ఆంధ్రప్రదేశ్ కి పరిపాలన రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖాయం చేసిన విశాఖలో వరుస ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ తర్వాత వరుసగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా విశాఖ పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో విశాఖ ప్రజలు వణికిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటనలను రాజకీయ కోణంలో చూడటం మొదలుపెట్టారు మన నాయకులు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో వరుస ప్రమాదాల వెనుకు కుట్రలు ఉన్నాయా? లేక లాక్ డౌన్ తర్వాత ఓపెన్ చేస్తున్నందుకు నిర్వహణ లోపాలతో ఇలా జరుగుతుందా అనే దానిపై విచారణ చేస్తామని..

 

కుట్రకోణం బయటపడితే ఎవరినీ వదిలేదని లేదని హెచ్చరించారు. వరుస ప్రమాదాలు చూస్తుంటే కుట్రలున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్ కూడా విశాఖలో వరుస ప్రమాదాల వెనుక కుట్రలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న కూడా దీనిపై స్పందించారు.. విశాఖ ప్రజలు ఒకవైపు కరోనాకు, మరోవైపు విజయసాయిరెడ్డికి భయపడుతున్నారని చెప్పారు. విశాఖలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాల వెనుక విజయసాయి హస్తం ఉందని ఆరోపించారు. కరోనా సమయంలో రాంకీ సంస్థకు అనుమతులు ఎవరిచ్చారని ప్రశ్నించారు.

 

ఎల్టీ పాలిమర్స్ తరహాలోనే పరవాడ ప్రమాద మృతుల కుటుంబాలకు కూడా రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాంకీ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఇంతవరకు విచారణ కమిటీని ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని... దీన్నించి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఫార్మా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50లక్షల పరిహారాన్ని విజయసాయిరెడ్డి ప్రభుత్వం తరుఫున ప్రకటించారు.

 

ఇక గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.20లక్షల పరిహారం ప్రకటించారు. వాస్తవానికి అక్కడ అసలు నిజంగా ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అధికారంలో ఉన్న నేతలు ఇలా మాట్లాడటం నిజంగానే సిగ్గుచేటు. దానికి తోడు ప్రతిపక్ష నేతలు రాజకీయ లబ్ధి కోసం చూడటం మరింత సిగ్గుచేటు.  బాధ్యత లేని ఇలాంటి నాయకులు చేసే అర్ధం లేని అనుమనలతో ప్రజలు మరింత భయపడుతున్నారు. అయినా ఇలాంటి ప్రమాదాలు ఒక్క విశాఖలోనే జరగట్లేదు. దేశ వ్యాప్తంగా రోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలే తప్ప.. ప్రమాదం జరిగిన తర్వాత అర్ధం లేని ఆరోపణలు చేయకూడదని ఆశిస్తున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: