- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి 

మెథ‌డ్స్ అండ్ మోటివ్స్

ప్రేమ‌లోనూ వాత్స‌ల్యంలోనూ

నీ అనుకునేంత శ‌క్తి నీ వ‌ర‌కూ

మాత్ర‌మే..జీవితం తీసుకున్న‌వి

విలువ‌యిన‌వి..విలువ‌యిన వాటిలో

నీవున్నావా?

 


ఫ‌స్ట్ కాజ్ : ఇద‌మ్ వాక్య‌మ్

సెకండ్ థాట్ : మూల సూత్రం వెనుక కాలానిది

కార‌ణం స‌విస్తారం

కారుణ్యం అన్న‌ది ఎక్క‌డ‌యినా కొద్దిగా ఉంటే వాటి నుంచి నేర్చుకున్న‌వి ఈ మేఘాల దారుల వెంబ‌డి పంపాలి. ప్రేమ‌నూ, ద‌యనూ ఎవ్వ‌ర‌యినా బ‌దులు కోరుకుని నా నుంచి న‌న్ను జ‌న్మ విముక్తం చేయాలి. సీమ నుంచి ఈ సిక్కోలు వ‌ర‌కూ మ‌నుషులు కొంత ప‌రివ‌ర్త‌న కోరు‌కుంటే కొత్త సాహిత్య రూపం ఒక‌టి వె లుగులో నుంచి చీక‌టిలోకి త‌ర‌లిపోదు. ప్రేమ అన్న‌దే మిక్కిలి న‌మ్మ‌కం అని అనుకున్నానా! మోసం చేసిన‌ట్లే! ఈ మిక్కిలి న‌మ్మ‌కాల‌ను మిగిలిన జీవిత కా లానికి అన్వ‌యించి ప్ర‌యాణించ‌డ‌మే లోకాల నిర్మాణానికి అర్థం. కొత్త లోకాల నిర్మాణానికి అర్థం. మ‌నం ఇలాంటి వాటిని ఆహ్వానిస్తే, జీవితం నుంచి జీవితం వ‌ర‌కూ ప‌ర‌మార్థ సహిత చింత‌న‌ల్లో మ‌నం మునిగి తేల‌వ‌చ్చు. దారుల‌న్నీ ఉ ద్బోధ‌లకే సంకేతాలా? మ‌న పాటింపు మాత్ర‌మే నిన్న‌టి చీక‌టినీ, మిక్కిలి బా ధ‌నూ, దుఃఖాన్నీ వ‌దిలిపోయేలా చేస్తుంది.

 

మీ బిడ్డ‌ల‌కు మీరు ఏం నేర్పుతు న్నారు అన్న‌ది ఎప్పుడయినా ఆలోచించా రా? ఎక్క‌డో చ‌దివేను.. ఆ వాక్య సారం ఇలా ఉంది..అమ్మానాన్నా వీరికి మించిన ఒక లోకం...సందేహాల‌కు తావివ్వ‌ని సంద‌ర్భం మీరు ప‌రిచ‌యం చేయ‌గ‌లుగుతున్నారా..ఏం లేదు. బి డ్డ‌లంతా ఈ దారిలో త‌మ బాల్యాన్ని విడిచి, బిడ్డ‌లంతా ఈ దారిలో త‌మ య ‌వ్వ‌న‌పు గాయాల‌ను మోసేందుకు సిద్ధం అయి..ఏమీ లేని రోజున చావుల‌కు తెగ‌ప‌డ‌డం అల‌వాటుగా మార్చుకోవ‌డంలో ఈ కాలం చెడ్డ‌దిగా తోస్తోంది. మా యాన్వితం కాని మాట ఒక‌టి ఎవ్వ‌రూ రాయ‌డం లేదు. ఈ మాట ఈ దారి అం తా రంగుల మ‌యం..రంగు అన‌గా అదే మాయ. క‌త్తులేమ‌యినా మాట్టాడ‌ తా యా? అని ప్ర‌శ్నిస్తాండు రాజా! క‌త్తులే కాదు మ‌న‌సులు కూడా ఇక్క‌డ మా ట్లాడ‌వు. క‌నీసం వాటికో ఉనికి కూడా మనం ఆపాదించ‌క ఎలానో ఒక‌లా జీవి స్తూ, ఛిద్ర‌మ‌యిన సంద‌ర్భాల‌నూ, విగ‌త కాలాలనూ మ‌నం వెంట బెట్టుకుని ప్రయాణిస్తున్నాం.

 

ఆలోచ‌నాత్మ‌కం

తిరుప‌తికి పోతాండ..లేదా ఆ వేముల‌వాడ‌కు పోతాండా..ఎక్క‌డ‌యినా మ‌నం అనుకున్న ఈ త‌త్వ సారంలో మ‌న బాల్యాన్నీ య వ్వ‌నాన్నీ ఒకేలా చూడ‌ని మ‌నుషుల‌నూ వ‌దిలి ప్ర‌యాణించ‌డంలోనే ఆనందం ఉంది. పుస్త‌కం.,జీవితం ఈ రెండూ విభేదార్థాలు.. విశ్లేష‌క గుణ‌కాలు.(కొన్నిసార్లు).. మ‌నం పెరిగే కొద్దీ జీవితం వెనుక చాలా విషాదాన్ని వెంట ఉంచి, ముందున్న కాలాల‌కు కానుక గా ఇస్తుంది..మిక్కిలి విషాదం విభేదార్థం.. మిన్ను తాకికిన విభేదాల‌కు విరుగు డే విశ్లేష‌ణార్థం. ఈ మంచులు అంతా మంచోళ్లేనా!

 

వాక్యార్థంలో దొరుకుతున్నాయా ఇవి..

ఆషాఢం నుంచి ఏదో ఒక‌టి పిలుపుగా వినిపిస్తోంది..రెండుంటాయి ఒకటి శ్రుత సంబంధం, రెండు శ‌త్రు సంబంధం. ఆక‌లిని జయిం చిన సంద‌ర్భం నుంచి, ఆక‌ లి మ‌రో రూపంలో ఎదురుగా ఉండ‌ని సంద‌ర్భం వ‌ర‌కూ మ‌నుషులు త‌మ‌ని తాము సంతృప్తం చేసుకునే ఉంటారు. సీమ లోగిళ్ల‌లో ఈ వాన‌కారు కోయిల ల గానాలు ఎలా ఉన్న‌యో అన్న ఆరా నుంచి ఏమీ లేని రోజున చేయని ఆరో ప‌ణ నుంచి ఒక విన్న‌పాన్ని విన్న‌‌విస్తాను. మా తిక్కు మంచోళ్లు చాలా మం ది ఉన్యా అని అంటాండు రాజా.!.ఇప్పుడు కూడా మంచికి వివ‌ర‌ణ కోరుకుం టున్నాను. ఇత‌రుల‌ను అర్థం చేసుకునే మంచి, ఇత‌రుల‌ను దూరం చేసిన చె డు ఈ రెండు సంద‌ర్భాలూ వాక్యార్థంలో దొరుకుతున్నాయా లేదా అని ఆరా తీయాలి.

 

ప్ర‌ళ‌య కాల ఘోష..వినాల్సిందే!

బిడ్డ‌ల‌ను ఎలా చూడాలి అన్న ప్ర‌శ్న నుంచి నేను ప‌ట్టుకువ‌చ్చిన గుప్పెడు ప‌ రిమ‌ళాలు ఇవి..సంస్కృతిని వారికి కానుక‌గా ఇచ్చి , లేని మాట‌లు నాలుగు చెప్ప‌డం మానుకుని, గొప్ప న‌వ నిర్మాణం మ‌న‌మే చేస్తున్నామ‌న్న భ్ర‌మ ఒక ‌టి వారికి ఇవ్వ‌క ఉండడ మే సిస‌లు పెంపకం అని చ‌దివేను. మీరు ఎంత సం పాదిస్తే ఎక్క‌డ సంపాదిస్తే అక్క‌డే కోల్పోవాలి..అన్న ఒక మాట నాలో నాటు కుపోయింది. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఈ మాట చెప్పాడు. మ‌నం సంపా దించిన రూపాయిల్లో అమ్మా నాన్నా ఉంటారా లేదా మ‌నం సంపాదించి మిగి ల్చిన సౌక‌ర్యాల్లో అమ్మానాన్నా ఉంటారా? ఏదీ కాదు. సౌక‌ర్యాలు అన్న‌వి మ ‌నం వ‌దులుకున్నంతలో వదులుకున్నంత‌గా ఉంటే, అమ్మా నాన్నా నెత్తిన ఆ కాశంలా ఎన్న‌డూ వెన్నంటే ఉంటారు. ఆ ఛాత్ర ఛాయ‌లో వాన‌నూ ఎండ‌నూ భ రించ‌డం సులువు..ఆ ప్రేమ‌ను భ‌రించ‌డం క‌ష్టం. కొన్నింట ఆ ఆకాశం చెంత పు ట్టిన ప్ర‌ళ‌య కాల ఘోష కూడా వినాల్సిందే.

 

అవునో కాదో : ఆక‌లి మాత్ర‌మే..ఆలంబ‌న

నెత్తుటి వాగులు చెంత..సీము నెత్తుటి వాగుల చెంత సీమ నెత్తుటి కోలాటం చెంత నేను లేను..అవి లేవో, ఉన్నాయో కాదు వాటి నుంచి సీమ‌ను ప‌రిశీలిం చ‌డం త‌గ‌ని ప‌ని. మ‌న‌ల్ని ప్రేమించిన చోటును మ‌నం నిర్మించిన స్మార‌కం ఒక బదులు అవుతుంది. మనం ప్రేమించిన చోటుకు మ‌నం ఒక త‌రం పాటు జ్ఞా ప‌కాల‌ను త‌ర‌లించ‌డం ఇంకా బాగుంటుంది. వాక్యార్థం, వ‌చ‌నార్థం చెబుతున్న మాట‌లంటే గొప్ప కోపం. వ‌ద్దులేండి..మ‌నం శిలువను మోసి ర‌క్తాన్ని త‌ర్ప‌ణం గా కోరుకోవడం ఓ ప‌ద్ధ‌తి..మ‌న జాతిని న‌డిపి కొత్త ర‌క్త‌పుటేరుల‌కు చైత‌న్యం ఇ వ్వ‌డం మ‌రో ప‌ద్ధ‌తి..ఇది నీ వాక్యం..ఇది ఈ జాతి నెత్తిన పెట్టుకుంటుందా లే దా అన్న‌దొక ఆరా!

 

రాస్తున్నానొక మార్నింగ్ రాగా..

సీమ క‌త‌కు ర‌క్త‌పు గాయాలా తోడుగా ఉన్న‌వి అనుకుంటాను. సీమ క‌త‌కు ఇంత‌టి విశ్వాసం న‌మ్మ‌కం ఎలా ఇవ్వాలి అని అను కున్నాను. సీమంటే మ‌ నుషుల గాయాలేనా అని కూడా భ‌య‌ప‌డిపోయాను. జీవితం ఇలాంటివి ఎలా అన్వ‌యార్థాల‌కు తీసుకోవాలి. పెద్ద‌మ్మ త‌ల్లిని ఎలా వేడుకోవాలి. పెంచ‌ల‌దాసు పాట వింటూ పోతున్నాను. తిరువీధికి పోవాలి. సాములోరికి దండం పెట్టాల అ ని అనుకుంటున్నాను. భ‌గ‌వంతుడు ఈ మ‌నుషుల‌కు ఇంత‌టి జ్ఞానం ఇచ్చి ఉ న్నాడా లేదా వీరే ఆ దేవుడి నిర్మాణం ఒక‌టి చేసి త‌మ జ్ఞానం ప్ర‌చురణార్థం ఉంచారా అని కూడా అనుకుంటాను. మ‌నిషి ఆక‌లి మాత్ర‌మే చ‌రిత్ర‌ను రాయ‌ గ‌ల‌దు లేదా ఉన్న‌వాటిని తుడిపేయ‌గ‌ల‌దు అని నిర్థార‌ణ నుంచి రాస్తున్నానొక మార్నింగ్ రాగా..

 

పాజ్ సెన్స్ అండ్ సెంటెన్స్

ఒక పుస్త‌కం వ‌చ్చేక అందులో అక్ష‌రాలు అవి రెక్క‌ల గానం వినిపిస్త‌యి. మ‌న చేదులో ఉన్న గ‌తం అంతా మ‌ననంలో లేన‌ప్పుడు ఆ బాధ్య‌త‌ను పుస్త‌కం అందుకుని కొత్త తీరాల‌కు చేర్చ‌డం బాధ్య‌త‌గా తోస్తుంది. ఊహా తీరాలు అని అంటారు అవి ఉన్నాయో, లే దో కానీ ఆ త‌ర‌హా లోకాల సృష్టి ఒక‌టి మ‌నం చే యాలి. ప్రేమ‌ను బ‌దులుగా తీసుకుని ఈ లోకానికి కొన్నింటిని విడిచిపెట్టాలి. ఒ క పాజ్ సెన్స్ లో సెంటెన్స్ ను ఉంచి, మిగ‌తా మాట‌ల విస్తృతిని ఎవ‌రికి వారే పెంపొందించుకోవాలి. కొత్త పుస్త‌కం మార్కెట్లోకి అండ్ ద టైటిల్ ఈజ్ సీమ సి టుక్కు మంటాంటే.. మ‌రో కొత్త పుస్త‌కం మార్కెట్లోకి త‌త్ స‌మాన శ‌త్రువు...ఒ క‌టి రాజావ‌లి రాసిండు. ఒకటి నే ను రాసి, వెలువ‌రించాను. ఈ వెలుగుల‌ను ప్రేమించడంలో కొన్నేళ్ల చీక‌టిని ఇష్టంగా భ‌రించాను. ఎవ్వ‌రూ ఇక్క‌డ తోపులు కాదు అని గుర్తించి న‌వ్వుకున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: