ఈమధ్య ప్రాంక్ చేయడం చాలా ఫ్యాషన్ అయ్యింది. ఫారిన్ చేసే లో వీడియోస్ చూసి చెడిపోతున్న యువత మన దేశంలో కూడా ఢిల్లీ ముంబై, కలకత్తా, చెన్నై వంటి మహానగరాల్లో ఎప్పటినుంచో చేస్తున్నారు ఇప్పుడు ఇవే ప్రాంక్ వీడియోలు మన హైదరాబాదులో కూడా చేస్తూ ఉన్నారు.

అందులో భాగంగా ఈ మధ్యనే ఒక వీడియో హల్చల్ చేస్తూ ఉంది మామూలుగా పోలీస్ తో మాట్లాడాలంటే అని మనకు కాళ్లు చేతులు వణుకుతూ ఉంటాయి. అలాంటిది ఒక యువకుడు విధులు నిర్వహిస్తున్న లేడీ కానిస్టేబుల్ కి లవ్ ప్రపోజ్ చేశాడు . మేడం నేను మిమ్మల్ని మూడు నెలలుగా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అతను మీరు నాకంటే పెద్ద పైగా పోలీస్ కదా అందుకే చెప్పాడానికి భయం వేసింది .


దానికి కానిస్టేబుల్ సమాధానమిస్తూ నీ ఏజ్ ఏంటి  ఇ పని  ఏంటి అని ప్రశ్నించింది .ప్రేమకు  వయసుతో సంబంధం ఏముందని అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు .దాంతో కోపంతో రగిలిపోయిన కానిస్టేబుల్ స్వరం పెంచి ముందు మంచిగా చదువు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అనేసి చెప్పారు .అయినా కానీ వినకపోయేసరికి మీ అమ్మ నాన్నకు చెప్తాను అంటే అబ్బాయి నేను ఆల్రెడీ మా ఇంట్లో చెప్పేసి వచ్చానని చెప్పాడు .ఓపిక నశించిన కానిస్టేబుల్ అతని చొక్కా పట్టుకొని స్టేషన్కు నడవమని చెప్పింది.

అతను ఏడుపు ముఖం పెట్టాడు చివరకు ఆగ్రహం  కట్టలు తెచ్చుకునేలా ఉండడంతో అజయ్  అసలు విషయం చెప్పేశాడు ఇప్పటిదాకా చేసింది అంత ప్రాంక్ వీడియో లో భాగం అని చెప్పాడుహర్ష అనే యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ అజయ్ చేసే ప్రాంక్ వీడియోస్ నచ్చడంతో తన కజిన్ మీద కూడా ఇలా ప్రాంక్ చేయించాడు.ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: