పశ్చిమ బెంగాల్ కోస్తా తీర ప్రాంతం లోని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ మీదుగా నైరుతి ఋతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ నెల 31 వరకు వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.నిన్న వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లోని పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతుంది.
ఈ అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అటు అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ఈ రెండింటి ప్రభావంతోటి నైరుతి ఋతు పవనాలు కూడా చాలా చురుగ్గా కదలడంతోటి రాష్ట్రంలో పెద్ద ఎత్తున మంచి వర్షాలు కురిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు, రేపు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు కూడా వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేయటం జరిగింది.ప్రస్తుతం ఈ యెక్క అల్పపీడనంతో పాటుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో కూడా అటు అరేబియా సముద్రం కావచ్చు, అటు బంగాళాఖాతం నుంచి కూడా ఇస్తున్న తేమతో కూడిన గాలులతోటి కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు.
ప్రజెంట్ చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో చిరుజల్లులు పడుతున్నటువంటి పరిస్థితి ఉండవచ్చు. నిన్న దాదాపుగా గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా రాష్ట్రంలోనే అనేక ప్రాంతాల్లో 90 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఈ రోజు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్ర అధికారి తెలిపడం జరిగింది.దీంతో పాటుగా ఈ నెల 31న వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావం అటూ దక్షిణాది రాష్ట్రాలపైనే ఉండే అవకాశముందని కూడా వాతావరణ కేంద్ర అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం కూడా చూడొచ్చు.
ప్రజెంట్ చూసుకుంటే మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఫోర్ క్యాస్ట్ చూసుకుంటే ఈ రోజు రాజస్థాన్, ఒడిష, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ గఢ్, గుజరాత్, కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు ఐఎండీ తెలిపింది.దీంతో పాటుగా కర్ణాటక, కోస్తాంధ్రా, యానాం, మధ్య మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు కూడా వాతావరణ కేంద్ర అధికారి తెలిపినటువంటి వివరాల ప్రకారంగా చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం దాదాపుగా 45 రోజుల తర్వాత రాష్ట్రంలో కొంత మంచి వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఉంది. అటు రైతులు రానున్న ఒకటి రెండు వారాలు కూడా ఆశాజనకంగా ఉంటుందని చెబుతున్నారు.