మన దేశం ఎన్నోభిన్న విభిన్న  సంస్కృతులు, భిన్న ఆచారాలు, వ్యవహారాకలబోత గల దేశం మన దేశం లో ఒక్కొక రాష్ట్రానికి ఒక్కో ప్రాంతానికి విభిన్నసాంప్రదాయ ఆచార వ్యవహారాలు  కలిగినది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన సంస్కృతి ఉంటుంది. ఎన్నో రకాల జాతుల ప్రజలు... తమదైన జీవన శైలిలో జీవిస్తూ ఉంటారు. అలాంటి సంస్కృతులను మనం తెలుసుకోవాలి. అంతరించిపోతున్న ఆ జీవన శైలులను అంతరించకుండా  బతికించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందిప్రాచీన భాషగా గుర్తింపబడ్డ తెలుగు యొక్క సాహిత్య సంస్కృతి విశాలమైనది.

అనేక ప్రాచీన కవుల, రచయితల వలన తెలుగు ఉత్తాన పథాన్ని చేరినది. ఆధ్యాత్మిక, సంగీత, తత్వ రచనలకి అనువుగా ఉండటంతో తెలుగువారితో బాటు, తెలుగేతరుల మెప్పు పొందినదితెలుగు సాంస్కృతిక చరిత్ర కళలు నిర్మాణ శైలి సాహిత్యము ఆహారపు అలవాట్లు ఆంధ్రుల దుస్తులు మరియు తత్వాలు గా విభజించ వచ్చు ఇక్కడి వాగ్గేయకారులు మరియు కూచిపూడి నృత్యం సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యాలు కర్ణాటక సంగీతంలో శాస్త్రీయసంగీతంలో తెలుగు భాష ఇట్టే ఇమిడి పోవటంతో  ఆంధ్రప్రదేశ్ సంగీతానికి సాహిత్యానికి నృత్యానికి మాతృకగా వ్యవహరించింది  .

అలాంటి సంస్కృతుల్లో  ఒకటి... ఐన రేణుకాయెల్లమ్మ తల్లి చరిత్ర ను ని గురించి ఆమెని  ప్రసన్నం చేసుకోవటానికి ఆదివాసుల ఒక  పాట పాడుతారు ఆ పాట ను కర్ణాటక-ఆంధ్ర సరిహద్దులోని బళ్ళారి ప్రాంతంలో ఉండే  వాయిద్య కళాకారులు  ఆలపిస్తారు. సహజ వాయిద్యాలతో వాళ్లు అలా పాట పాడుతూ ఉంటే... ఓ రకమైన రిథమిక్ సౌండ్ వస్తూ ఉంటుంది. పాటకు తగ్గట్టుగా... ఆ సౌండ్‌లో ఎత్తుపల్లాలుంటాయి.

మొత్తంగా ఆ పాట వింటుంటూ... మనకు తెలియకుండానే మయమరిచిపోయి అందులో మజాను మనం ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి అంతరించిపోతున్న ఇలాంటి కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికి ఉంది అంటూ ఒక  నెటిజన్ శ్రీధరణ్ సిద్ధూ... ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియోకి మంచి స్పందన వస్తోంది.ఏ వీడియో అందరు తప్పక చూడాల్సిందే


మరింత సమాచారం తెలుసుకోండి: