ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వంపై ఎల్లో మీడియా మ‌రో విమ‌ర్శ‌నాస్త్రాన్ని సంధించింది. అదే.. అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం మోసం చేస్తోంద‌ని. వారిని ప‌ట్టించుకోవ‌డం లేదని. నిజ‌మే! ఖ‌చ్చితంగా ఆందోళ‌న చెం దాల్సిందే.. ఆవేద‌న వ్య‌క్తం చేయాల్సిందే. అయితే, ఇప్పుడు జ‌రుగుతున్న పొర‌పాట్లు.. గ్ర‌హ‌పాట్లు అన్నీ కూడా చంద్ర‌బాబు హ‌యాంలోనే మొగ్గ‌తొడిగాయ‌నే విష‌యాన్ని ఎందుకు మ‌రిచిపోతున్నార‌నే దే ప్ర‌ధాన ప్ర‌శ్న‌. విష‌యంలోకి వెళ్తే.. కేంద్ర ‌ప్ర‌భుత్వం అగ్ర‌వ‌ర్ణాల వారికి.. ఈడ‌బ్ల్యుఎస్ కోటా కింద 10 శాతం ఇచ్చిం ది. అంటే.. దీనిని ఉద్యోగాలు, విద్య స‌హా అన్ని కోణాల్లోనూ వినియోగించుకునేందుకు అవ‌కాశం ఉంటుం ది.

 

అయితే, దీనిని ఎల్లో మీడియా చిత్రంగా చిత్రీక‌రించింది. ప్ర‌స్తుతం కాపు ఉద్య‌మం నుంచి ముద్ర‌గ‌డ త ప్పు కొన్నారు. దీంతో ఆయ‌న చేసిన కొన్ని కామెంట్లు అస‌లు ఉద్య‌మం నుంచి త‌ప్పుకొనేందుకు ఏర్ప‌డిన ప‌రి స్థితుల‌ను వివ‌రించారు. నిజానికి ఇవ‌న్నీ కూడా టీడీపీని టార్గెట్ చేసేవే. ఎందుకంటే..కాపుల‌కు రిజ ర్వేష‌న్ ఇస్తాన‌న్న చంద్ర‌బాబు కాబ‌ట్టి. దీంతో కాపుల ఉద్య‌మం నుంచి ముద్ర‌గ‌డ త‌ప్పుకొన్న‌ప్ప‌టికీ.. ఆ ప్ర‌భావం టీడీపీపై ఎక్క‌డ ప‌డుతోంద‌న‌ని భావించిన ఎల్లో మీడియా వ్యూమాత్మంగా దీనిని దారిమ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేసింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌డం లేద‌ని వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప ‌డింది.

 

అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కాపుల‌కు చాలానే చేశార‌నే బిల్డ‌ప్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. జ‌నాభా ఎక్కువగా ఉండి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులకు 5 శాతం, మిగిలిన అగ్రవర్ణాలకు 5 శాతంగా ఈడ‌బ్ల్యుఎస్ కింద వ‌చ్చిన రిజ‌ర్వేష‌న్ల‌ను వర్గీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో అసెంబ్లీలో చట్టం చేసింద‌ని, అప్పటికే కాపు రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదన లు పంపారని,  కేంద్ర ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ లోపు కాపుల ప్రయోజనాలు కాపాడాలని అప్పటి సీఎం చంద్ర‌బాబు ఆ నిర్ణయం తీసుకున్నారని వివ‌రించి స‌మ‌ర్ధించే ప్ర‌య‌త్నం చేసింది.

 

అయితే, ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఏదైనా చేసి ఉంటే..కేంద్ర‌మే త‌ప్ప‌.. రాష్ట్ర ప్ర‌భుత్వం, చంద్ర‌బాబు మాత్రం కాదు. అయినా.. కూడా ఇప్పుడు కాపులు  ఎక్క‌డ టీడీపీకి యాంటీ అవుతారో .. అని ఎల్లో మీడియా క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. కాపుల‌కు చంద్ర‌బాబు నేరుగా చేసింది ఏమైనా ఉంటే. మోసం త‌ప్ప ఏమీలేద‌ని ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే చెబుతున్నారు.దీనిని విశ్వ‌సించ‌బ‌ట్టే క‌దా.. గ‌త ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇప్పుడు ఎల్లో మీడియా క‌వ‌రింగ్ చేసినంత మాత్రాన ప్ర‌యోజ‌నం ఏంటో వారికే తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: