స‌రిహ‌ద్దు వ‌ద్ద దుందుడుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్న చైనాకు భార‌త్ ఆంక్ష‌ల‌తో సురుకు పెట్టిన విష‌యం తెలిసిందే. 59 యాప్స్‌ను భార‌త్‌లో నిషేధించ‌డంతో పాటు దాదాపు 400ల‌కు పైగా వ‌స్తువుల‌ను నిషేధించాల‌ని ఇప్ప‌టికే జాబితాను సిద్ధం చేసింది. దీంతో దెబ్బ‌కు దెయ్యం వ‌దిలిన‌ట్లు చైనా స‌రిహ‌ద్దు వివాదాల‌పై కూర్చుని మాట్లాడుకునేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా జ‌రిగిన చ‌ర్చ‌లతో ఇరు దేశాలు సంతృప్తి వ్య‌క్తం చేయ‌డ‌మే కాక భార‌త్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన ప్ర‌దేశాల నుంచి చైనా సైన్యం వెన‌క్కి వెళ్లింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో చైనా శిబిరాల‌పై విదేశాంగ శాఖ అధికారుల స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

 

ఇదిలా ఉండ‌గా చైనా దూకుడు స్వ‌భావానికి భార‌త్ విరుగుడు చ‌ర్య‌ల‌తో రంగంలోకి దిగ‌డంతో అంత‌ర్జాతీయ సమాజం నుంచి మ‌న‌దేశానికి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. అంతేకాక చైనాను ఎలా క‌ట్ట‌డి చేయాలో కూడా ఇప్పుడు మిగ‌తా దేశాల‌కు అర్థ‌మైంది. ఇది చైనా విష‌యంలోనే కాదు..మిగ‌తా ఏదేశం దురాక్ర‌మ‌ణ‌, విస్త‌ర‌ణ వాదానికి తెర‌లేపిన ఇలాంటి చ‌ర్య‌ల‌తో ఒంట‌రి చేసే ఎత్తుగ‌డ అనుస‌రించేందుకు మార్గం చూపిన‌ట్ల‌యింది. అందుకే మోదీ, షా, రాజ్‌నాథ్‌సింగ్‌ల వ్యూహాలు ఇప్పుడు భార‌త్‌ను ప్ర‌ప‌చంలో కాలెర్ ఎగిరేసెలా చేస్తున్నాయి. ఇక చైనా త‌న‌కు తానుగా భార‌త్ ముందు మోక‌రిల్లేలా చూయ‌డం గొప్ప విష‌యంగా చెప్ప‌వ‌చ్చు.

 


అంతేకాక స‌మీప భ‌విష్య‌త్‌లో భార‌త్‌లో చైనా పెట్టుబ‌డుల‌కు గండిప‌డిన‌ట్లేన‌ని చెప్పాలి. చైనాకు మనం ఎంత దూరం ఉంటే అంత మంచిద‌నేది ఆర్థిక విశ్లేష‌కుల మాట‌. అందుకే ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో చైనా పెట్టుబ‌డుదారుల‌, సంస్థ‌ల ప్ర‌మేయం త‌క్కువ‌గా ఉండేలా చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌లు ఆంక్ష‌లు తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. వాణిజ్య ప‌రంగా దెబ్బ‌కొట్టేందుకు భార‌త్ సిద్ధంగా ఉండ‌టంతో చైనా పిల్లికునాల వ్య‌వ‌హ‌రిస్తోంది. చైనాతో భార‌త్ ఆర్థిక‌,వాణిజ్య సంబంధాలు తెంచుకోవ‌డంతో ఈ ప్ర‌భావం ఆ దేశా పారిశ్రామిక రంగంపై తీవ్రంగానే చూపుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. తాజా పరిణామాల నేప‌థ్యంలో అమెరికాయే భార‌త్‌కు అతిపెద్ద వ్యాపార భాగ‌స్వామిగా ఉండ‌టం విశేషం. ముందు ముందు చైనాతో స‌త్సంబంధాలు మ‌రింత క్షీణించినా ఆశ్చ‌ర్యం లేద‌ని మేధావి వ‌ర్గం నుంచి అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. చైనాను క‌ట్ట‌డి చేయ‌డానికి భార‌త్‌కు వ్యూహాత్మ‌క స్నేహ సంబంధం అమెరికాతో త‌ప్ప‌నిస‌ర‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: