జీవితంలో చివ‌రి ద‌శ‌.. పండుటాకులుగా మారిన మ‌నుషులు.. నడిచే శక్తి.. పలికే ఓపిక లేని.. పండుటాకులు.. గుండెలు పిండే బాధను దిగమింగుకుంటూ పిడికెడు మెతుకులు, నిలువ నీడ కోసం, సంతాన ఆత్మీయ‌త కోసం అలమటిస్తున్నాయి. తల్లిదండ్రులపై కొద్దిపాటైనా ప్రేమను చూపేందుకు మనసు లేని కొందరి బిడ్డల దాష్టీకాలతో తల్లడిల్లుతున్నాయి. అందరూ ఉన్నా అనాథలుగా నిలుస్తున్న కొందరు పండుటాకులకు వృద్ధాశ్రమాలు చిరునామాగా మారుతుండగా, మరికొందరు ఆమాత్రం సౌకర్యానికి కూడా నోచుకోకుండా రోడ్ల పాలవుతున్నారు. 

Helpage Home India is the oldest of the elderly

కనిపెంచిన కొడుకులే కనికరించక కాఠిన్యంతో వ్యవహరిస్తుంటే కన్నీళ్ల పర్యంతమై కాసింత ఆసరా కోసం భోరున విలపిస్తున్న ఘటనలు నేడు సర్వసాధారణమయ్యాయి. ఇలాంటి పుత్రరత్నాల ఆగడాలకు చెక్ పెట్టాడు బీహార్ సీఎం నితీష్ కుమార్. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమం గురించి సీఎం నితీష్ నేతృత్వంలోని మంత్రివర్గం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను చూడకున్నా, వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించినా వారిని జైలుకు పంపిస్తానని చెప్పాడు నితీష్. వెంటనే దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల అయ్యింది.

Image result for cm nitish kumar

వృద్ధులైన తల్లిదండ్రులను సరిగా చూడని కొడుక‌ల‌కు, కూతుళ్లకు ఇక నుంచి జైలు శిక్ష విధించాలని నితీష్ నిర్ణయించారు. వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా వారిని వదిలివేసిన కుమారులు లేదా కూతుళ్లకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చట్టం తీసుకువచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోని కుమారులు, కూతుళ్లపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపించనున్నారు. కన్నపేగుకు కన్నీరు వద్దు.. అంటూ బీహార్ సీఎం తీసుకున్న నిర్ణ‌యానికి ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

Image result for parents old age

ఆ నిబంధనల ప్ర‌కారం..
60 సంవత్సరాలు దాటిన వారందరినీ వృద్ధులుగా పరిగణిస్తారు. 60 సంవత్సరాలకు పైబడిన వాళ్లు వారి పోషణ బాధ్యతను డిమాండ్ చేయవచ్చు. ఆస్తులు రాయించుకుని తల్లిదండ్రులను గాలికొదిలేస్తే సెక్షన్ 23 ప్రకారం ఆ ఆస్తిని తిరిగి పొందే వీలుంటుంది. వారికి రాయించిన రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేసుకోవచ్చు.
* వయో వృద్ధుల కోసం 2007లో ప్రభుత్వం తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టాన్ని అమలు పరిచారు. 2011లో ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంక్షేమ నియమావళిని ప్రవేశ పెట్టింది. ఈ చట్టంలో వృద్ధుల సంక్షేమం కోసం పలు నిబంధనలను పొందుపరిచారు.
* నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, వృద్ధులు ఈ చట్టం ద్వారా పోషణ, సాధారణ జీవనం, సంరక్షణ పొందే హక్కును కలిగి ఉన్నారు.
* పిల్లలు, బంధువుల నిరాదరణకు గురైనవారు ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం న్యాయస్థానానికి సాధారణ జీవనం, పోషణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఏదైనా సందర్భంలో పిల్లలు, బంధువులు వృద్ధులను, వారి సాధారణ జీవనాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యానికి గురైన వృద్ధులు నెలసరి భృతి పొందేందుకు చట్టంలో సెక్షన్ 8 ప్రకారం అర్హులు.
* కేసు విచారణలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు, వృద్ధులు చట్టప్రకారం రిజిస్టరైన స్వచ్ఛంద సంస్థ లేదా వృద్ధాశ్రమంలో గడిపేందుకు సెక్షన్ 4 ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి పెట్టిన వారికి కూడా శిక్షలున్నాయి. మూడు నెలల జైలుశిక్ష లేదా ఐదువేల రూపాయల అపరాధ రుసుము చెల్లించాలి. కొన్నిసమయాల్లో రెండింటినీ విధిస్తారు


మరింత సమాచారం తెలుసుకోండి: