పోటీ పరీక్షలకి ప్రిపైర్ అయ్యేవారిలో చాలా మంది బ్యాంక్ పరీక్షల వైపు మొగ్గు చూపుతారు అందులోనూ..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబులు అంటే ఎగిరి గంతేస్తారు కూడా అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్ 2018 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 121 ఉద్యోగాల్లో.. 16 మేనేజర్ పోస్టులు, 24 చీఫ్ మేనేజర్ పోస్టులు.. ఇంకా వివిధ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు 16 జనవరి 2018 నుంచి 04 ఫిబ్రవరి 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

 Image result for sbi

బ్యాంక్ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

 

పోస్ట్ పేరు : మేనేజర్, చీఫ్ మేనేజర్

 

ఖాళీల సంఖ్య : 121

 

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా ఎక్కడైనా.

 

ఆఖరు తేదీ : 04 ఫిబ్రవరి 2018

 

వేతనం వివరాలు:

మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) : రూ.42,020 - రూ.51,490

చీఫ్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) : రూ.50,030 - రూ.59,170

విద్యార్హతలు :

 

మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) ఉద్యోగానికి.. సీఏ లేదా పీజీడీఎం/ఎంబీఏ లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివి ఉండాలి. దాంతోపాటు 5 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

 

చీఫ్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) ఉద్యోగానికి.. సీఏ లేదా పీజీడీఎం/ఎంబీఏ లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివి ఉండాలి. దాంతోపాటు 8 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

 

వయో పరిమితి: మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) ఉద్యోగానికి.. అభ్యర్థి వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. చీఫ్ మేనేజర్ (్రెడిట్ అనలిస్ట్) ఉద్యోగానికి.. అభ్యర్థి వయసు 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.

 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 16.01.2018

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 04.02.2018

 

వెబ్‌సైట్:    http://www.sbi.co.in/bank.sbi

 


మరింత సమాచారం తెలుసుకోండి: