ఇవాల్టి రోజున నీతి.. నిజాయితీ లాంటివి ఉంటాయా? అలాంటి వాటిని పక్కాగా ఫాలో అయ్యే అధికారులు ఉంటారా? అంటే అవుననే చెప్పాలి. అలాంటోళ్లు ఉండబట్టే.. ఇప్పటికి వ్యవస్థలు ఇలా పని చేస్తున్నాయని చెప్పాలి. అడ్డగోలుగా వ్యవహరించే వారు ప్రతి చోట ఉన్నట్లే.. ప్రభుత్వంలోనూ కనిపిస్తారు. కాకుంటే.. నీతిగా నిజాయితీగా ఉన్న వారు పెద్ద ఫోకస్ కారు. అలాంటికోవలోకే వస్తారు ఏపీ ఆర్టీసీ ఎండీగా వ్యవహరించి ఇటీవల బదిలీ వేటు పడిన మాదిరెడ్డి ప్రతాప్. తన ఇరవైఆరేళ్ల కెరీర్ లో నేటికి సొంతంగా ఫ్లాట్ ఏర్పాటు చేసుకోలేనంత నిక్సారైన అధికారిగా ఆయనకు పేరుంది. 

 

వైఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన్ను మొన్నీమధ్యనే ఆర్టీసీ ఎండీగా రిలీవ్ చేసి.. ఏపీఎస్సీ బెటాలియన్ ఏడీజీగా బదిలీ చేశారు. ఎందుకిలా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇలాంటివేళ.. తాజాగా నోరు విప్పిన ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. నాడు వైఎస్ తో పాటు రచ్చబండకు తాను వెళ్లాల్సి ఉందని.. ముందు రోజు రాత్రి సీఎంవో కార్యదర్శి సుబ్రమణ్యం తనతో మాట్లాడి.. ముందు తనను వెళ్లమని చెప్పి.. తర్వాత తాను వెళ్తానని చెప్పారని.. అది తనకు పునర్జన్మగా చెప్పుకున్నారు. ఆర్టీసీకి ఎండీగా వ్యవహరించిన ఆర్నెల్ల కాలంలో తామెన్ని ప్రయోగాల్ని చేసినట్లు చెప్పారు.

 

ఇటీవల కోవిడ్ టెస్టుల కోసం ఆర్టీసీ బస్సుల్ని సంజీవినిగా మార్చిన వైనాన్ని విజయమ్మ సైతం అభినందించారన్నారు. వైఎస్ జయంతి సందర్బంగా విజయమ్మ తనకు కేకు పంపారని.. అదే రోజు రాత్రి తనను ఆర్టీసీ ఎండీ పోస్టు నుంచి బదిలీ చేస్తూ జగన్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. అలా ఎందుకు జరిగిందో తనకు తెలీదన్న ఆయన.. తన కెరీర్ లో అనేక ఉన్నత పదవుల్ని చేపట్టిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.

 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమనుకొని బదిలీ చేశారో కానీ.. ఆయన నిర్ణయాన్ని స్వాగతించాలంటూఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వం ఎందుకు బదిలీ చేసిందన్న ప్రశ్నకు సూటిగా చెప్పకున్నా.. తనను బదిలీ వేటు వేయటాన్ని ఆయన్ను హర్ట్ చేసిందన్న విషయాన్ని తన మాటలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: