దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. మనుషుల్లో మానవత్వం మాయమైపోతుంది. మాయమైపోయింది అనడం కంటే చచ్చిపోయింది అని అనడం కరెక్ట్. మహమ్మారి భయానికి తోటివారిని ముట్టుకునేందుకు జంకే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సోకిందని అనుమానం వచ్చినా.. కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భర్తను, భార్యను.. ఇలా సొంతవారు అనే తేడా లేకుండా నడిరోడ్డుపైనే వదిలేసి వెళుతున్నారు. కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలను కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఊళ్లల్లోకి రానివ్వడం లేదు.

 

చనిపోయిన వారికి ఎంతో గౌరవంగా నిర్వహించే అంత్యక్రియల కార్యక్రమాన్ని చేసేందుకు పట్టుమని పది మంది రావడం లేదు. చివరకు పాడె మోసే దిక్కు లేక జేసీబీ, మెషీన్లు, ఎడ్లబండ్ల మీద తీసుకెళ్లి గోతిలో పడేసి పూడ్చివ స్తున్నారు. ఒక మనిషిని మనిషిగా చూడలేని పరిస్థితులు నెలకొన్నాయి. రోజు రోజుకీ మనుషుల్లో మానవత్వం కరువవుతోంది. ఆఖరికి ఎదుటి మనిషిని తాకటానికి కూడా భయపడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.

 

తెలుగు రాష్ట్రాలలో సైతం ఇలాంటి ఘటన చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కరోనాతో మరణించిన వ్యక్తిని జేసీబీని ఏర్పాటు చేసి అక్కడి నుంచి తరలించారు. దీనిపై సీఎం జగన్ సైతం స్పందించారు. ఆ తర్వాత కూడా ఇలాంటి విషాదమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనా అనుమానిత లక్షణాలతో మరణించింది. ఆ మహిళ కరోనాతోనే చనిపోయిందనే ఉద్దేశంతో అంత్యక్రియలు నిర్వ హించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

 

దీంతో కుటుంబ సభ్యులు చేసేదేం లేక ఎడ్లబండిపై వేసుకుని ఇద్దరు వ్యక్తులు కాడెద్దులుగా మారి శ్మశానికి తీసుకె ళ్లారు. అక్కడ అప్పటికే తీసి పెట్టిన గోతిలో మృతదేహాన్ని పడేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. అదేవిధంగా కరోనాతో చనిపోయిన వారి డెడ్‌బాడీస్ సగం కాల్చి వదిలేయడం, కుక్కలు తినడం కూడా చూస్తూనే ఉన్నాం. కొన్ని చోట్ల ట్రాక్టర్లలో కరోనాతో చనిపోయిన వారిని తరలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే మానవత్వం నిజంగానే చచ్చిపోయిందేమో అని అనిపిస్తుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఈ భయం తప్పదనే సమాధానం వినిపిస్తుంది. మరి ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో.. మనుషులలో మానవత్వం ఎప్పుడు పరిమలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: