రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలనూ వర్షాలు వణికిస్తున్నాయి. నేపాల్ లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.దీని ప్రభావం రాష్ట్ర మీద కూడా పడుతుంది. కొద్ది రోజులుగా నేపాల్ లో కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడి వరద నీరు భారీ నుంచి అతి భారీ స్థాయిలో బీహార్ లోని లోతట్టు ప్రాంతాలను చేరుకుంటున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.
దీనివల్ల రాష్ట్రంలోని ఆరు నదులు అతి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా బీహార్ లో వర్షాలు కుండపోతగా పడుతున్నాయి. కొద్ది రోజులుగా బిహార్ లో వర్షాలు కుండపోతగా పడుతుండటంతో 78 మంది మృత్యువాతకు గురైయ్యారు.
బిహార్ లోని  సీతామర్హిలో 18 మంది, మధుబానిలో 14 మంది, ఆరేరియాలో 12 మంది, షియాహర్ దార్భాంగాలో తొమ్మిది మంది, పూర్ణియాలో ఏడుగురు ,కిషన్ గంజ్ లో నలుగురు, సూపాల్ లో ముగ్గురు, తూర్పు చంపారన్ లో ఇద్దరు మృత్యువాతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఇలా కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం 55 లక్షల మంది ఆశ్రయం లేని వారయ్యారు.
దీంతో రాష్ట్రం మొత్తం మీద 1,119 మందికి ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది.26 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: