తన మాటలతో అందరినీ మాయ చేసి, మాటల మంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకే ఆయన్ని ముద్దుగా గురూజీ అని పిలుస్తుంటారు. ఆయన తీసే సినిమాల విషయం పక్కన పెడితే.. సినీ పెద్దలతో ఆయనకు చాలా మంచి సంబంధాలే ఉన్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయనకున్న స్నేహం చాలా స్ట్రాంగ్. సినిమాల పరంగానే కాకుండా బయట కూడా వీరు మంచి స్నేహితులు. అందుకే చాలా విషయాల్లో త్రివిక్రమ్ సలహా తీసుకుంటుంటారు పవన్ కళ్యాణ్.

 

అయితే వీరి జీవితాల్లో చీకటి కోణాలు కూడా దాగున్నాయన్నది కొందరి వాదన. అసలు పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ని వదిలేయడానికి కూడా ఒకరకంగా త్రివిక్రమే కారణం అని ఒకానొక సమయంలో పూనమ్‌ కౌర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన సంగతి అందరికి తెలిసందే. అలాగే అవకాశాల పేరుతో అమ్మాయిలకి వల వేసి వారి జీవితాలను కూడా నాశనం చేస్తారని పూనమ్‌ కౌర్‌ అన్నారు. అలాగే వివాదాస్పద నటి శ్రీ రెడ్డి సైతం పవన్, త్రివిక్రమ్ లపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎంతో మంది అమ్మాయిల జీవితాలని వీరిద్దరూ కలిసి నాశనం చేశారని పేర్కొంది. ఇదంతా అందరికి తెలిసిన కథే.

 

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. దీంతో మాటల మాంత్రికుడు మరో హీరోతో తన స్నేహ బంధాన్ని పెంచుకునే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే జూ. ఎన్టీఆర్ కి , త్రివిక్రమ్ కి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సినీ పరంగానే కాకుండా.. పర్సనల్ గా కూడా వీరు మంచి స్నేహితులుగా ఉంటున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో కలవరం మొదలైంది. వీరి స్నేహం ఎన్ని వివాదాలకు దారి తీస్తుందోననే విషయం అర్ధం కాక.. జుట్టు పిక్కుంటున్నారు. కొంతమంది అభిమానులైతే త్రివిక్రమ్ విషయంలో ఎన్టీఆర్ జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. మరి వీరి కలయిక నిజంగానే వివాదాలకు దారి తీస్తుందా..? లేదా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: