వైఎస్సార్సీపీలో కలకలం మొదలైందా..? ఆ ఇద్దరు నేతలు దిగిన సెల్ఫీతో పార్టీ నేతలు అయోమయంలో పడ్డారా..? అసలు వీరి సెల్ఫీ దేనికి సంకేతం..? అసలు ఆ సెల్ఫీ దిగిన నేతలు ఎవరు..? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగబోతున్న సంచలనాత్మక మార్పులు ఏంటి..? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అసలు మ్యాటర్ ఏంటంటే..

 

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొద్ది రోజులుగా సొంత పార్టీకి మేకులా మారిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ ఎంపీలు, పలువురు ముఖ్య నేతలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళి.. తమ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఒక్కొక్కరుగా రఘురామపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. కేసుల తీవ్రత దృష్ట్యా అరెస్టు తప్పదని వార్తలు రావడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అలాగే.. గెలిచి ఏడాది పూర్తయినా నా నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయా. పదవులు నాకు అలంకారప్రాయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలకు మంత్రిగా పని చేశాను. కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైంది.

 

నేను ప్రాతినిధ్య వహిస్తోన్న వెంకటగిరి అనే నియోజకవర్గం ఒకటున్నట్లు జిల్లా అధికారులు మర్చిపోయినట్లున్నారు.. అంటూ నెల రోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి.. తర్వాతి కాలంలో సైలెంట్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనం రామనారాయణ రెడ్డితో రఘురామకృష్ణంరాజు దిగిన సెల్ఫీ ఒకటి బయటకి వచ్చింది. దీంతో వైఎస్సార్సీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఈ ఫోటో ఎప్పుడు దిగారు? ఎక్కడ దిగారు? ఇద్దరూ కలిసి ఎవరిని కలిశారు? అన్న అంశాలపై జగన్ పార్టీ పెద్దలు ఆరా తీయటం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ ఇద్దరు నేతలు ఇటీవలే రాష్ట్రానికి చెందిన ఒక బీజేపీ ముఖ్య నాయకుడిని కలిసినట్టు సమాచారం. అయితే వీరు దేని గురించి చర్చించారు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ ప్రకారం.. త్వరలోనే వైఎస్సార్సీపీ గట్టి దెబ్బ తగలబోతుందని మాత్రం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: