Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 9:58 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియ‌ల్: పార్టీ మారితే అదే రోజు ప‌ద‌వి పోవాలి

ఎడిటోరియ‌ల్: పార్టీ మారితే అదే రోజు ప‌ద‌వి పోవాలి
ఎడిటోరియ‌ల్: పార్టీ మారితే అదే రోజు ప‌ద‌వి పోవాలి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌తిప‌క్షం అవ‌స‌రం. అలాంటి ప్ర‌తిప‌క్షమే లేకుండా పోతే, ఆ ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలంతా అధికార పార్టీ వైపే ప‌రుగులుపెడుతుంటే.. మోస‌పోయేది ఎవ‌రు? నాయ‌కులు కాదు, పార్టీలు కాదు ప్ర‌జ‌లు. అవును ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు మ‌న‌ నాయ‌కులు. సొంత ప్ర‌యోజ‌నాల కోసం బ‌రితెగిస్తున్నారు. ప్ర‌జ‌ల నుంచి ఓట్లు పొంది గెలిచిన త‌ర్వాత అడ్డ‌గోలుగా పార్టీలు మారుతూ ప్ర‌జాస్వామానికి చీడ‌పురుగుల్లా త‌యార‌వుతున్నారు.
political-leaders
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం అపహస్యం పాల‌వుతోంది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలచేత నేరుగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు యథేచ్ఛగా గోడ‌దూకేస్తున్నారు. అధికారంలో, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు, అసెంబ్లీలో తమ బలాన్ని పెంచుకునేందుకు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయి. ప్రజాప్రతినిధులు ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా తమ వైపునకు తిప్పుకుని రాజకీయాలు ప్రజల కోసం కాదని చెప్పకనే చెబుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు త‌మ సొంత ప్ర‌యోజ‌నాల కోసం గెలిపించిన ప్ర‌జ‌ల‌ను, చ‌ట్టాన్ని అప‌హ‌స్యం చేస్తూ నిస్సిగ్గుగా అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొన‌సాగుతోంది. 
 political-leaders
పార్టీలు చేస్తున్న ప్రజాస్వామ్య అపహాస్యాన్ని విద్యావంతులు, ఉపాధ్యాయులు,సామాన్య ప్రజానీకం గమనిస్తూనే ఉంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన మొత్తంలో ఎమ్మెల్యేలు ఉండి సంపూర్ణ మెజార్టీ ఉన్నా.. కూడా ప్ర‌తిప‌క్షాన్ని లేకుండా చేసేందుకు ఆకర్ష్‌పథకంతో జంపింగ్‌లకు తెరదీశారు. అయితే, న‌యానో భ‌యానో పాల‌క‌ప‌క్షం ఎమ్మెల్యేల‌ను లాగేసుకునే ప‌రిస్థితులు కూడా ఉన్నాయి. త‌మ పార్టీలోకి రాక‌పోతే కేసుల్లో ఇర‌కిస్తామంటూ అధికార పార్టీ భ‌య‌పెట్టిన సంద‌ర్భాలు ఉన్నాయి. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేల‌కు పెద్ద ఎత్తున ఎర వేసి లాగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇంకొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, మరికొందరికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇంకొందరికి కాంట్రాక్టు పదవులు అప్పగించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అధికారంలో ఉన్నవాళ్లు రాజ్యాంగాన్ని అమలుచేయడం పోయి.. ఉల్లంఘించే స్దాయికి పరిస్ధితి దిగజారిపోయింది.
పార్టీ ఫిరాయింపు చేస్తే పదవుల్లో కొనసాగడానికి అనర్హులని రాజ్యాంగం చెబుతుంది. కానీ మన ఎమ్మెల్యేలు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించి నింబంధనలకు తూట్లుపొడుస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుంది. ఇది అసెంబ్లీ స్పీక‌ర్ నిర్ణ‌యం కిందికి వ‌స్తుంది. అయితే నాన్చ‌వేత ధోర‌ణి అవ‌లంభిస్తూ అధికార పార్టీకి అనుకులం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

political-leaders

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను అనుసరించి అనర్హులుగా ప్రకటించాలి. స్పీకర్‌ కూడా దీనిపై ఒక నిర్ణయాన్ని ప్రకటించాలి. ఒక‌వేళ‌ మంత్రి వర్గంలో కొనసాగాలంటే రాజీనామా చేసి మళ్ళీగెలవాల్సిఉంటుంది.
ఫిరాయింపు ఎమ్మె ల్యేలతో రాజీనామా చేయించాల్సిన బాధ్యత గవర్నర్‌కు ఉంది. ఇక ఫిరాయింపులపై జాతీయస్ధాయిలో చర్చజరగాలి. ఈ చట్టాన్ని పటిష్టవంతంగా మార్చాలి. ఫిరాయింపు వ్య‌వ‌హారంలో గవర్నర్‌ పాత్రే కీలకం. గవర్నర్‌ ఆచీ తూచీ అడుగులు వేయాల్సి ఉంది. ఈ చట్టంలో ఉన్న అంశాలను పరిశీలించాలి. ఏ ఎమ్మెల్యే ఏపార్టీలో ఉన్నాడు అనే విషయాలను పరిగణలోకి తీసుకుని మంత్రి వర్గ విస్తరణ సమయంలో తన విచక్షణాధికారాలు వినియోగించుకోవాలి. గవర్నర్‌ పదవికి ఎంపికైన వారు రాజకీయాలకు సంబంధం లేనివారైతే మంచిదని సర్కారియా కమీషన్‌ గతంలో ఎప్పుడో తెలియజేసింది. సాధారణంగా కొత్త ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఉన్న ప్రభుత్వాలు మైనార్టీలో పడినప్పుడు గవర్నర్‌ పాత్ర అమోఘంగా ఉండాలి.
నిజానికి ఫిరాయింపుదారులను మంత్రులుగా తీసుకోవడం మ‌మ్ముటికి త‌ప్పే. వారు పార్టీని ఫిరాయించారు కాబట్టి శాసనసభ్యులుగా కొనసాగటమే చట్టవిరుద్దం. అలాంటి వారికి మంత్రి పదవులు ఇచ్చి అందలం ఎక్కించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ఇక స్పీకర్లు కూడా అధికార పార్టీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. దీనివల్ల ఫిరాయింపుల నిరోధక చట్టం స్ఫూర్తి దెబ్బతింటుంది. ఒక పార్టీ సింబల్‌పై గెలిచి మరోపార్టీలో చేరడం ఒకవిధంగా చెప్పాలంటే రాజకీయ అనైతిక చర్యగా భావించాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల స‌భ్య‌త్వం ర‌ద్దు చేయాలి. వేరే పార్టీలోకి వెళ్ళాలనుకొనే వాళ్లు పదవికి రాజీనామా చెయ్యడం, అయిదేళ్లపాటు మళ్ళీ పోటీకి నిరాకరించడం, ఏ అధికార పదవులూ అందుకోకుండా కఠిన ఆంక్షలు విధించడం- వంటివన్నీ చట్టబద్ధం కావాలి.

political-leaders

ఈ చ‌ట్టం బ‌లోపేతంగా మారాలంటే ముందుగా.. మోస‌పోయిన ప్ర‌జ‌లు స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను క్ష‌మించ‌కూడ‌దు. పార్టీ మారితే అదే రోజు ప‌ద‌వి పోవాలి. అలాంటి చ‌ట్టం రావాల్సిందే. ఇప్ప‌టికే పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్న ఎమ్మెల్యేల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌జారుకీడ్చే ప‌నిలో ప‌డింది యువ‌త‌. అలాంటి వారికి బుద్ధి వ‌చ్చేలా త‌గిన‌ గుణ‌పాఠం చెప్పే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి. ఫిరాయింపుల‌కు పాల్ప‌డే వారికి వెన్నులో భ‌యం పుట్టేలా చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అప్పుడే ప్ర‌జాస్వామ్యం నిల‌బ‌డుతుంది. పార్టీ మారితే అదే రోజు ప‌ద‌వి పోవాలి అనే ఉద్య‌మానికి మన‌మంద‌రం భాగ‌స్వాముల‌వుదాం. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెల‌పండి.  


political-leaders
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.