇక్క‌డి ప్రాంతీయ నేప‌థ్యా లు విశ‌దీక‌రిస్తూ రాసిన ఈ పుస్త‌కం తక్కువ రోజు ల్లోనే ప్ర‌చుర‌ణ‌కు సిద్ధం కావ ‌డం త‌న‌నెంతో ఆనందింప‌జేసింద‌ని అన్నారు.

 

మంచి సాహిత్య రీతుల‌కూ, క‌ళ ల‌కూ తానెన్న‌డూ అండగా ఉంటాన‌ని, అందుకు ప్రాంతాల‌తో సంబంధం లేకుం డా ఆయా క‌ళాకారుల‌కూ, సాహితీ వేత్త‌ల‌కూ త‌న ‌వంతు సాయం త‌ప్ప‌క చేస్తా న‌ని చెప్పారు. పుస్త‌క రూప‌క‌ల్ప‌న‌కు కృషి చేసిన డిజిట‌ల్ ఆర్టిస్ట్ గిరిధ‌ర్ అర‌స‌ వ‌ల్లికీ,లోగో డిజైన‌ర్ సూర్యా ఏలేకూ, లే-ఔట్ ఆర్టిస్టు లు ఝాన్సీ న‌ల్ల‌మెల్లికీ, మ‌హీ రాఘ‌వ‌కూ ఇతర కార్య ని ర్వాహ‌కుల‌కూ శుభాకాంక్ష‌లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: