టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కి రాజకీయ చాణిక్యుడు అని అపార మేధావి అనే పేర్లు కలవు.కాని ఆయన రాజకీయ చతురత ఈసారి ఎన్నికలలో పని చేయలేదు అని చెప్పాలి.ఆయన వ్యతిరేకించిన రెండు పార్టీ లు అటు రాష్ట్రంలో ఇటు కేంద్రం లో గెలుపొందాయి.దానితో బాబు గారికి రానున్న కాలం కష్టకాలం అనడం లో ఏ మాత్రం సందేహం లేదు.

తనకు రానున్న కాలం లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి బాబు గారు ఇప్పటికే అడుగులు వేశారు.తమ అనుకూల పత్రికలలో, ఛానెల్ లో బాబు గారి కోసం తరలి వస్తున్న జనం ఆయన ఓడిపోయింది తమ తెలివి తక్కువ తనం వల్ల అని బాధపడుతున్నట్లు కథనాలు ప్రచారం చేస్తున్నారు.

అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న బాబు గారిని రాష్ట్ర ప్రజలు చావు దెబ్బ కొట్టారు అని ప్రజలను దొంగలను చేస్తూ సోషల్ మీడియా లో కార్యకర్తలు పోస్టులు తో రెచ్చిపోతున్నారు.

ఇది అంతా చేయడం ద్వారా ప్రజలు నిజంగానే బాబు గారి లాంటి మంచి వ్యక్తిని అనవసరంగా ఒడించమని భావించాలి అని అనుకుంటున్నారు.
తద్వారా ప్రజలు బాబు గారికి అనుకూలంగా మారుతారని.ఆయన మీద చర్యలు తీసుకుంటే తమకెక్కడ వ్యతరేకత వస్తుందని వైసీపీ శ్రేణులు వెనకకు తగ్గుతున్నారని అలాగే కేంద్రం తన పై చర్యలు తీసుకోవడానికి ముందుకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఒత్తిడి తో అండగా ఉండడం వల్ల తను తప్పించుకోవచ్చ ని భావిస్తున్నారు.

గతంలో ప్రేత్యక హోదా విషయంలో జగన్ ట్రాప్ లో పడి నష్టపోయిన బాబు ఇప్పుడు ఆయన ట్రాప్ లోకి జగన్ లాగడానికి చూస్తున్నారు.మరి జగన్ ట్రాప్ లో పడతారా?బాబు గారు అనుకున్నట్లు అంతా జరగుతుందా అంటే కష్టమనే చెప్పాలి.జనం అంతా చూస్తున్నారు.మీడియా చేతిలో ఉంటే ఏమైనా చెయ్యచ్చు అని భావించే రాజకీయ పార్టీలకు గతంలో ప్రజలు ఎన్నో సార్లు బుద్ది చెప్పారు.మరి ఈసారి ఏం జరగుతుందో తెలుసుకోవడానికి కొద్దిరోజులు వేచి చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: