క్యాబ్ టాక్సీల వచ్చినపుడు అందరు చాల ఆనంద పడ్డారు కానీ తరువాత మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలు వల చాల భయపడుతున్నారు   తాజాగా బెంగళూరుకు చెందిన గౌరీ ధావన్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వివరాలు... తన నివాసం నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు గౌరీ గురువారం ఓలా క్యాబ్‌ను బుక్‌ చేశారు. ఉదయం పదకొండు సమయంలో తనను రిసీవ్ చేసుకోవాల్సిందిగా సంబంధిత డ్రైవర్‌కు తెలిపారు.
       
ఈ క్రమంలో పీన్యాలో ఉన్న గౌరీ ఇంటికి చేరుకున్న క్యాబ్ డ్రైవర్‌ ఆమెను కిందకి రమ్మని చెప్పాడు. దీంతో లగేజ్‌తో సహా అక్కడికి చేరుకున్న గౌరీతో.. తనకు ఆన్‌లైన్‌ పేమెంట్‌ వద్దని.. చేతికి డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఇందుకు తొలుత ఆమె నిరాకరించినప్పటికీ సరైన సమయానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాలనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో కొంత దూరం వెళ్లిన తర్వాత ఆన్‌లైన్‌ వివరాల ప్రకారం రూ. 650 ఇచ్చేందుకు సిద్ధమవగా... తనకు ఆ డబ్బు సరిపోదని.. ఎక్కువ మొత్తం కావాలని డ్రైవర్‌ డిమాండ్ చేయడంతో ఆమె షాకయ్యారు.

వెంటనే తేరుకుని చెప్పిన దాని కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వనని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో కారును నిలిపివేసిన డ్రైవర్‌ గౌరీ లగేజ్‌ను ఒక్కొక్కటిగా కింద పారేయడం మొదలుపెట్టాడు. తర్వాత గౌరీపై భౌతికంగా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన గౌరీ పోలీసులకు ఫోన్‌ చేయడంతో ఆమెను అక్కడే దింపేసి పారిపోయాడు.

ఈ విషయం గురించి గౌరీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ...‘ నేను ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ బుక్ చేశాను. అయితే సదరు క్యాబ్‌ డ్రైవర్‌ అనుచితంగా ప్రవర్తించాడు. ఎక్కువ డబ్బు చెల్లించాలంటూ గొడవపడ్డాడు. క్యాబ్‌ ఎక్కినప్పటి నుంచి బెదిరించడం మొదలుపెట్టాడు. నాపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ప్రతిఘటించాను. నా లగేజ్‌ బయట పారేసి క్యాబ్‌ దిగుతావా లేదా ఈడ్చిపడేయమంటావా అంటూ భయపెట్టాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: