స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)... సాయుధ దళాలు (సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్), ఢిల్లీ పోలీస్ విభాగంలోని 1,223 ఎస్‌ఐ పోస్టులకు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లోని ఏఎస్‌ఐ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.

Related image

పోస్టులు:  సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ).

విభాగాల వారీ ఖాళీలు:  ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్‌ఐ-150 (పురుషులు-97+మహిళలు-53); సాయుధ దళాల్లో ఎస్‌ఐ

పోస్టులు:  సీఆర్‌పీఎఫ్‌లో 274 (పురుషులు), బీఎస్‌ఎఫ్‌లో 508 (పురుషులు-483+ మహిళలు-25), ఐటీబీపీలో 85 (పురుషులు-72+మహిళలు-13), ఎస్‌ఎస్‌బీలో 206 (పురుషులు). 
వేతన శ్రేణి: ఎస్‌ఐ-రూ.35,400-1,12,400; ఏఎస్‌ఐ-29,200-రూ.92,300. 

అర్హతలు:   ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఢిల్లీ పోలీస్ విభాగంలోని ఎస్‌ఐ పోస్టుల పురుష అభ్యర్థులకు అదనంగా ఎల్‌ఎంవీ డ్రైవింగ్ లెసైన్స్ (మోటార్ సైకిల్, కారు) ఉండాలి. 

వయసు:  2018, ఆగస్టు 1 నాటికి 20-25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక విధానం: రాతపరీక్ష (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్. పేపర్-1లో ఉత్తీర్ణులైన వారికి పీఈటీ, పీఎస్‌టీ నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే పేపర్-2 ఎగ్జామినేషన్ ఉంటుంది. రెండు పేపర్లలోనూ వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 

రాతపరీక్ష విధానం:  దీన్ని రెండు పేపర్లుగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పేపర్-1లో నాలుగు విభాగాలు.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం గరిష్ట మార్కులు 200. పరీక్ష వ్యవధి 2 గంటలు. పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ నుంచి 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. పేపర్-2 పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో మాత్రమే ఉంటుంది. రెండు పేపర్లలోనూ ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. 


శారీరక ప్రమాణాలు (ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్: పీఎస్‌టీ): ఎత్తు-ఎస్టీ (పురుష) అభ్యర్థులకు 162.5 సెం.మీ., మిగిలిన కేటగిరీ పురుషులకు 170 సెం.మీ., ఛాతీ-ఎస్టీ (పురుషుల)కు 77 సెం.మీ. (సాధారణం)-82 సెం.మీ. (గాలి పీల్చినపుడు); మిగిలిన కేటగిరీల పురుషులకు 80 సెం.మీ. (సాధారణం)-85 సెం.మీ. (గాలి పీల్చినపుడు); ఎస్టీ (మహిళ)లకు ఎత్తు-154 సెం.మీ., మిగిలిన కేటగిరీ మహిళలకు-157 సెం.మీ. అలాగే అందరు అభ్యర్థులకూ ఎత్తుకు అనుగుణంగా బరువు ఉండాలి. తగిన దృష్టి సామర్థ్యం (ఎన్ 6, ఎన్ 9; 6/6, 6/9), శారీరక, మానసిక ఆరోగ్యం, వినికిడి శక్తి ఉండాలి. టాటూ (పచ్చబొట్లు) ఉండకూడదు. 
దేహ దారుఢ్య పరీక్ష (ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్: పీఈటీ): పరుగు-100 మీటర్ల దూరాన్ని పురుషులు 16 సెకన్లలో, మహిళలు 18 సెకన్లలో పూర్తిచేయగలగాలి. అలాగే 1.6 కి.మీ. దూరాన్ని పురుషులు 6.5 నిమిషాల్లో, మహిళలు 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరిగెత్తగలగాలి; లాంగ్‌జంప్-పురుషులు 3.65 మీటర్ల దూరాన్ని, మహిళలు 2.7 మీటర్ల దూరాన్ని మూడు అవకాశాల్లోపు అధిగమించాలి; హైజంప్-పురుషులు 1.2 మీటర్ల ఎత్తును, మహిళలు 0.9 మీటర్ల ఎత్తును మూడు అవకాశాల్లోపు దూకగలగాలి; షాట్‌పుట్ (పురుషులకు మాత్రమే)- 16 ఎల్‌బీఎస్‌ను 4.5 మీటర్ల దూరానికి 3 అవకాశాల్లోపు విసరగలగాలి. 
దరఖాస్తు రుసుం:  రూ.100; ఎస్సీ/ఎస్టీ/మహిళ/మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు ఫీజు లేదు. 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్. 

దరఖాస్తు చివరి తేదీ:  ఏప్రిల్ 2, 2018. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.ssc.nic.inwww.ssconline.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: