రాజకీయంగా లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయాల్సిందే అంటూ డిమాండ్ మొదలైంది. నిజానికి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చాలాకాలంగా కొన్ని సెక్షన్లలో  ఆందోళన మొదలైనా పెద్దగా హైలైట్ కాలేదు. రిజర్వేషన్లకు రాజకీయాలకు మనదేశంలో ఉన్న అవినవభావ సంబంధాల కారణంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరూ తన గొంతును వినిపించేందుకు భయపడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రకాశ్ అంబేద్కర్ బహిరంగంగా డిమాండ్ చేయటం గమనార్హం. ఇంతకీ ఈ ప్రకాష్ అంబేద్కర్ ఎవరయ్యా అంటే పంచిత్ బహుజన్ అఘాడీ అధ్యక్షుడు. అంతేనా రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ మనవడు కూడా. పార్లమెంటు, అసెంబ్లీలకు కొనసాగుతున్న రిజర్వేషన్లను వెంటనే రద్దు చేయాలంటూ ప్రకాష్ చేసిన డిమాండ్ సరికొత్త సంచలనంగా మారింది.

 

ప్రస్తుత వ్యవస్ధలో రాజకీయ రిజర్వేషన్లను రద్దు చేసే ధైర్యంకానీ, వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యంకానీ ఏ రాజకీయ పార్టీకి లేదంటూ ప్రకాష్ బల్లగుద్ది మరీ చెప్పాడు. రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడితే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయమే రాజకీయపార్టీల నోళ్ళు మూయిస్తున్నట్లు కూడా ఈయన చెప్పాడు. ఎస్సీ, ఎస్టీలకు పదేళ్ళు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలన్న విషయాన్ని బిఆర అంబేద్కర్ స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పిన విషయాన్ని కూడా ప్రకాష్ గుర్తుచేశాడు. ప్రకాష్ చెప్పినదాంట్లో తప్పేమీలేదు. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం ఎంతకాలం కంటిన్యు చేయాలనే విషయంలో అంబేద్కర్ చెప్పిన మాటను గతంలో కూడా చాలామంది గుర్తుచేశారు. కాకపోతే అప్పట్లో వాళ్ళ మాటలను ఎవరూ పట్టించుకోలేదు.

 

మరిపుడు ప్రకాష్ చేస్తున్న డిమండ్లను, చెబుతున్న మాటలను ఎవరైనా పట్టించుకుంటారా ? అసలు రాజకీయపార్టీలు తమ చెవిలో వేసుకుంటాయా ? అన్నది డౌటనుమానమే. రిజర్వేషన్ల అంశం వల్లే మనదేశంలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని ఎప్పటి నుండో వాదనలు వినబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు ప్రకాష్ కూడా రాజకీయ రిజర్వేషన్లను రద్దు చేయాలని చెబుతున్నాడే కానీ విద్య, సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల నియామకం విషయాన్ని ప్రస్తావించటం లేదు. కాబట్టి అంబేద్కర్ మనవడు చేసిన తాజా డిమాండ్ పై రాజకీయ పార్టీలు ఓసారి చర్చించుకుంటే బాగుంటుందనే డిమాండ్లు కూడా మొదలయ్యాయి.

 

నిజానికి రిజర్వేషన్ల ఫలాలను కూడా ఇపుడు అనుభవిస్తున్న కుటుంబాల తర్వాతి తరాలు మాత్రమే ప్రధానంగా అనుభవిస్తున్నాయనే మంట రిజర్వేషన్ వర్గాల్లో ఎప్పటి నుండో వినిపిస్తోంది. ఓ ఎంఎల్ఏ లేదా పార్లమెంటు నియోజకవర్గంలో గెలిస్తే ఇక ఎల్లకాలం తనకే టికెట్ రావాలని సదరు నేత కోరుకుంటాడు. ఏ కారణం వల్లనైనా టికెట్ దక్కదని అర్ధమైతే తన వారసులకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నాడే కానీ మరో నేతకు టికెట్ ఇస్తుంటే సహించలేడు. అంటే రాజకీయ రిజర్వేషన్లను చాలామంది నేతలు తమ వంశపారంపర్య హక్కుగా అనుకోవటం వల్లే ఇతర నేతలను పైకి రానీయకుండా తొక్కేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుండో వినబడుతున్నాయి. నిజానికి ఇటువంటి ఆరోపణలు ఓసి నియోజకవర్గాల్లోని నేతలపైన చాలానే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రకాష్ చేసిన డిమాండ్ పై రాజకీయపార్టీలు ఆలోచిస్తే మంచిదేమో.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: