చూస్తుంటే చాలామందిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విశాఖపట్నంలో ప్రమాదాలన్నవి ఇపుడే కొత్తగా మొదలుకాలేదు. గతంలో కూడా చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి.  జరిగిన ప్రమాదాలపై  అప్పుడెప్పుడూ ఇప్పుడు చేస్తున్నట్లుగా రాద్దాంతం చేయలేదు ఎల్లోమీడియా. మరి ఇపుడే ఎందుకు ఇంతగా గోల చేస్తోంది మీడియా. ఎందుకంటే వైజాగ్ ను రాజధానిగా ప్రకటించటం, అమరావతి నుండి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ కు మారటం ఎల్లోమీడియాకు ఏమాత్రం ఇష్టంలేదు కాబట్టే. ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ను చేయబోతున్నామని జగన్ ప్రకటించాడో అప్పటి నుండే విశాఖపట్నం విషయంలో ఎల్లోమీడియా కూడా ప్రత్యేకమైన దృష్టిపెట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే.

 

అమరావతిని తన సామాజికవర్గంలోని ప్రముఖుల గేటెడ్ కమ్యూనిటిగా మార్చేందుకు చంద్రబాబునాయుడు శతవిధాల ప్రయత్నించాడు. కాకపోతే కాలం కలిసిరాకముందే చిత్తుగా ఓడిపోయాడు. ఆ కోపం చంద్రబాబుతో పాటు అదే సామాజికవర్గంలోని ప్రముఖుల్లో  పేరుకుపోయింది. దానికితోడు రాజధానిని వైజాగ్ కు తీసుకెళతానని జగన్ ప్రకటించటంతో చంద్రబాబు+సామాజికవర్గంలోని ప్రముఖులు+అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నవారు+ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది. ఎలాగైనా రాజధానిని అమరావతినే కంటిన్యు చేయించాలని రకరకాలుగా జగన్ పై ఒత్తిడి మొదలైంది. రాజధానిగా అమరావతినే కంటిన్యు చేయించాలంటే వైజాగ్ ప్రాంతంపై నెగిటివ్ గా ప్రచారం చేయటం పై వర్గాల తెరవెనుక వ్యూహంలో ఒకటిగా అనుమానం వస్తోంది.

 

అందుకే  వైజాగ్ కేంద్రంగా లక్షల కోట్ల రూపాయల భూ దందాలన్నారు. వేలాది ఎకరాల కబ్జాలు చేస్తున్నారంటూ గోల చేశారు. ప్రశాంతంగా ఉన్న వైజాగ్ ను రాయలసీమ మాదిరిగా ఫ్యాక్షన్ ప్రాంతంగా మార్చేస్తున్నట్లు ప్రచారం చేశారు. ఇపుడేమో వైజాగ్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరుగుతున్నాయంటూ జనాలను రెచ్చగొడుతున్నారు. రాజధానిగా వైజాగ్  వచ్చినా రాకపోయినా జరిగే ప్రమాదాలు ఎప్పుడూ జరుగుతునే ఉంటాయి. జగన్ వచ్చి వైజాగ్ లో కూర్చోవటం వల్లే అదనంగా జరిగే ప్రమాదాలంటూ ఏమీ ఉండవనే చెప్పాలి. నిజం చెప్పాలంటే చంద్రబాబు హయాంలో కూడా చాలా అగ్నిప్రమాదాలు జరిగాయి. అప్పుడెప్పుడు ఎల్లోమీడియా వాటిని హైలైట్ చేయలేదు. ఎందుకంటే మనోడు కాబట్టే.

 

చంద్రబాబు హయాంలో వివిధ ఫ్యాక్టరీల్లో  జరిగిన  ప్రమాదాల్లో సుమారు 76 మంది చనిపోయారు. మరి అప్పుడెప్పుడూ ఇపుడు గోల చేస్తున్నట్లుగా ఎల్లోమీడియా ఎందుకు వార్తలు, కథనాలు అచ్చేయలేదు ?  జరుగుతున్న ప్రమాదాలను బూచిగా చూపించి ఇటు జగన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అటు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లే ఉంది ఎల్లోమీడియా రాతలు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో కూడా ఎల్లోమీడియా ఇదే విధంగా వ్యవహరిస్తోంది. తెలంగాణాలో జనాలను ప్రభుత్వం గాలికొదిలేసిందనే అభిప్రాయం జనాల్లో ఉన్నా ఎల్లోమీడియా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం చేతకాని తనాన్ని ఎక్కడా ప్రశ్నించటం లేదు. అదే ఏపిలో వైరస్ రోగుల విషయం వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా చిన్నచిన్న లోపాలను బూతద్దంలో చూపిస్తోంది. మొత్తం మీద జగన్ పాలనపై ఎల్లోమీడియా విషం చిమ్మటానికే ప్రాధాన్యత ఇస్తోందన్నది అర్ధమైపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: