మనస్ఫూర్తిగా నవ్వుకుని చాలా రోజులు అయ్యింది. ఆనందంగా ఫ్రెండ్స్ తో షికార్లకు వెళ్లి చాలా రోజులు అయ్యింది. కుటుంబంతో కలిసి గుళ్ళూ, గోపురాలకు వెళ్ళీ చాలా రోజులు అయ్యింది. బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లకు, విందు, వినోదాలకు, సినిమాలకు, షికార్లకూ, వెళ్లి చాలా రోజులు అయ్యింది. అసలు ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే అనుమానంగా చూసి, మొహమాటంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మలక్కలు గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకునే అవకాశం కూడా లేదు. తాతలు రచ్చబండ మీద కూర్చుని సందుల్లో గొడవలు దగ్గర నుంచి, దేశ రాజకీయాలు .. ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడుకుని చాలా రోజులు అయ్యింది. కేరింతలతో సందడిగా బడికెళ్లే పిల్లలూ రోడ్లపై ఎక్కడా కనిపించడం లేదు.  ఇంట్లోనే బందీ అయిపోయారు.

 

IHG


అసలు ఇంత దుస్థితి  రావడానికి ఎవరు కారణం ? కారణం ఎవరు ఇంకెవరు ఆ మహదారి మహమ్మారి కరోనా. పుట్టింది ఎక్కడైనా, ప్రపంచంలోనే అన్ని దేశాల్లోనూ విస్తరించింది. దర్జాగా జనాల్లో పెరుగుతోంది. అజాగ్రత్తగా ఉన్న వారిని కాటేసేందుకు కాచుకుని కూర్చుంది. కరోనా ఎక్కడో చైనాలో వచ్చిందట ..! అనుకుంటూ ఒకప్పుడు చెప్పుకున్నాం ... మనదేశంలోనూ కేరళలో వచ్చింది అంట...! అనుకుని కాస్త భయపడ్డాం. ఆ తరువాత పట్నాల్లో వచ్చింది అని కంగారుపడ్డాం. ఇంతలోనే మారుమూల పల్లెలనూ వదిలిపెట్టకుండా అక్కడికీ వచ్చేసింది. లక్షలాది మందిని కాటేస్తోంది. కొంతమందిని కాటికి పంపుతోంది. సరే దానిపని అది చేసుకుంటుంది ... మరి మనం ఏమి చేస్తున్నాం అనేదే ఇక్కడ ప్రశ్న. సామజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించే వారు ఎంతమంది ? 

IHG


దొంగచాటుగా వందల మందితో విందులు, వినోదాలు పెట్టుకునేవారు ఎంతమంది ? అసలు కరోనా సోకినా వారిపై జాలి చూపించేవారు ఎంతమంది ? '' మనం పోరాడాల్సింది రోగితో కాదు .. రోగంతో అని చెప్పినా అది వినేవారు ఏరి ? అప్పటి వరకు మంచి వారీగా కనిపించిన వారు ఒక్కసారి ఆ కరోనా వైరస్ సోకగానే ఎందుకు సమాజం వారిని ఎందుకు వెలి వేస్తోంది. ఇప్పుడు వారికి వచ్చింది. రేపు మనకి అదే పరిస్థితి వస్తే అప్పుడేమంటారు. ? కరోనా సోకినా వారి కుటుంబాన్ని కూడా ఈ సమాజం వెలివేసినట్టుగా చూడటం, వారిని అవమానించడం, సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాయడం, ఇలా ఎన్నో సంఘటనలు చూస్తోనే ఉన్నాం. 

 

IHG


సమాజం అంతా ఐకమత్యంగా ఉంటూ కరోనా విజృభించకుండా అవగాహన పెంచుకుంటూ .. అవగాహనా కల్పిస్తూ ఉండాల్సిన ఈ సమయంలో ఎందుకు కరోనా సోకినా వారిపట్ల ఇంత చిన్న చూపు ? కరోనా నుంచి కోలుకుని బయటకి వచ్చిన వారి విషయంలోనూ ఇదేరకమైన చిన్నచూపు ఎందుకు ? కరోనా ఫలానా వారికి మాత్రమే సోకుతుంది అనే రూల్ ఏమి లేదుకదా..? ఇప్పుడు మనం పోరాడాల్సింది రోగితో కాదు రోగంతో... కాదు కాదు సమాజంతో అనేలా పరిస్థితి ఎందుకు వచ్చింది.. ? పల్లెల్లో ఇటువంటి అపోహలు ఉన్నాయనుకున్నా, పట్టణాల్లో చదువుకున్నవారు, ఉద్యోగస్తులు, కొంతమంది మేధావులు ఇదే రకంగా తయారయ్యారు.వెలివెయ్యాల్సింది జనాలను కాదు.. కరోనాను. 

మరింత సమాచారం తెలుసుకోండి: